ప్రకాశం

బిఇడి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 23 : జిల్లాలో నేటి నుండి జరుగుతున్న బిఇడి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం తహశీల్దార్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బిఇడి పరీక్షలపై సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదినుండి 26వ తేది వరకు బిఇడి నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలు జిల్లాలోని 12 మండలాల్లో 26 కేంద్రాల్లో జరుగుతున్నాయన్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించాలన్నారు. అన్నీ చోట్ల గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజూ పరీక్షా కేంద్రాల తనిఖీలు, ఫోటోలను తహశీల్థార్లు టెలీగ్రామ్ గ్రూప్‌లో పోస్టు చేయాలని, పరీక్షలు జరిగే తీరు తెన్నులపై నివేదికలు పంపాలని ఆదేశించారు. అన్నీ పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు జరిగే సమయంలో జెరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని ఆదేశించారు.

ప్రకాశం జిల్లాకు రాష్ట్ర పురస్కారం
ఒంగోలు, ఏప్రిల్ 23 : రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రకాశం జిల్లా ఉత్తమ పనితీరు కనబర్చినందుకు రాష్టస్థ్రాయి పురస్కారానికి ఎంపికైంది. ఆ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా కమిషనర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందింది. ఈ నెల 24న మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న జాతీయ పంచాయతీరాజ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ మహోత్సవంలో ప్రకాశం జిల్లా బృందం పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సోమవారం రాత్రి ఒంగోలు నుండి బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే బహిరంగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా కలెక్టర్ వినయ్ చంద్ రాష్ట్ర పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు డ్వామా పీడీ పోలప్ప, ఎపిడి, ఎంపిడివో, ఇద్దరు సర్పంచ్‌లతో కూడిన 15 మంది బృందం బహుమతిని తీసుకునేందుకు జిల్లా నుండి బయలుదేరి వెళ్లారు.