రాష్ట్రీయం

ప్రకాశంకు జాతీయపెట్టుబడుల ఉత్పాదక కేంద్రం మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 28: రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో జాతీయపెట్టుబడుల ఉత్పాదక కేంద్రం మంజూరైంది. ఈమేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ పెట్టుబడుల ఉత్పాదక కేంద్రం వచ్చేందుకు ఒంగోలు ఎంపి వై వి సుబ్బారెడ్డి నిరంతరం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలతో పలు దఫాలు చర్చించారు. కనిగిరి నియోజకవర్గపరిధిలోని 14వేల 230 ఎకరాలను ఎస్‌పివి కంపెనీకి బదిలీ చేయాలని ఆమేరకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. రెండువేల ఎకరాలు సిద్ధంగా ఉందని వెంటనే పనులను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్లు ఆయన పేర్కొన్నారు. 2020 నాటికి మొదటివిడత పూర్తిచేయాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరినట్లు తెలిపారు.