రాష్ట్రీయం

యాగానికి నేడు ప్రణబ్, బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు వేములవాడకు కెసిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 26: ఐదు రోజులపాటు నిర్వహించిన అయుత మహా చండీయాగం ఆదివారం పూర్ణాహుతితో ముగుస్తుంది. చివరిరోజు యాగంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్ర సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహాన్ సహా వివిధ రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతారు.
ఆంధ్రనుంచి సిఎం బాబు, కేంద్ర విమానయాన మంత్రి అశోకగజపతిరాజు ప్రత్యేక విమానంలో యాగానికి హాజరుకానున్నారు. ఆంధ్ర మంత్రులు సైతం పెద్దఎత్తున హాజరుకానున్నారు. నాలుగు రోజులుగా సాగుతోన్న అయుత చండీయాగం ప్రాధాన్యత సంతరించుకుంది. హాజరవుతోన్న రాజకీయ పక్షాలమధ్య కొత్త బంధాలకు యాగం తెరిలేపినట్టయ్యింది. తెలుగు రాష్ట్రాల సిఎంల మధ్య సంబంధాలు బలపడేందుకు యాగం ఉపయుక్తమైంది. తెలంగాణ ఉద్యమం తరువాత తొలిసారిగా యాగం కోసం సిఎం కెసిఆర్ విజయవాడలో అడుగుపెట్టారు. విజయవాడ వెళ్లి సిఎంని ఆహ్వానించారు. చంద్రబాబు యాగానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తొలిరోజు భక్తుల సంఖ్య మామూలుగానే ఉన్నా తరువాత క్రమంగా రోజురోజుకు భక్తుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగుతోంది. వరుస సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాగాన్ని దర్శించేందుకు వస్తున్నారు. ఆదివారం చివరి రోజు కావడం వల్ల భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
సోమవారం క్షేత్ర పర్యటన
అయుత చండీయాగంలో భాగంగా సిఎం కెసిఆర్ సోమవారం క్షేత్ర పర్యటన చేస్తారు. ఆదివారం యాగం ముగిసిన తరువాత సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఐదు రోజుల యాగం తరువాత యాగ స్థలిలోనే నిద్ర చేయాలనే నియమం ప్రకారం కెసిఆర్, ఆయన కుటుంబీకులు, యాగం నిర్వాహకులు ఆదివారం రాత్రి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం యాగస్థలిలో నిద్ర చేస్తారు. సోమవారం ఉదయం ఎర్రవెళ్లి నుంచి బయలుదేరి వేములవాడ చేరుకుంటారు. చండీయాగంలో భాగంగా మహారుద్ర యాగం, చండీయాగం కలిపి చేసినందున సోమవారం రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు.
** చండీమాతకు నమస్కరిస్తున్న సిఎం కెసిఆర్, గవర్నర్ దంపతులు **