జాతీయ వార్తలు

అఖిలేశ్‌ కేబినెట్‌ నుంచి గనుల మంత్రి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌ : అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తరప్రదేశ్‌ గనుల శాఖ మంత్రి గాయత్రి ప్రజాపతిని కేబినెట్‌ నుంచి ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ తొలగించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి లేఖ పంపినట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. రాష్ట్రంలో మైనింగ్‌ అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టు జులై 28న ఆదేశించింది. దానిపై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. సీబీఐ దర్యాప్తు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని యూపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. ప్రజాపతిని 2013లో గనుల శాఖ మంత్రిగా స్వతంత్ర హోదా కల్పించి, 2014లో కేబినెట్‌ మంత్రిని చేశారు. ప్రజాపతిని తొలగించడం కంటితుడుపు చర్య మాత్రమేనని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.