క్రైమ్/లీగల్

భార్య మృతిచెందిందనే మనస్థాపంతో భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, అక్టోబర్ 7: భార్య మరణించిందనే మనస్థాపంతో నాగరాజు (35) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని పంటవారిపాలెం దగ్గర ఓవి రోడ్డుపై ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సింగరాయకొండ మండలం శాణంపూడికి చెందిన కె నాగరాజు భార్య, పిల్లలు హైదరాబాద్‌లో బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలిపారు. నాగరాజుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత వారం భార్య వీణాకుమారి కుటుంబ కలహాల నేపధ్యంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నాగరాజు పిల్లలతో కలిసి స్వగ్రామానికి వచ్చినట్లు తెలిపారు. శనివారం రాత్రి నాగరాజు పిల్లలతో కలిసి కారులో బయటకు వెళ్లినట్లు తెలిపారు. భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో కారులోనే పురుగుల మందు తాగి తన ఇద్దరు పిల్లలను కూడా చంపబోగా వారు తప్పించుకుని పొలాల్లోకి పారిపోయినట్లు తెలిపారు. విగత జీవిగా కారులోనే పడి ఉన్న తండ్రి
పక్కనే రాత్రంతా గడిపినట్లు పిల్లలు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున తండ్రిని లేపగా కుప్పకూలాడని, పక్కనే గల పురుగుమందు డబ్బా చూసి పురుగు మందు తాగి తండ్రి మరణించినట్లు తెలుసుకుని, అటుగా వెళ్తున్న మలినేని కళాశాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాత ఘరానా దొంగ అరెస్టు
- 28 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం
- రూ.7.40 లక్షల విలువ
పర్చూరు, అక్టోబర్ 7: వ్యసనాలకు బానిసై డబ్బు కోసం ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే పాత ఘరానా దొంగను అరెస్టు చేసినట్లు ఇంకొల్లు సీఐ ఎన్ శేషగిరిరావు తెలిపారు. పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న చాపల్లి యేసు అనే వ్యక్తిని విలేఖర్ల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కొండేపికి చెందిన చాపలి యేసు అనే వ్యక్తి స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై కె రామకృష్ణ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది శనివారం సాయంత్రం 6గంటల సమయంలో అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారించగా యేసు 10 దొంగతనాల కేసుల్లో నిందితుల్లో ఉన్నాడని గుర్తించామన్నారు. ఇతని వద్ద నుంచి 20 సెవర్ల బంగారు ఆభరణాలైన గొలుసులు, చెవి కమ్మలు, గాజులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతే కాకుండా రెండు బస్తాల రెడీమేడ్ దుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.40లక్షలని అన్నారు. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని, గతంలో దొంగతనం కేసులు జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పురాలేదని తెలిపారు. ఎవరికీ తెలియకుండా మళ్లీ, మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల పర్చూరు మండలంలోని అడుసుమల్లి గ్రామంలో ఎవరూలేని ఒక ఇంటిలోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు తొంగిలించగా పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఇతనిపై మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, చినగంజాం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, గుంటూరు జిల్లా వినుకొండ, నర్సరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఒకటి, నెల్లూరు జిల్లా సూళ్లూరి పేట పోలీస్ స్టేషన్ ఒక కేసు మొత్తం 10 కేసులు యేసు నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. మార్టూరు కేసులో రెడీమేడ్ దుకాణంలో దుస్తులు దొంగిలించినట్లు తెలిపారు. గత నాలుగునెలలుగా చినగంజాంలో ఉంటూ, పర్చూరు, మార్టూరు మండలాల్లో దొంగతనాలు చేసినట్లు తెలిసింది. నిందితుడు రెడీమేడ్ దుస్తులు అమ్ముతున్నట్లు నటిస్తూ ఎవరూ లేని ఇళ్లలో దొంగ తనాలు చేస్తాడని తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరిపేటలో ఇళ్లు అద్దెకు కావాలని వెళ్లి ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిందితుడు దొంగతనం చేసినట్లు తెలిసింది.కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎఎస్సై కరీమ్, హెచ్‌సి మహబూబ్ బాష, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.