క్రైమ్/లీగల్

అన్న చేతిలో చెల్లి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంచేడు, అక్టోబర్ 2: కంటికి రెప్పలా కాపాడాల్సిన అనే్న కాలయముడయ్యాడు. తాతల కాలం నాటి నుంచి వస్తున్న కేవలం ఏడు సెంట్ల స్థల వివాదం చెల్లి ప్రాణం తీస్తే... అన్నను జైలు పాలు చేయనుంది. ఎప్పుడూ ఇరుగు పొరుగు.. ప్రేమ ఆప్యాయతలతో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి, జీవణం సాఫీగా, ప్రశాంతంగా సాగించే స్వర్ణ గ్రామంలో హత్య జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తోడబుట్టిన వాడు కాకపోయినా పెదనాన్న కొడుకు అయిన అనే్న తనను హతమారుస్తాడని ఆ చెల్లి ఊహించలేకపోయింది. దారుణంగా అన్న చేతిలో హత్య చేయబడింది. చీరాల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, స్థానికులు అందించిన సమాచారం మేరకు కారంచేడు మండలం స్వర్ణ ఉత్తర బజారుకు చెందిన సుంకర పద్మావతి (28), ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని బేస్తవారిపేట మండలం రెట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణతో వివాహమైంది. హైదరాబాద్ నుంచి స్వర్ణ వచ్చిన పద్మావతిని అదే గ్రామానికి చెందిన సూదా శింగయ్య శివాలయం సమీపంలో బజారుకు వెళ్లి వస్తున్న ఆమెను మాటు వేసి కత్తితో పొడిచి చంపాడు. మొదటి శివాలయం ప్రహరీగోడకు తలను బలంగా గుద్దాడు. అనంతరం ఛాతి భాగంలో కత్తితో బలంగా పొడిచి కేశవరప్పాడు రోడ్డు గుండాపారిపోయాడు. మృతురాలు వివాహం అనంతరం భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మృతురాలు గతంలో నేషనల్ యువజన కేంద్రీయ విద్యలో ఉద్యోగం చేసింది. దీనిలో భాగంగా అక్టోబర్ 2న రివార్డు తీసుకోవడానికి సోమవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. అప్పటికే ఆస్తుల గొడవతో ఆమెపై కక్ష పెంచుకున్న వరుసకు అన్నయ్య అయిన శింగయ్య హత్య చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సోమవారం రాత్రి కూడా ఇంటి పరిసర ప్రాంతంలో సంచిరించాడని, మృతురాలు తల్లి వెంకాయమ్మ బోరున విలపిస్తుంది.
ఆస్తి తగాదాలే కారణమా: తాతల కాలం నుంచి వచ్చిన కేవలం 7 సెంట్ల వ్యవసాయ భూమితో పాటు ఇంటి సరిహద్ధులే కారణమై ఉంటాయని స్థానికులు, పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు జరగడం లేదనుకుంటున్న సమయంలో తన కుమార్తెను శింగయ్య హత్య చేయడంతో మృతురాలి తండ్రి బోరున విలపించాడు.
మాకు కూడా ప్రాణ గండం ఉంది: కొద్ధిపాటి ఆస్తి తగాదాతో తనకు చెల్లెలు వరుస అయిన పద్మావతిని శింగయ్య హతమార్చాడని, మాకు కూడా ప్రాణ గండం ఉందని మృతురాలి అక్కలు శివకుమారి, విజయలక్ష్మి భయాందోళన చెందుతున్నారు. మా తండ్రికి మేము నలుగురు అమ్మాయిలమని, మా అందరిలో తెలివిగా ఉండే మా సహోదరి పద్మావతేని చంపేశాడని, మిగిలిన మమ్మల్ని కూడా చంపవచ్చని వారు విలపిస్తున్నారు. ఈ రోజు గ్రామానికి రాకుండా ఉన్న మా చెల్లి బతికి ఉండేదని సహోదరీలు కంటతడి పెట్టడం చూపరులను కలిచి వేసింది.
దర్యాప్తు చేస్తున్నారు: హత్య జరిగిన వెంటనే రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపూరుపాలెం ఎస్సై హానూక్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పద్మావతి హత్యకు గురైన సంగతిని హైదరాబాద్‌లో ఉన్న భర్తకు తెలిపామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఈతకెళ్లి విద్యార్థి మృతి
బేస్తవారపేట, అక్టోబర్ 2: మహాత్మగాంధీ జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవుకావడంతో సరదాగా చీతిరాలకతువకు ఈతకెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన బేస్తవారపేట గ్రామపంచాయతీ పరిధిలోని సోమవారిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గోదిని కార్తీక్ (12) మృతి చెందాడు. మృతుడు, మృతుడి అన్న హేమంతు మరో విద్యార్థి విష్ణు ముగ్గురు కలిసి ఈతకెళ్లి జారి నీటికుంటలో పడిపోయారు. అయితే హేమంతు, విష్ణులు ఒడ్డుకు చేరుకోగా కార్తీక్ నీట మునిగి మృతి చెందాడు. విషయాన్ని గమనించిన స్థానికులు నీటిలో మృతి చెందిన విద్యార్థి కార్తీక్‌ను బయటకు తీశారు. మృతుని తల్లి ఆదిలక్ష్మమ్మ కూలీపనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తుంది. మృతుని తండ్రి సుబ్బారావు బెంగళూరులో తాపీ పనులకు వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.