ప్రకాశం

ప్రత్యేకహోదా పోరులో మేమే వీరులం:ఎంపి వైవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటు సాక్షిగా ఇచ్చినా ప్రత్యేకహోదా హామీ అమలు కోసం ఇప్పటివరకు రాజకీయపార్టీలు సాగిస్తున్న పోరాటాల్లో తామే వీరులమని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఢిల్లీలో ప్రత్యేకహోదా సాధనకు నిరాహర దీక్షలు, వివిధ పోరాటాలు చేసిన అనంతరం స్వగ్రామమైన మేదరమెట్లకు గురువారం వచ్చిన వైవీకి పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో మేదరమెట్లకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు నార్త్‌బైపాస్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుండి ర్యాలీగా గ్రామంలోకి వచ్చిన ఆయన బస్టాండు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధనకు తమ ఎంపీలు ఢిల్లీలో ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నిరాహర దీక్షలు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై చర్చ జరగాలని, హోదా సాధన కోసం తమ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు కూడా చేశామన్నారు. భవిష్యత్తులో ప్రత్యేకహోదా కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చేంత వరకు తమపార్టీ జగన్ నాయకత్వంలో నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద తన తండ్రి చినపోలిరెడ్డి, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ విజయమ్మ 63వ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటుచేసిన భారీకేక్‌ను ఆనందోత్సవాల మధ్య కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన చెంచుగరటయ్య, వైకాపా నాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, గ్రామసర్పంచ్ పేరం నాగలక్ష్మి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.