ప్రకాశం

బీసీ సబ్‌ప్లాన్ కింద బడ్జెట్‌లో రూ 13వేల కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 23:రాష్ట్రప్రభుత్వం బలహీనవర్గాల ప్రజల సంక్షేమం కోసం బీసీ సబ్‌ప్లాన్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 13వేల కోట్లరూపాయలు బడ్జెట్‌లో కేటాయించినట్లు కలెక్టర్ వి వినయ్‌చంద్ తెలిపారు. సోమవారం స్థానిక నెల్లూరు బస్టాండు సెంటర్‌లోని డిఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూలు గ్రౌండ్స్‌లో వెనుకబడిన తరగతుల ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆదరణ -2 పధకం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో 2014 సంవత్సరంనుండి రాష్టబ్రడ్జెట్‌లో దశలవారీగా బిసి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. కులవృత్తులు చేసుకునే వారిని ఆదుకోవాలని వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక ఆదాయం సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ పధకాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షలమంది లబ్ధిదారులకు 750 కోట్లరూపాయలతో ఆదరణ పధకాన్ని ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. బలహీన వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈకార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిని తరగతుల కులాలను అన్నివిధాల ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వెనుకబడిన తరగతుల కులాల వారికి 90శాతం సబ్సిడిపై ఆధునాతన పనిముట్లు అందించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. ఈకార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత,ఎపి నారుూబ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎపి రజక ఫెడరేషన్ చైర్మన్ రాజమండ్రి నారాయణ, విశ్వబ్రహ్మాణ ఫెడరేషన్ చైర్మన్ సింహద్రి కనకాచారి, నాయకులు ఏలూరి కోటేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, చిన్న వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమశాఖాధికారులు నాగేశ్వరరావు, లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు.