ప్రకాశం

దర్శి గెలిస్తేనే రాష్ట్రంలో అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, సెప్టెంబర్ 22 : దర్శి నియోజక వర్గంలో వైకాపా గెలిస్తేనే రాష్ట్రంలో వైకాపా అధికారాన్ని చేపడుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం దర్శి నియోజక వర్గ వైకాపా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ చంద్రగిరి గురువారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ దర్శి నియోజక వర్గం మొదట్నుంచీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అతిస్వల్ప తేడా తో ఓటమి చెందడం జరిగిందన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి తన తండ్రికి అనారోగ్య కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయలేనని వైకాపా అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డికి స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఆ పరిణామంలో నియోజక వర్గ బాధ్యతలను బాదం మాధవరెడ్డికి అప్పజెప్పడం జరిగిందన్నారు. అయితే గత 20 రోజుల నుండి ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న బాదం మాధవరెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో రావాలి జగన్... కావాలి జగన్ .. కార్యక్రమాన్ని నియోజక వర్గంలో ఎవ్వరూ నిర్వహించక పోవడంతో నాలుగు రోజుల క్రితం దర్శి నియోజక వర్గ నాయకులు తన వద్దకు వచ్చి నియోజక వర్గ పరిస్థితులను తనకు వివరించడంతో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. ఈ నెల 30వ తేది వరకు మాత్రమే ఓట్లు నమోదు కార్యక్రమం జరుగనున్నందున దర్శి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నియోజక వర్గంలో వైకాపా ఓట్ల ను అధిక శాతం తొలగించడం జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు. నియోజక వర్గం లో ఎవరు పోటీ చేసినా రాష్ట్రంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడమే ముఖ్య లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. అధిక శాతం మంది నియోజక వర్గంలో బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి పోటీ చేయాలని కోరుకుంటున్నారని, అయితే శివ ప్రసాద్‌రెడ్డి ని ఒప్పించుకునే బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. శివ ప్రసాద్‌రెడ్డి పోటీ చేస్తానని కార్యకర్తలు ఒప్పించగలిగితే 15 రోజుల్లో స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుందన్నారు. లేని పక్షంలో వ్యక్తిగత అభిమానాలు మాని పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఈ నెల 30వ తేది లోపు తమ బూత్ లో ఓట్ల నమోదు చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. 15 రోజుల తరువాత మరలా నియోజక వర్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం మాజీ అద్యక్షులు ఈదర మోహన్, జిల్లా వైకాపా నాయకులు వై వెంకటేశ్వరరావు, నియోజక వర్గ మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల క్రిష్ణారెడ్డి, సూది దేవర అంజయ్య, వెంకటయ్య, తాళ్లూరు మండల కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పిటిసీ మారం వెంకారెడ్డి, తాళ్లూరు ఎంపిపి గోళ్ళ మోష, మాజీ ఎంపిపి ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచులు వెన్నపూస శేషిరెడ్డి, కోరే చిన్న సుబ్బారావు, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.