ప్రకాశం

సాగర్ నీరు సక్రమంగా వదలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 16: జిల్లాలో రైతులు సాగుచేస్తున్న పంటలకు సాగునీరు అందించడానికి అధికారులు అందరూ సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర అటవీశాఖామంత్రి శిద్దారాఘవరావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలులోని ప్రకాశం భవన్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సంయుక్తకలెక్టర్, నాగలక్ష్మి, సహాయ కలెక్టర్ శాంతి. ఎమ్మెల్సీ కరణం బలరామకృష్మూర్తి, డిఆర్ ఓ వెంకట సుబ్బయ్యతో సాగునీరు, ప్రజారోగ్యం, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 49వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా నాట్లు వేయడానికి రైతులు సమాయత్తం అవుతున్నారన్నారు. సాగర్ నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే సాగర్ నీరు సక్రమంగా రైతులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇందుకోసం రెవెన్యూ, నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 85/3 మైలు వరకు 200 క్యూసెక్కులు వస్తోందని ఈ విధంగా ఈనెల 18 వరకు వస్తుందని అధికారులు చెప్పడం సరికాదన్నారు. దసరా అయిన తర్వాత కూడా ఈ సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ సాగర్ కాలువ వెంబడి రైతులు ఈనెల 27లోగా వరినాట్లువేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాలువలు, చెరువులు మేజర్లు, కుంటల వారీగా ఎవరికి ఎంత నీరు కావాలో అంత నీరు వదలాలన్నారు. ఎమ్మెల్సీ కరణం మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అధికారులు తనిఖీ చేసి రైతులకు సక్రమంగా సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామమూర్తి, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, ఆర్డీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ, అపజారోగ్య శాఖ ఇఇ , మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయశాఖ, జలవనరుల శాఖ క్షేత్రాధికారులు పాల్గొన్నారు.

‘జిల్లా గిరిజన సంక్షేమాధికారిని మాతృసంస్థకు పంపాలి’
ఒంగోలు, అక్టోబర్ 16: గిరిజనుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాన్చుడు ధోరణితో వ్యహరిస్తున్న జిల్లా గిరిజన సంక్షేమాధికారిని మాతృసంస్థకు సరండర్ చేయాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు పి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద డీటీడబ్ల్యూఓని మాతృసంస్థకు సరెండర్ చేయాలని కోరుతూ జరిగిన రిలే నిరాహార దీక్షలను పి లక్ష్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ జిల్లాలోని గిరిజనుల ప్రజలకు అందుబాటులో డిటిడబ్ల్యూఓ అందుబాటులో లేకపోవడంతో గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా గిరిజన హాస్టల్స్‌లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు 56 మందికి 13 నెలల నుండి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే గిరిజన ఆశ్రమ స్కూళ్లలో వౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా అంబేద్కర్ పీపుల్స్ జెఏసి జిల్లా అధ్యక్షులు కిషోర్‌కుమార్, అంబేద్కర్ జెఏసి కార్యదర్శి బెంజిమన్, గిరిజన నాయకులు రాపూరి శ్రీనివాసులు, సిహె ప్రసాద్, వై బ్రహ్మయ్య, ఎ పుల్లమ్మ, వై బాలగురవమ్మ, గంధం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీకొని ఆర్మీ ఉద్యోగి మృతి
చీరాల టౌన్, అక్టోబర్ 16: రైలు ఢీకొని సైనిక ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండలంలోని ఈపూరుపాలెం రైల్వేస్టేషన్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. జిఆర్‌పి పోలీసుల కథనం మేరకు, ఈపూరుపాలెం గ్రామానికి చెందిన షేక్ నాగూర్ (32) పూనెలో ఆర్మీలో పనిచేస్తున్నాడు. సెలవులకు వచ్చిన నాగూర్ తిరిగి విధుల్లోకి చేరేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి సోమవారం రాత్రి బయలుదేరాడు. అయితే ఏమి జరిగిందో ఏమో గాని మంగళవారం ఉదయం ఈపూరుపాలెం రైల్వేస్టేషన్ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంపై మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న జిఆర్‌పి పోలీసులు వివరాలు సేకరించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జిఆర్‌పి ఎస్సై పి భాస్కర్ తెలిపారు.