జాతీయ వార్తలు

వౌనం వీడిన ప్రజ్ఞాసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్:్భపాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ వౌనం వీడి ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఆధిక్యాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. మహాత్మాగాంధీపైన, అయోధ్య అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ చేత చివాట్లు తిన్న ప్రజ్ఞాసింగ్ వౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. కాగా నేడు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా దిగ్విజయ్ సింగ్ సోదరుడు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తూ తాము ఆఖరి నిముషం వరకు తమ నమ్మకాన్ని కోల్పోమని అన్నారు. తాజాగా ప్రజ్ఞాసింగ్ ఇంటి నుంచి బయటకు వచ్చి ‘జైశ్రీరామ్’ అని నినదిస్తూ విక్టరీ సింబల్ చూపించారు.