ప్రకాశం

బడిఈడు పిల్లలందరికీ ప్రాథమిక విద్య తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 23 : బడి ఈడు పిల్లలందరికీ ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్యను తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలు మండలం త్రోవగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తొలుత సరస్వతిదేవి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్యను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. చదువు లేని వారు వింత పశువు అనే ఆర్యోక్తి అందుకోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. ఎంత ఆస్తి ఉన్నా జీవితంలో చదువు చాలా ముఖ్యమన్నారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈనెల 23వ తేది నుండి 30వ తేది వరకే కాకుండా కార్యక్రమాలు పూర్తయ్యేవరకు పొడగించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా బోధన ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇవే కాకుండా మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, మంచినీరు, ఆటస్థలాలు, డిజిటల్ తరగతులు తదితర వసతులన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన తరువాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అలాగే ఐదోతరగతి పూర్తయిన తరువాత ఆరవ తరగతిని ప్రాథమికోన్నత పాఠశాల్లో ఆ తరువాత ఉన్నత పాఠశాలల్లో చేర్పించి పదో తరగతి వరకు చదివించాలన్నారు. ఆడపిల్లలు ఎక్కువగా మధ్యలో చదువు మానేసే పరిస్థితి ఉందన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు బాలికల విద్య పట్ల ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. కస్తూరీభా గాంధీ బాలికా విద్యాలయాల్లో మంచి విద్యాబోధన, అన్నీ వసతులు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొంది నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. బడి ఈడు పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్ష కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలల్లో ఉచితంగా విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు ముఖ్యంగా పేదవారు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలన్నారు. పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి తల్లిదండ్రులకు, పాఠశాలలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాప్రగతికి పెద్దపీట వేసిందన్నారు. 2020 నాటికి రాష్ట్రం జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో దక్కించుకోవాలనే దిశగా ముఖ్యమంత్రి మే 1వ తేది నుండి జ్ఞానధార కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరువేల డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం కాగా ఇప్పటివరకు రెండు వేల 500 తరగతులు ఏర్పాటు అయ్యాయని, అందులో ప్రకాశం జిల్లాలో 160 తరగతులు ఏర్పాటు చేయడం సంతోషదాయమన్నారు. సర్వశిక్షా అభియాన్ పివో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. జిల్లాలో 22 వేల 346 మంది బడి ఈడు పిల్లలు పాఠశాలలకు రావడం లేదని , వారందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్,వర్చువల్ తరగతులు , మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, తాగునీరు వంటి ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయడంతో పాటు కస్తూర్భగాంధీ విద్యాలయాల్లో ఆర్వో పాంట్లు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి విఎ సుబ్బారావు మాట్లాడుతూ విద్యారంగంలో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. పేద కుటుంబాలు ఆర్థికభారంతో కుంగిపోకుండా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదివించాలన్నారు. ఈ సందర్భంగా 1 నుండి 6 తరగతుల్లో చేరబోయే విద్యార్థులకు ప్రవేశ పత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే దామచర్ల అందించారు. అనంతరం మన ఊరు-మన బడి కార్యక్రమంపై , 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు సంకల్పం పేరిట విద్యాశాఖ రూపొందించిన కరపత్రాలు, పుస్తకాలను కలెక్టర్, దామచర్ల ఆవిష్కరించారు. అనంతరం విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కోసం తయారు చేసిన ప్రచారరథాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి దయానందం, ఎంఈవో కిశోర్‌బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుధాకర్‌బాబు, విద్యా దాత ఆలపాటి శ్రీరాం, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వై శ్రీనివాసరావు, జన్మభూమి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.