ప్రకాశం

వైకాపా నవరత్నాలు అన్ని వర్గాల ప్రజలకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, సెప్టెంబర్ 22: వైకాపా అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకం అన్ని వర్గాల ప్రజలకు వరం అని కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 3వ వార్డులో రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమం మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం రావాలంటే జగన్‌తోనే సాధ్యం అన్నారు. రూ. 1000 దాటిన ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆర్థిక భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను బడికి పంపితే రూ.15వేలు తల్లుల ఖాతాలో జమ అవుతాయన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నవరత్నాలు పేరిట పథకం రూపొందించడం జరిగిందన్నారు. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వర్ణయుగం తిరిగి రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తోకల కొండయ్య, జి గంగిరెడ్డి, వి మాల్యాద్రి, అల్లాభక్షు, సంధాని, హజరత్, మహబూబ్‌బాషా, ఎం కృష్ణ, దాసరి మాల్యాద్రి, డిసిహెచ్ మాలకొండయ్య, దారం మాల్యాద్రి, నరసయ్య, జె కోటేశ్వరరావు, కామాక్షినాయుడు, మురార్జి, యు నాగేశ్వరరావు, పెంచల్‌రెడ్డి, జవహర్‌బాషా, గేరా మనోహర్, ఎన్ నారయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

కుల నిర్మూలన కోసం పోరాడుదాం
- విరసం నేత కళ్యాణ్‌రావు
ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 22 : కులాంతర వివాహాలు చేసుకున్న వారిని హతమార్చే హత్యలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం పోరాడుదామని విరసం రాష్ట్ర నాయకులు జి కళ్యాణ్‌రావు పిలుపునిచ్చారు. కెయంపియస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపి ఐ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా కార్యదర్శి ఎం వెంకట్రావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణరావు మాట్లాడుతూ మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ , అమృత లు కులాంతర ప్రేమ వివాహం చేసుకుని జీవనం సాగిస్తుంటే ఓర్వలేని ఆమె తండ్రి ప్రణయ్‌ను బలితీసుకున్నారన్నారు. ఇలాంటి హత్యలు ఇక జరగకుండా పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కెయంపియస్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్, వివిధ సంఘాల నాయకులు గంగయ్య, రవికుమార్, కె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.