జాతీయ వార్తలు

మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైమానిక దళానికి రాష్టప్రతి అభినందన
దేశ రక్షణలో రాజీ పడబోమని స్పష్టీకరణ

హసిమారా (పశ్చిమ బెంగాల్), నవంబర్ 28: ప్రకృతి విపత్తుల సమయంలో ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో 2013లో సంభవించిన వరదల సమయంలో, అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం సమయంలో భారత వైమానిక దళం అందించిన మానవతా సేవలను రాష్టప్రతి ప్రశంసించారు. ‘మిమ్మల్ని చూసి ఈ దేశం నిజంగా గర్విస్తోంది’ అని ఆయన అన్నారు. భారతదేశం శాంతికి పూర్తిగా కట్టుబడి ఉందని, అయితే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి తన యావత్ సైనిక శక్తిని మోహరించడానికి సైతం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం అన్నారు. తూర్పు సరిహద్దుల్లో భారత గగనతలాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసిన భారత వైమానిక దళానికి చెందిన 22, 18వ స్క్వాడ్రన్‌లకు రాష్టప్రతి పురస్కారాలను సర్వ సైన్యాధ్యక్షుడైన రాష్టప్రతి అందజేసారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్ జిల్లా హసిమారాలో ఏర్పాటుచేసిన ఈ రెండు విభాగాలు కూడా మొత్తం ఈశాన్య సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టి ఉంచే లక్ష్యంతో వ్యూహాత్మకంగా భారత్- భూటాన్ సరిహద్దులకు ఆనుకుని ఏర్పాటు చేసారు. ఈ రెండు స్క్వాడ్రన్‌లు కూడా భారత సైన్యంలో 50 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. ‘ఫ్లైయింగ్ బులెట్స్’గా పిలవబడే 18వ స్క్వాడ్రన్‌ను 1965లో తొలుత అంబాలాలో ప్రారంభించగా, 220 స్క్వాడ్రన్‌ను 1966లో బరేలిలో ప్రారంభించారు. దరిమిలా ఈ రెండిటిని కూడా హసిమారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు మార్చారు. 1971 నాటి భారత్- పాక్ యుద్ధం సమయంలో ఈ రెండు విభాగాలు కూడా అత్యంత ప్రధానమైన భూమికలను పోషించాయి.
వైమానిక దళం ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా, వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలను రాష్టప్రతి తిలకించారు. (చిత్రం) పశ్చిమ బెంగాల్‌లోని హసిమారాలో వైమానిక దళ గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్టప్రతి ప్రణబ్