ప్రకాశం

బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు జిల్లా అభివృద్ధికి నిధులు ప్రకటించకపోతే తీవ్ర ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 13: జిల్లాలోని సీపీఎం పార్టీకి చెందిన 50 మంది నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమకేసులను వెంటనే ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో మధు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి, జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలని రాజ్యాంగబద్ధంగా సీపీఎం నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒంగోలు నగరంలో ప్రదర్శన నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తుంటే పోలీసులు అక్కడకు పెద్దఎత్తున మొహరించి సీపీఎం నాయకులతో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలను కూడా బలవంతంగా అరెస్ట్‌చేసి వారిపై నాన్‌బెయిల్ వారెంట్ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపండం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం వారిని వెంటనే విడుదల చేయాలని లేకుంటే తీవ్ర ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రకాశం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా అని, ప్రభుత్వం ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి, జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఎపికి ప్రత్యేక హోదా తోపాటు, రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను సాధించుకొని తీరుతామని ఆయన తెలిపారు. సిపియం నాయకుల అక్రమ అరెస్ట్‌లను ఖండించి మద్దతు తెలిపేందుకు వచ్చిన వైకాపా, కాంగ్రెస్, వామపక్ష, వివిధ ప్రజా సంఘాల నాయకులందరికి మధు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి మట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్‌చేసి వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం బాధాకరం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. సీపీఎం నాయకులను విడుదల చేసేవరకు ఏ పోరాటం చేసినా వైకాపా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల తూటాలు, లాటీలు ఉధ్యమాలను ఆపలేవని ఆయన హెచ్చరించారు. ఈ విలేఖర్ల సమావేశంలో సీపీఎం నాయకులు పెండ్యాల హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజా ఉధ్యమాలను అణచివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. జైలులో ఉన్న సీపీఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసి నాయకులు, పిఓ డబ్ల్యూ నాయకురాళు బి పద్మ, ప్రకాశం జిల్లా అభివృద్ది వేదిక నాయకులు టి గోపాలరెడ్డి, సుపరిపాలన వేదిక నాయకులు సంషీర్ అహ్మద్, జన విజ్ఞాన వేదిక నాయకులు ఎవి పుల్లారావు, సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి ఎస్‌డి సర్ధార్, జిల్లా నాయకులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొని మాట్లాడారు.

జిల్లా అభివృద్ధికి నిధులు అడిగితే అరెస్ట్ చేస్తారా
* ఖండించిన పశ్చిమ ప్రాంత సీపీఎం నాయకులు
పొదిలి, మార్చి 13: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆందోళన చేస్తున్న 50మంది సీపీఎం నాయకులను అరెస్ట్‌చేసి వారిని జైలుకు పంపడం అన్యాయమని పశ్చిమ ప్రాంత సీపీఎం తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ నాయకులు ఎం.రమేష్ మంగళవారం పొదిలిలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ సంఘటన ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని విమర్శించారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి జిల్లా అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, రామాయపట్నం పోర్టును అనుమతించాలని, వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా సీపీఎం చేపట్టిన ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిర్ధాక్షిణ్యంగా అరెస్ట్‌చేసి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలించడం శోచనీయమని రమేష్ అన్నారు. ఈ సంఘటన ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. అరెస్టయిన సీపీఎం నాయకులను, కార్యకర్తలను బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు శేషయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.