క్రైమ్/లీగల్

ఒంగోలులో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 22: ఒంగోలు మంగమూరు రోడ్డులోని సాంబశివ నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో కూలిపనులు చేస్తున్న ఇద్దరు కూలీలు శనివారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికి అక్కడే మృతి చెందారు. ఒంగోలు తాలూకా పోలీసులు కధనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలు సాంబశివ నగర్‌లో ఒక కొత్త అపార్ట్‌మెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చేకూరపాడు గ్రామానికి చెందిన గూండాల రమేష్ బాబు (42) తొపాటు అదే గ్రామానికి చెందిన లింగంగుంట మహేష్‌బాబు (30) అనే ఇద్దరు యువకులు కూలిపనుల నిమిత్తం వచ్చారని తెలిపారు. వీరు అపార్ట్‌మెంట్‌లోని 3వ ప్లోర్ లో భవన నిర్మాణ పనుల లెంటిల్, భీమ్‌ల పనులు చేస్తున్నారు. దీంతో ఆ ఇద్దరు కూలీలు లెంటిల్, భీములు కట్టేందుకు క్రిందనుంచి పైకి ఐరన్ రాడ్ లు అందిస్తుండగా ప్రమాదవ శాత్తూ ప్రక్కనే ఉన్న 11కెవి లైన్ విద్యుత్ తీగకు ఐరన్ రాడ్ తగలటంతో గుండాల రమేష్ బాబు (42), లింగంగుంట మహేష్ బాబు (30) అనే ఇద్దరు ప్రమాదవ శాత్తూ విద్యుత్ షాకుకు గురై అక్కడికి అక్కడే మృతి చెందినట్లు ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆమేరకు కేసునమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

రెండు లక్షల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం
పొదిలి,సెప్టెంబర్ 22:రెండులక్షల రూపాయల విలువైన గుట్కా, ఖైనీ లాంటి నిషేధిత పదార్ధాలను పొదిలి పోలీసులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పట్టణ శివారులోని టైలర్స్‌కాలనీ సమీపంలో ఒక వ్యక్తి గుట్కా,ఖైనీలతో సంచరిస్తుడని సమాచారం అందుకున్న పొదిలి ఎస్‌ఐ శ్రీరాం తన సిబ్బందితో దాడి చేసి నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద నుండి సుమారు రెండు లక్షల రూపాయలు విలువైన గుట్కాలు, ఖైన్లీ ల సంచులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పై ఎస్ ఐ శ్రీరాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.