ప్రకాశం

ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, అక్టోబర్ 16: హక్కుల సాధన కోసం మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 13వ రోజుకు చేరింది. సమ్మె ఉద్ధృతంలో భాగంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు కూడా పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు ఇస్తూ సమ్మెలో దిగారు. మున్సిపల్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఎఐటియుసి, సీఐటియుల ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 2గంటలపాటు జరిగిన ఈకార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితులను గుర్తించిన పోలీసులు పెద్దఎత్తున మోహరించి ఉద్యమకారులను అదుపులోనికి తీసుకొని అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారు. ఈసందర్భంగా ఎఐటియుసి, సీఐటియు నాయకులు అందె నాసరయ్య, డికెఎం రఫీలు మాట్లాడుతూ కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన పాలనకులు దమననీతితో వ్యవహరిస్తున్నారని అన్నారు. 279 జీవోను రద్దు చేసి న్యాయమైన కోర్కెలు తీర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా 37వేలమంది మున్సిపల్ కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారని, జేఏసీ నాయకులతో చర్చించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అహం ప్రదర్శిస్తున్నారన్నారు. సమ్మెకాలంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గత మూడేళ్లుగా 279 జీవో రద్దుకోసం కార్మిక సంఘాలు పోరాటం సాగిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చే జీవోను రద్దుచేసి కార్మికుల శ్రేయస్సుకోరే జీవోలను అమలు చేయాలన్నారు. సమ్మెతో రాష్ట్రంలో ఎక్కడిచెత్త అక్కడ నిలిచిపోయి పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, ప్రబలుతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకొని కార్మికుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎఐటియుసి ఏరియా నాయకులు షేక్ కాశీం, కాశయ్య, సీఐటియు నాయకులు బాలనాగయ్య, సుబ్బరాయుడు, ఇమామ్‌సా, సమద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో బాల్‌బ్యాట్‌మెంట్ పోటీలకు త్రిపురాంతకం విద్యార్థి ఎంపిక
త్రిపురాంతకం, అక్టోబర్ 16: జాతీయస్థాయిలో బాల్‌బ్యాట్‌మెంట్‌కు త్రిపురాంతకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మల్లెల లక్ష్మిసాహిత్యి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్‌రెడ్డి, పిఇటి నారాయణరెడ్డి పాత్రికేయులకు తెలిపారు. నెల్లూరుజిల్లా గూడూరు లో ఈనెల 13వతేదీన నుంచి 15వతేదీ వరకు రాష్టస్థ్రాయిలో బాల్‌బ్యాట్‌మెంటన్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో 14 సంవత్సరాల బాలికల లక్ష్మిసాహిత్య జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఏపీ తరుపున నెల్లూరులో జరగబోవు జాతీయస్థాయి పోటీల్లో లక్ష్మిసాహిత్య పాల్గొననున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

పోలీసు శిక్షణా కళాశాలలో రక్తదాన శిబిరం
ఒంగోలు, అక్టోబర్ 16: పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒంగోలు పోలీసు శిక్షణా కళాశాలలో మంగళవారం శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుందరరావు, జిల్లా ఎస్‌పి బి సత్య ఏసుబాబుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 15 మంది ఎస్‌సిటిపిసిలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు రిమ్స్ హాస్పటల్ డాక్టర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్స్ పవన్‌కుమార్, హరిబాబు, పోలీసు శిక్షణా కళాశాల సిబ్బంది తదితరులున్నారు.