ప్రకాశం

అడవి బిడ్డలను బతకనిద్దాం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, జనవరి 28: అడవులంటే చెట్లు, చేమలు వన్యమృగాలు మాత్రమే కాదని అడవి తల్లి బిడ్డలు చెంచు గిరిజనులు జీవిస్తున్నారని, వారిని బతకనిద్దామని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం నల్లమల లోతట్టు ప్రాంతంలోని చెన్నుపల్లి అటవీగూడెంను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన చెంచుగిరిజనుల ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు కూడా మనుషులేనని, వారి హక్కులను కాలరాయడం అన్యాయమని అన్నారు. అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులకు అజమాయిషీ ఉండవచ్చుకానీ, వారి హక్కులను కాలరాసే ప్రయత్నం చేయకూడదని అన్నారు. పశుసంతతిని కాపాడుకునేందుకు అడవి నుంచి పశుగ్రాసం తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తున్నానని, ఎవరైనా అధికారులు అడ్డుతగిలితే తనకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద భూములు సాగుచేసుకుంటున్న చెంచుగిరిజన రైతులకు ఈ ప్రాంతంలో జీవించే హక్కు ఉందని, వారికి నివేశన స్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, డిఎఫ్‌ఓ జయచంద్రారెడ్డి, ఎసిఎఫ్‌ఓ హిమశైలజ, గిద్దలూరు డిఎఫ్‌ఓ ఖాదర్‌బాషా, ఎఫ్‌డి ఎస్ శర్వానంద్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పాల్గొన్నారు.
కోటగట్ల చెరువు నిర్మాణం పూర్తిచేస్తాం
గత 25 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కోటగట్ల చెరువును తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిచేస్తామని అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం నల్లమల అటవీప్రాంతంలోని గంజివారిపల్లి సమీపంలో ఉన్న కోటగట్ల చెరువును ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో చెరువు నిర్మాణంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1870 ఎకరాలకు సాగునీరు అందించి సుమారు 7 గ్రామాల ప్రజలకు భూగర్భజలాల ద్వారా తాగునీరు అందించే కోటగట్ల చెరువును ఎన్నికోట్ల రూపాయలు ఖర్చయినా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిచేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజల పక్షాన ఉండి నిర్మాణం చేపడుతుందని, అటవీశాఖ అధికారులతో చర్చలు జరిగిన తరువాత త్వరలో కోటగట్ల చెరువును పక్యూలేషన్ ట్యాంకుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. నల్లమల అటవీప్రాంత పరిధిలోని గంజివారిపల్లి, వెంకటాద్రిపాలెం, వీరభద్రాపురం, జంగంవారిపల్లి, చెన్నరాయునిపల్లి తదితర గ్రామాలకు నీరు అందించే కోటగట్ల చెరువు విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పి డేవిడ్‌రాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం, రైతాంగ సమస్యల పరిష్కరం కోసం, గంజివారిపల్లి గ్రామస్తులు పార్టీలను పక్కనపెట్టి అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. కోటగట్ల చెరువు పూర్తయితే ఈప్రాంతం నుంచి కరవు పారిపోతుందని పేర్కొన్నారు. జిల్లాపరిషత్ మాజీ వైస్‌చైర్మన్ డాక్టర్ మనె్న రవీంద్ర మాట్లాడుతూ నాగరికతకు దూరంగా జీవనం సాగిస్తున్న చెంచుగిరిజనులు ఎనిమియా, మలేరియా వ్యాధులతో బాధపడుతున్నారని, మానవతా దృక్పథంతో చెంచుగిరిజనులను ఆదుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరిశపోగు ఎలిశమ్మ, జడ్పిటిసి మంత్రునాయక్, ఆర్డీఓ చంద్రశేఖరరావు, తహశీల్దార్ రత్నకుమారి, ఎంపిడిఓ హనుమంతరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వి లింగయ్య, నాయకులు ఎన్ మల్లికార్జుననాయుడు, కె సత్యనారాయణగౌడ్, జి శ్రీనివాసులరెడ్డి, జి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజ స్థాపనే అందరి ధ్యేయం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,జనవరి 28:పోలియోరహిత సమాజ స్థాపనే అందరి ధ్యేయం కావాలని, అందుకోసం ప్రతిఒక్కరు ఈ పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించి వంద శాతం లక్ష్యాలను సాధించాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రిమ్స్ కాలేజిలో పల్స్‌పోలియో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండాఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమవంతు బాధ్యతగా బిడ్డలను పోలియోకేంద్రాల వద్దకు తీసుకువెళ్ళి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సూచించారు. ఈసందర్భంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ పల్స్‌పోలియో చుక్కలను ఐదుసంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా వేయించాలన్నారు.
పోలియో మహమ్మారికి పిల్లలు బలికాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందుకు అనుగుణంగా అన్నిశాఖలు సమన్వయంతో ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరక్టర్ టి నీరద మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామస్ధాయిలో పల్స్‌పోలియో చుక్కలపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. పల్స్‌పోలియోచుక్కల ప్రాముఖ్యతను తెలియచేసి ప్రయాణంలో ఉన్నవారికి, హైరిస్క్‌ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియోచుక్కల అందేలా చూడాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఆదివారం ఉదయం ఏడుగంటలనుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఆరోగ్యకేంద్రాల్లో పోలియో చుక్కలు ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మొబైల్‌టీం, రోడ్డుసూపర్‌వైజర్లు అందరు సకాలంలో పోలియోచుక్కలు బిడ్డలకు అందేలా చూడాలన్నారు. పోలియో అవగాహన లోపం బిడ్డలపాలిట శాపం అని తెలియచేసి పోలియోపట్ల అవగాహన కల్పించి ప్రతిబిడ్డకు పోలియోచుక్కలు వేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె యాస్మిన్ మాట్లాడుతూ జిల్లాలోని 2499 పల్స్‌పోలియో బూత్‌ల్లో 92 మొబైల్ కేంద్రాల ద్వారా 22 ట్రాన్సిస్ట్‌బూత్‌ల ద్వారా ఐదేళ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలను వేసేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. పోలియోచుక్కల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు నియోజక వర్గాన్ని
జిల్లాకే తలమానికంగా అభివృద్ధి పరుస్తా
కొత్తపట్నం, జనవరి 28 : ఒంగోలు నియోజక వర్గాన్ని జిల్లాకే తలమానికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. శనివారం అల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ అల్లూరు గ్రామంలో మంచినీటి కొరత తీరుస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నల్లవాగు పై వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని , వంతెన పూర్తి అయిన వెంటనే ఒంగోలు నుండి కె పల్లిపాలెం బీచ్ వరకు 35 అడుగుల వెడల్పు కలిగిన రోడ్ల పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
మండలంలోని నిజమైన లబ్ధిదారులందరికీ వంద శాతం రేషన్‌కార్డులు, పెన్షన్లు మంజూరు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరుగుదొడ్లు వంద శాతం పూర్తి చేసి స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్‌కు నాంది పలికామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు ఐలా సుబ్బారావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గేనం సుబ్బారావు, మాజీ ఎంపిపి నాళం నర్సమ్మ, వాయిల మోహన్‌రావు, జడ్పిటిసీ దాసరి విజయ, ఎంపిటిసీలు నాటారు తిరుపతిరెడ్డి, దాసరి పోలయ్య, ఎయంసి చైర్మన్ సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్టప్రతి మెడల్
అందుకున్న పొదిలి వాసి
పొదిలి, జనవరి 28 : పొదిలికి చెందిన రాజశేఖర్ అత్యున్నత పురస్కారమైన రాష్టప్రతి మెడల్‌కు ఎంపికైనారు. ఆయన ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీ చేతుల మీదుగా అవార్డునందుకున్నారు. పొదిలి పట్టణానికి చెందిన రాజశేఖర్ చెన్నైలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో రాజశేఖర్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయన అవార్డుకు ఎంపికైనారు. ఆయన 1995లో సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో గ్రూప్ -3 అధికారిగా విధుల్లో చేరారు. ఆయనకు అవార్డు రావడం పట్ల తన తల్లిదండ్రులు కెవి కృష్ణారావు, గిరిజాకుమారితో పాటు వారి బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పది రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించరా..?
మార్కాపురం, జనవరి 28: మార్కాపురం ఆర్టీసీ డిపో అసిస్టెంటు మేనేజర్‌ను బదిలీ చేయాలని కోరుతూ కార్మికులు గత పదిరోజులుగా రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికులను వ్యక్తిగతంగా దూషించడమే కాక ఆర్టీసీకి నష్టం కలిగించే పనులు చేస్తుండంటూ గత పదిరోజులుగా ఆర్టీసీ కార్మికుల ఐక్యకార్యచరణ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. మార్కాపురం డిపో నుంచి బెంగళూరుకు మూడు బస్సులు ఉండగా తరచూ వాటిని రద్దుచేస్తూ ప్రైవేటు బస్సులను ప్రోత్సహించడంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోందని కార్మికులు చేస్తున్న ఆరోపణ. ఇదిలా ఉంటే కార్మికులను కూడా వేధింపులకు గురిచేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, చెప్పినట్లు వినకుంటే కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గత పదిరోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే అటు డిపో మేనేజర్ కాని, ఇటు జిల్లా అధికారులు కానీ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటమేకాక తరచూ పలు సర్వీసులను అర్థాంతరంగా పిపిసి పెడుతూ ప్రైవేటు యాజమాన్యానికి సహకరిస్తున్న ఈ అసిస్టెంటు మేనేజర్‌పై చర్యలు తీసుకోవడం కాని లేదా కార్మికులతో చర్చలు జరిపి రిలే నిరాహార దీక్షలు నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు పేర్కొంటున్నారు.

అద్దంకిలో అస్తవ్యస్తంగా రోడ్డు విస్తరణ పనులు
అద్దంకి, జనవరి 28: అద్దంకిలో రాష్టర్రోడ్డు విస్తరణ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని పట్టణ అభివృద్ధి కమిటి అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. శనివారం సాయంత్రం స్ధానిక శ్రీకమఠేశ్వరాలయంలో పట్టణ అభివృద్ధి కమిటి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు అస్తవ్యస్తంగా ఉండడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఎత్తుగా ఉన్న వేగనిరోధకాలు వెంటనే తొలగించాలన్నారు. రోడ్డు విస్తరణపై ప్రజలకు అవగాహన కలిగేందుకు ఆర్‌అండ్‌బి అధికారులు పత్రికా పరంగా ప్రకటన చేయాల్సి ఉందన్నారు. విస్తరణ పనులు జరుగుతున్న చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, విస్తరణ జరుగుతున్న నేపధ్యంలో రోడ్డుపై గుంటలు మెట్టలు సరిచేయాలని సూచించారు. రోడ్డు విస్తరణలో అస్తవ్యస్తంగా ఉన్న విషయాలను ఉన్నతాధికారులుకు టపా ద్వారా తెలియచేస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే పట్టణ ప్రజలు ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రఘ, చలమారెడ్డి, ప్రసాదు, తదితరులున్నారు.

జిల్లా జైలును సందర్శించిన
న్యాయకాలేజి విద్యార్థ్ధులు
ఒంగోలు అర్బన్,జనవరి 28: ఒంగోలు ఇందిరాప్రియదర్శిని న్యాయకాలేజి చివరి సంవత్సరం విద్యార్థులు పారాలీగల్ సర్వీసెస్‌లో భాగంగా శనివారం జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయకాలేజి ప్రిన్సిపాల్ నటరాజ్‌కుమార్, జైలర్ టిఎస్ రామచంద్రరావు జైలులోని అన్నివిభాగాలను విశదీకరిస్తూ వివరించారు. ఈకార్యక్రమంలో కాలేజి ఉపాధ్యాయులు హరిబాబు, సుంకర సాయిబాబు విద్యార్ధులు పాల్గొన్నారు.