ప్రకాశం

నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 21: నవరత్నాల అమలుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేటట్లు వైకాపా రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి విధివిధానాలు అమలు చేస్తారని మాజీ మంత్రి, వైకాపా ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రావాలి జగన్ .. కావాలి జగన కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు స్థానిక భాగ్యనగర్ లోని 4వ లైన్‌లో ఇంటింటికి వెళ్ళి జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా భాగ్యనగర్ లోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలినేనికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వందల సంఖ్యలో ప్రజలు ఆయనతో కలిసి అడుగేసి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేడు అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. వాళ్ల కష్టాలు నెరవేరాలంటే జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు నుంచి లక్ష రూపాయల వరకు లబ్ధిపొందుతారన్నారు. పింఛన్ల ద్వారా 24వేల రూపాయల నుంచి 48వేల రూపాయల వరకు అందుతాయని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్ష నుంచి పది లక్షల దాకా సాయం పొందే అవకాశం ఉన్నట్లు బాలినేని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదలందరికీ 2 నుంచి 5 లక్షలు వెచ్చించి ఉచితంగా ఇళ్ళు నిర్మించి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. అమ్మవడి పధకం ద్వారా ప్రతీ పేద కుటుంబంలో పిల్లలను బడికి పంపినందుకు ఏటా 15వేల రూపాయలు అందిస్తామని బాలినేని తెలిపారు. ఇలా ప్రతీ కుటుంబానికి వివిధ పధకాల ద్వారా ఏటా లక్ష రూపాయలు నుంచి 5లక్షల రూపాయలు లబ్ది పొందేటట్లు జగన్ విధి విధానాలు అమలు చేస్తారని బాలినేని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఒంగోలు నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, మాజీ పిడిసిసి బ్యాంకు ఛైర్మన్ ఈదర మోహన్, వైకాపా నాయకులు వేమూరి సూర్యనారాయణ (బుజ్జి) ఈదర చిన్నారి, కటారి శంకర్, గంటా రాము, రొండా అంజిరెడ్డి, జమ్ము శ్రీకాంత్, తోటపల్లి సోమశేఖర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.