క్రైమ్/లీగల్

బంగారు నగలు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, అక్టోబర్ 4 : ఇంటి తాళం తీసుకొని పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోని బంగారు నగలను దొంగలించిన సంఘటన కొరిశపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందిన యద్దనపూడి పోతురాజు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళుతూ ఇంటికి తాళం వేసి తాళం చెవిని గూటిలో పెట్టి వెళ్లాడు. బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు గూటిలోని తాళం చెవిని తీసుకొని ఇంటి తాళం తెరిచి బీరువాలో రూ.90 వేలకు పైగా విలువైన బంగారు నగలను దొంగలించారు. సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన పోతురాజు దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకొని బుధవారం రాత్రి కొరిశపాడు ఎస్‌ఐ బి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గురువారం ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి పోతురాజు ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్తూ జ్వరంతో యువకుడు మృతి
రాచర్ల, అక్టోబర్ 4: కర్నూలులో ఆర్మీ సెలక్షన్స్‌కు రైలులో వెళ్తూ తీవ్ర జ్వరంతో యువకుడు మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చోళ్లవీడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల రవీంద్రకుమార్ (18) స్నేహితులతో కలిసి కర్నూలులో ఆర్మీ సెలక్షన్స్ కోసం బుధవారం రాత్రి రైలులో బయల్దేరాడు. అప్పటికే కొద్దిపాటి జ్వరంతో ఉన్న రవీంద్రకుమార్‌ను వెళ్లవద్దని తల్లిదండ్రులు వారించినా వినకుండా బయలుదేరాడు. కాగా, నంద్యాల సమీపంలో జ్వరం ఎక్కువై ఫిట్స్ రావడంతో స్నేహితులు డోన్ దగ్గర అంబులెన్స్ ద్వారా కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. చేతికందిన కుమారుడు మృతిచెందటం పట్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తురిమెళ్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్, సిబ్బంది రవీంద్రకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి కళాశాలకు సెలవు ప్రకటించారు.