ప్రకాశం

ఘనంగా మేడే వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 1:ప్రపంచ కార్మికదినోత్సవమైన మేడేను జిల్లావ్యాప్తంగా కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు, వివిధ పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో కార్మికులు మేడే జెండాలను ఆవిష్కరించారు. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసి, భారత కమ్యూనిస్టుపార్టీ (మార్కిస్టు-లెనినిస్టు), న్యూడెమోక్రసి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్ - లెనినిస్టు) సిపిఐ (ఎంఎల్ ),ఒపిడిఆర్‌తోపాటు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ట్రేడ్‌యూనియన్ నాయకులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కార్మికులు కదం తొక్కారు. జిల్లామొత్తం ఎరుపుజెండాలతో ఎరుపుమయంగా మారింది. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జెండాను ఆపార్టీ జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఆవిష్కరించారు.ఎఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లోక్‌అదాలత్ జడ్జిలు నారాయణ, రాజావెంకటాద్రిలు పాల్గొన్నారు. ముందుగా ఎఐటియుసి జెండాను జడ్జి రాజావెంకటాద్రి ఆవిష్కరించారు. ఈమనిపాలెంలోని సిపిఎం(ఎంఎల్) కార్యాలయం వద్ద మేడే జెండాను రైతు కూలీ సంఘం జిల్లాకార్యదర్శి లలితకుమారి ఏగురవేశారు. ఈకార్యక్రమాల్లో సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు,ఒపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావలి సుధాకర్,సిపిఐ ఎంఎల్ జిల్లాకార్యదర్శి డివిఎన్ స్వామి, రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లాకార్యదర్శి లలితకుమారి, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లాకార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలకుల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికవర్గం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో విప్లవం జయప్రదం అయి వంద సంవత్సరాలు అయిన నేపధ్యంలో ఈ మేడేకి ప్రత్యేకత ఉందన్నారు. వర్తమానంలో ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు పెట్టుబడిదారి విధానం పరిష్కారం చూపలేకపోయిందన్నారు. దేశంలో పాలకులు అనుసరిస్తున్న విధానాలతో కార్మికవర్గ సమస్యలు మరింత జటిలమైందన్నారు. దోపిడి పెరిగిందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలకు కార్మికవర్గం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కార్మికుల ప్రయోజనాలను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విస్మరించాయని దుయ్యబట్టారు. ఈసందర్భంగా జడ్జి నారాయణరావు మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలని వివాదాల సందర్బంగా కోర్టులో పరిష్కరించుకోవాలనుకుంటే లోక్‌అదాలత్‌లో రాజీ పరిష్కారాలు చేసుకోవటం ఉత్తమమన్నారు.
ఇదిలా ఉండగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు -లెనినిస్టు) న్యూడెమోక్రసీ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో బానిస బతుకులకు అంతిమ గీతం అలపించి గొంతెత్తిన రోజు, ఎర్రటి రక్తం చిందినరోజు మేడేను చిత్రిస్తూ అరుణోయకళాకారులు సందేశాత్మకంగా ప్రదర్శించారు. తమ ఊపిరితో కొలిమిలో మంట మండిస్తున్న దృశ్యం, కార్మికులు సమ్మెటతో తమ చెమటను చిందిస్తూ వస్తువులును ఉత్పత్తిచేస్తున్న దృశ్యం, పోలీసు కాల్పుల్లో కార్మికులు వరిగిపోతున్న జెండాను భూజనికి ఎత్తుకున్న కార్మిక మహిళాపోరాటం ద్వారా కార్మిక హక్కులు సాధించబడ్తాయనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈకార్యక్రమాల్లో రాష్ట్రప్రధానకార్యదర్శి బి పద్మ, జిల్లానాయకులు సిఆర్ పద్మ, ఏఐటియుసి జిల్లాప్రధానకార్యదర్శి పివిఆర్ చౌదరి, సిపిఐ నగర కార్యదర్శి యు ప్రకాశరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌డి సర్ధార్, సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు, జిల్లాకార్యదర్శివర్గసభ్యులు పి హనుమంతరావు, జివి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఒపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావలి సుధాకర్, నాయకులు నాగేశ్వరరావు, బిజెపి నాయకులు ఎం అంజిబాబు, సిపిఐ ఎంఎల్ జిల్లాకార్యదర్శి డివిఎన్ స్వామి, రైతుకూలీ సంఘం జిల్లాకార్యదర్శి లలితకుమారి, ఎఐఎఫ్‌టియు నాయకులు కె వీరయ్య, ఎంఎస్ సాయితోపాటుపలు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.