జాతీయ వార్తలు

ఓటమి భయంతోనే ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ నేత ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పార్టీ రాజస్థాన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జావడేకర్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఓటమిని అంగీకరించే ప్రతిపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే అతి పెద్ద పార్టీగా ఉండే కాంగ్రెస్ తోకపార్టీగా మారిందని అన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు జరగవని కాంగ్రెస్ నేత అశోక్‌గెహ్లోత్ చేసిన ఆరోపణలను ఖండించారు. 2024,2029 ఎన్నికలు జరుగుతాయని, కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాదన అన్నారు.