ప్రకాశం

ఘనంగా టి కృష్ణ వర్ధంతి సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్‌టిఆర్ కళాక్షేత్రం ప్రముఖ సినీ దర్శకులు టి కృష్ణ 32వ వర్ధంతి సభ ఘనంగా ముగిసింది. టి కృష్ణ వర్ధంతి సభకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, టి కృష్ణ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా సినీ దర్శుకులు టి కృష్ణ తనయుడు, ప్రముఖ సినీహీరో గోపి చంద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపిచంద్ మాట్లాడుతూ కమ్యూనిజంతోను, అభ్యుదయ భావజాలంతోనే తన తండ్రి టి క్రిష్ణ మంచిస్థాయికి ఎదిగినట్లు తెలిపారు. సమాజంలో మార్పుకోసం తన తండ్రి ప్రయత్నించి తీసిన ప్రతి సినిమా కూడా ప్రజలను హత్తుకునేలా తీశారని, తన తండ్రి టి కృష్ణ తనకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయేందకు తన వంతు కృషిచేస్తున్నట్లు గోపి చంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం టి కృష్ణ వర్ధంతి కార్యక్రమాలు జరగటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు రుణం తాను ఏమిచ్చిన తీర్చుకోలేనిదన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ టి క్రిష్ణ తనకు మంచి పరిచయస్తుడని, ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం అని ఆయన కొనియాడారు. అలాంటి టి క్రిష్ణ మరణం సినీ ప్రేక్షక దేవుళ్లకు తీరని లోటన్నారు. టి క్రిష్ణ లేని లోటును ఆయన తనయుడు సినీహీరో గోపిచంద్ తీర్చుతున్నారన్నారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు శిక్షణలో ఎవరు మెలిగిన వారు ఉన్నత స్థానాలను పొందుతారన్న విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ సందర్భంగా 23 మంది పేద విద్యార్థులకు ఒక్కొరికి 10వేల రూపాయలు చొప్పున మొత్తం 2లక్షల 30 వేల రూపాయలు ఆర్ధిక సహాన్ని సినీ హీరో గోపి చంద్ అందజేయగా, ఆ మొత్తాన్ని గోపి చంద్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు చేతులు మీదుగా అందజేయటం జరిగింది . టి క్రిష్ణ 32వ వర్దంతి కార్యక్రమాలు ఈనెల 20, 21 తేదీలలో జరిగాయి. ఈనెల 20న విద్యార్ధులకు అభ్యుదయ పాటలు, క్విజ్ పోటీలు జరిగాయి. ఈనెల 21 అయిన ఆదివారం రాత్రి ముగింపు సభ జరగగా, ఈ సభలో పాటలు, క్విజ్ పోటీల లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను సినీ హీరో గోపి చంద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సభలో ఆసరా కేంద్ర నిర్వాహకులు చిడిపోతు వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా నాయకులు యు ప్రకాశరావు, ప్రగతి రామయ్య, పివిఆర్ చౌదరి, కృష్ణంరాజు మాస్టార్ తదితరులు పాల్గొన్నారు.