ప్రకాశం

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 13: జిల్లాలోని 55 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాంకు రుణాలతో పాడిగేదెలను ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సీపీఓ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుస కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు బ్యాంకు రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో 2017-18 సంవత్సరానికి పశుసంవర్థక శాఖ ద్వారా రెండువేల పాడిగేదెల యూనిట్లు బ్యాంకు రుణాలతో పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 400 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయడంపై ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు మంజూరయిన రెండువేల పాడిగేదెల యూనిట్లను ఈ నెల 31వ తేదీలోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కరువు పరిస్థితుల దృష్ట్యా 55 మండలాల్లో పంటనష్ట వివరాలను గ్రామాల వారీగా, పంటల వారీగా సేకరించాలని, 33నుండి 50శాతం వరకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన పంటల వివరాలు తయారుచేసి బ్యాంకర్లకు వెంటనే అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 33నుండి 50శాతం వరకు పంటలు నష్టపోయిన రైతులకు రెండు సంవత్సరాల పంటరుణాలు రీ-షెడ్యూల్ చేయాలని, 50శాతం పైబడి పంట నష్టపోయిన రైతులకు మూడు సంవత్సరాలు రీ-షెడ్యూల్ చేయాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్‌లో కొత్త పంటరుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. 2017-18 సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గానికి 12.76 కోట్ల రూపాయలతో 638 యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదించిన ప్రణాళికను జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదించింది. జిల్లాలో సంక్షేమశాఖల ద్వారా అమలుచేస్తున్న బ్యాంకు రుణాలు 2016-17 సంవత్సరానికి సంబంధించి యూనిట్లు ఈనెల 20వ తేదీనాటికి గ్రౌండింగ్ పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేసారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన బ్యాంకు రుణాలు ఈ నెల 30వ తేదీలోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని చెప్పారు. వివిధ సంక్షేమశాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన సబ్సిడీ రుణాలతో మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్‌ను బ్యాంకర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ పద్ధతిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 మార్కండేయులు, సీపీఓ కెటి వెంకయ్య, సిండికేట్ బ్యాంకు ఎల్డీఎం వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం హరిబాబు, నాబార్డు ఏజీఎం జ్యోతి శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు.