జాతీయ వార్తలు

రాబోయే రైల్వే బడ్జెట్‌లో దక్షిణాదిపై దృష్టి : సురేశ్‌ ప్రభు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్‌: రాబోయే రైల్వే బడ్జెట్‌లో దక్షిణాదిపై దృష్టి సారించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంఎంటీఎస్‌ సేవలను శంషాబాద్‌ వరకు పొడిగించేందుకు, చర్లపల్లి, నాగులపల్లిలో గ్రీన్‌ఫీల్డ్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌-గుల్బర్గా, కాజీపేట-ముంబయి(వీక్లీ) రైళ్లను జెండా వూపి ప్రారంభించారు. నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని రెండు లిఫ్ట్‌లను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభించారు.