ప్రకాశం

కండె అవిశ్వాస తీర్మానంపై మంత్రి స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 13: అనేక నాటకీయ పరిణామాల మధ్య పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కండె శ్రీనివాసరావుపై కొంతమంది డైరక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి రాష్ట్ర సహకారశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం స్టే ఇచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి బ్రేక్‌పడింది. సోమవారమే అవిశ్వాసంపై ఎన్నిక జరగవలసి ఉండగా ఎన్నికల అధికారికి జ్వరం కారణంగా అవిశ్వాస తీర్మానం మంగళవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంత్రి స్టే ఇవ్వటంతో కండె ఊపీరి పీల్చుకున్నారు. కండెను తొలగించాలంటూ డైరక్టర్ మస్తానయ్య తదితరులు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. ఈ వ్యవహరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లింది. బ్యాంకు పాలకవర్గం గడువు మే 28వ తేదీవరకు ఉంది. ఈ కొంతకాలానికే అవిశ్వాస తీర్మానం, దళితుల పట్ల పార్టీ వ్యతిరేకత ఎందుకనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కండెకు మంత్రి స్టే తీసుకువచ్చే విషయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ప్రధాన భూమిక పోషించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన మంత్రులు శిద్దా రాఘవరావు, పి నారాయణ కూడా కండెకే మద్దతు పలికినట్లు తెలుస్తొంది. మొత్తంమీద కండెపై పెట్టిన అవిశ్వాసానికి మంత్రి స్టే ఇవ్వటంతో మస్తానయ్య వర్గం గుర్రుగా ఉంది.