ప్రకాశం

అంగన్‌వాడి కేంద్రాలకు త్వరలో నూతన భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,మే 1:రాష్ట్రంలో అంగన్‌వాడి కేంద్రాలకు త్వరలో నూతన భవనాలను నిర్మించేందుకు అన్నివిధాల చర్యలు తీసకుంటున్నట్లు రాష్ట్ర శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అంగన్‌వాడి కేంద్రాలకు కొన్ని సెంటర్లల్లో నూతన భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా నూతన భవనాలు ఎన్ని అవసరం అవుతాయో తెలుసుకుని త్వరగా నిర్మాణాలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 530 అంగన్‌వాడికేంద్రాలకు నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 350 నూతన భవనాలను పూర్తిచేయటం జరిగిందన్నారు.రాష్టవ్య్రాప్తంగా విడతల వారీగానూతన భవనాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిఆర్‌డిఎ, స్ర్తి,శిశుసంక్షేమశాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. డ్వాక్రామహిళలను అన్నిరంగాల్లో ఆదుకుంటున్నట్లు తెలిపారు. దివంగత రాష్టమ్రాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తే రాష్టమ్రుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలను ప్రొత్సాహించేందుకు డ్వాక్రాసంఘాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. డ్వాక్రాసంఘాలను బలోపేతం చేయటంలో ముఖ్యమంత్రిపాత్ర ఏనలేనిదన్నారు. డ్వాక్రామహిళలకు పదివేల రూపాయల చొప్పున రుణమాఫీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. శాఖల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లవిషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తేలేదని తెల్చిచెప్పారు. త్వరలో కోడిగుడ్లకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోడిగుడ్ల విషయంలో అవకతవకలు జరిగాయని, ప్రస్తుతం ఎలాంటి అవకతవకలు లేకుండా సరైన రీతిలో సరఫరా చేస్తున్నామన్నారు. పెద్ద సైజు కోడిగుడ్లు మాత్రమే అంగన్‌వాడికేంద్రాలకు సరఫరాచేసే విధంగా పిడి, సిడిపిఒ, అంగన్‌వాడి కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒక్కొక్క సిడిపిఒకు నాలుగుమండలాలు ఉంటాయని ఆ మండలాల పరిధిలో పౌష్టికాహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. అంగన్‌వాడికేంద్రాల్లో అందరు మహిళలే ఉంటారని ఆహారం విషయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకున్న విధంగానే కేంద్రాల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని సరైన ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్‌వాడిలు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. తన పరిధిలో అవకాశం ఉన్నంతవరకు సమస్య పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం ఆరుగంటలనుండి పదిగంటల వరకు, సాయంత్రం నాలుగుగంటలనుండి ఏడుగంటల వరకు పెన్షన్లను పంపిణీచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతికుటుంబానికి పదివేలరూపాయలు ఆదాయం వచ్చేవిధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 30వేలమంది హెచ్‌ఐవి బాధితులు ఉన్నారని, కేవలం రెండువేలమందికి మాత్రమే పెన్షన్లు పంపిణీచేస్తున్నారని విలేఖర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రతిఒక్కరికి పెన్షన్లు అందించేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్‌వాడి కేంద్రాల భవనాలకు స్ధలాల సమస్య ఉంటే స్ధానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకురావాలని పిడి విశాలక్ష్మిని ఆదేశించారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఒంగోలు, అద్దంకి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు, డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళి, డ్వామా పిడి పోలప్ప తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని సత్కరించిన ప్రజాప్రతినిధులు
బాపట్లపార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన మంత్రి పరిటాల సునీతను ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.