ప్రకాశం

రామాయపట్నంలో భారీ ఓడరేవు- నౌకానిర్మాణా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 22: జిల్లాలోని రామయపట్నంలో భారీ ఓడరేవు- నౌకానిర్మాణ కేంద్రాన్ని కేంద్రప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా రామాయపట్నంలో భారీ ఓడరేవు- నౌకా నిర్మాణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాలనే ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లి, మైనర్‌పోర్టు నిర్మించాలనే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోని, తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, జిల్లా ప్రజలను తప్పు దారి పట్టిస్తున్న రాష్ట్ర మంత్రుల చర్యలను ప్రజలు ఖండించాలని అభివృద్ధి వేదిక నాయకులు కోరారు. శనివారం స్థానిక కళ్యాణి కాన్ఫరెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రకాశం జిల్లా అభవృద్ది వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుండూరి రంగరావు, కొమ్మూరి కనకారావు, కార్యవర్గ సభ్యులు మారెళ్ల మారుతీరావు, చుంచు శేషయ్య, వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి కె అరుణ, అభివృద్ధి వేదిక నాయకులు చెరుకూరి కిరణ్ పాల్గొన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో తొలుత ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షులు చుండూరి రంగారావు మాట్లాడుతూ రామాయపట్నంలో భారీ ఓడరేవు-నౌకానిర్మాణం చేపట్టాలని కోరుతూ ప్రకాశం జిల్లా ప్రజలు 2014 నుండి చేసిన ఆందోళనల ఫలితంగా ఇప్పటి ఎన్‌డిఎ, కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థల ద్వారా తిరిగి సర్వే చేయించి దుగరాజపట్నం దగ్గర ఓడరేవు స్థాపన వీలుపడదని, నష్టదాయకమని, తేల్చి వేరే అనువైన ప్రదేశాన్ని సూచించమని మఖ్యమంత్రి చంద్రబాబుని కోరి నాలుగు నెలలు గడిచినప్పటికీ చంద్రబాబు వౌనంగా ఎందుకు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వానికి భారీ ఓడరేవు స్థాపనకు మన రాష్ట్రంలో అనువైన మరొక ప్రదేశాన్ని ఎందుకు సూచిండం లేదని ఆయన విమర్శించారు. రామాయపట్నంపట్నంలో భారీ ఓడరేవు- నౌకా నిర్మాణం పెట్టేందుకు అవసరమైన లేఖను కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాసి పంపితే రామాయపట్నంలో మేజరు పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి 25వేల కోట్ల రూపాయలు నుండి 50వేల కోట్ల రూపాయల వరకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉందని కనుక ఆ వైపు గా ఆలోచించి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయకుండా రామాయపట్నంలో ఎందుకు పనికిరాని మైనర్ పోర్టు నిర్మిస్థామని రాష్ట్ర మంత్రి వర్గ క్యాబినెట్ ఆమోదించి జిఓ విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం క్రిష్ణపట్నం పోర్డు వారికి ప్రయోజనం చేకూర్చేందుకేనని ఆయన విమర్శించారు. అభివృద్ధి వేదిక కార్యవర్గ సభ్యులు మారెళ్ల మారుతీరావు మాట్లాడుతూ రామాయపట్నం అన్ని విధాలుగా భారీ ఓడరేవుస్థాపనకు అనువైనదని, అక్కడే భారీ ఓడరేవు స్థాపించాలని 2012 సెప్టెంబర్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి కి గట్టిగా సిఫారసు చేస్తూ లేఖ వ్రాస్తూ దానికి అవసరమైన భూమి, పునరావాస ఖర్చు ఓడరేవుకు రైలు, రోడ్డు మార్గాలతో లింకేజికి అవసరమైన వౌలిక వసతులకోసం 350 కోట్ల రూపాయలు వరకు భరిస్థామని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు తెలియదా అని ఆయన విమర్శించారు. అన్ని తెలిసి వారు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. అప్పటిలో నెల్లూరు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు స్వార్థంతో క్రిష్ణపట్నం వద్ద ఓడరేవు ఉన్నప్పటికి సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ల పై వత్తిడి తీసుకొచ్చి ముఖ్యంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సిఫారస్సులకు విరుద్దంగా అనువుగాని దుగరాజుపట్నంలో పోర్టు నెలకొల్పాలని అనేక రకాలుగా వత్తిడి తీసుకరావడం జరిగిందని, ఆ వత్తిడులకు లొంగి అప్పటి ప్రధాని ఆధ్వర్యంలో క్యాబినెట్ కమిటి, సంబంధిత విషయాలను క్షుణంగా పరిశీలింకుండా పులికాట్ సరస్సు పక్షుల రక్షణ కేంద్ర భూముల్లో ఆ భారీ ఓడరేవును నెలకొల్పేందుకు ఒక చట్ట విరుద్ధమైన నిర్ణయాన్ని 2013 న తీసుకున్నారన్నారు. దీంతో ఈ చర్యలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ప్రజలు ఆందోలనలు చేసిన మీదట ప్రస్తుత ఎన్‌డిఎ, కేంద్ర ప్రభుత్వం తాము ఎపిలో ఒక భారీ ఓడరేవు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అనువైన ప్రదేశాన్ని సూచిస్తూ లేఖ రాస్తే నిర్మాణానికి సంబంధించి అవసరమైన నిధులు విడుదల చేస్తామని సూచించినప్పటికీ చంద్రబాబు ప్రజల ఆకాంక్ష అయిన రామాయటపట్నంలో భారీ ఓడరేవు- నౌకా నిర్మాణం కోసం లేఖ రాయకుండా, క్రిష్ణపట్నం పోర్టు వారితో లాలూచిపడి వారికి ప్రయోజనాన్ని చేకూర్చేందుకు రామాయపట్నంలో మైనర్ పోర్టు నిర్మిస్తామని జిఓ విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రామయపట్నంలో మేజర్ పోర్టు వస్తే జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందటం తోపాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అవకాశాలు రావడం వలన జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి కె అరుణ మాట్లాడుతూ
ప్రకాశం జిల్లా ప్రజలందరూ జిల్లాలోని రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మించాలని కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం రామాయపట్నంలో మైనర్‌పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపి అందుకు సంబంధించి జిఓ విడుదల చేయడం దారుణమన్నారు. రామాయపట్నంలో మైనర్ పోర్టు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయంపై రామాయపట్నంలో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు రామాయపట్నంకు మైనర్ పోర్టును చంద్రబాబు ప్రకటించడం పట్ల చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకు అభినందన సభ ఏర్పాటు చేయడాన్ని ఆమె ఖండించారు. రామాయపట్నంలో మైనర్ పోర్టును చంద్రబాబు ప్రకటించడం ఇది ఎన్నికలలో లబ్ధిపొందేందుకేనన్నారు. రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మించే వరకు పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.