ప్రార్థన

క్రీస్తులో స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తల్లిదండ్రులు మమ్ములను నిర్బంధిస్తున్నారు. కదలనివ్వరు మెదలనివ్వరు. కాలేజీ లేకపోతే.. ఇంట్లోనే ఉండమంటారు. మొబైల్‌లో ఛాటింగ్ చేయొద్దంటారు.. టీవీ చూడొద్దంటారు.. కంప్యూటర్ జోలికి వెళ్ళొద్దంటారు... ఫ్రెండ్స్‌తో మాట్లాడనివ్వరు...’ అని పిల్లల ఆరోపణ. అయితే సాతానుడు ఎవరిని మ్రింగుదునా! అని గర్జించు సింహము వలె వేటాడుచున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారు. గ్రద్ద కోడిపిల్లల కోసం కాపుకాసినట్టు కాస్తున్నాడు. తల్లి రెక్కల చాటు నుండి పిల్ల బయటకు వస్తే అంతే తన్నుకుపోతుంది.
అలానే సాతానుడు తల్లిదండ్రుల నుండి వెలుపలికి వచ్చిన వారికి తాత్కాలిక ఆనందం కలిగించి ఏదో ఒక వ్యసనంలో బంధించి మరణానికి అప్పగిస్తాడు. చివరకు అగ్నిగంధకములతో మండుచుండు గుండములో పడేటట్లు చేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు. పురుగు చావదు.
తల్లిదండ్రుల చాటున ఉండుట ఎంత మేలు అనే విషయం తెలియక - నాకు స్వేచ్ఛ కావాలని తండ్రి యొద్ద నుండి సగం ఆస్తి తీసుకొని వెళ్లిన యవ్వనస్థుడి సంగతి మనకు తెలిసిందే. చివరకు ఏం జరిగింది? తన ఆస్తిని వ్యసనాల పాలుచేశాడు. దూర దేశంలో బాగుంటాననుకొని.. ఆంక్షలు లేని ఆ జీవితాన్ని అనుభవించాలనుకొని.. తన అమూల్యమైన జీవితాన్ని పాడుచేసుకొన్నాడు. ఆఖరికి చేతిలో చిల్లిగవ్వ లేక.. పందులు మేపేందుకు సిద్ధపడ్డాడు. పందులు మేసే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. అదీ అతడికి దక్కలేదు.
కొంతమంది -తల్లిదండ్రుల కట్టుబాట్లూ వద్దు.. దేవుని యెడల భయభక్తులూ వద్దు అని పరమతండ్రియైన దేవుని చేతిలో నుండి బయటకు వచ్చి ఇష్టానుసారంగా జీవించటం.. తాగుడు, జూదం, వ్యభిచారం, దొంగతనం, హత్య, మోసాలు, అబద్ధాలు లాంటి సాతానుడు వేసిన చిక్కుముడులలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నాడు. అక్రమానికి అపవిత్రతకు బానిసవుతున్నాడు. ఈ బానిసత్వం నుండి బయటకు రావాలని ఎంత ప్రయాసపడినా రాలేక మరింత ఊబిలోకి దిగిపోతున్నాడు. తాగుడు తప్పు అని తెలిసినా, ఆరోగ్యం క్షీణిస్తోందని.. అవమానాలు ఎదురవుతున్నాయని.. ఆస్తులు హరించుకు పోతున్నాయని, తమ పిల్లలు అదే బాటలో నడుస్తున్నారని.. కుటుంబం చెల్లాచెదరై చెట్టుకొకరు పుట్టకొకరు అవుతున్నారని తెలిసినా.. ఈ బానిసత్వం నుండి బయటకు రాలేకపోతున్నారు. అనేక రకాలైన అలవాట్లకు బానిసలై దిక్కుతోచక బహుభారంతో అనేకులు కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అపొ 10:38 - అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచువాడు విడుదల కలుగజేయువాడు యేసే.
ప్రభువు ద్వారా విడుదల పొందినవారు, లోకసంగతులు ఎరిగిన వారు బిడ్డలను వారి మేలుకోరి కట్టుబాట్లలో ఉంచటానికి ప్రయత్నిస్తారు.
యేసుక్రీస్తు నశించిన వారిని వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. నా యొద్దకు రండని పిలుస్తున్నాడు. ప్రభువు పిలుపు మేరకు ఆయన వైపు తిరిగితే బంధకాల నుండి విడిపించి నిజమైన స్వేచ్ఛ ఇస్తాడు. పరలోకానికి వారసులుగా చేస్తాడు. అక్కడ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము నిత్యమూ ఉంటాయి. యుగయుగాలు ప్రభువుతో ఆనందిస్తూ ఉంటాము.
మత్తయి 11:28 - ప్రయాసపడి భారము మోసికొనుచున్న వారలారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
దీనులకు ఈ సువార్త ఇవ్వటానికి, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నవారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి కలుగజేయటానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి వెల యిచ్చి మనలను పాప విముక్తులను చేశాడు. ప్రభువు మాటలు విని, చదివి, ఆచరిస్తే సత్యము తెలుస్తుంది.
యోహాను 8:32 - సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. ఎటువంటి బంధకాలలో ఉన్నా యేసుప్రభువు పిలుపు విని ఆయన వైపు తిరిగితే మరణాన్ని గెల్చి లేచిన ప్రభువు నీ బంధకములను భారములను తొలగించి విడుదల ఇస్తాడు.
స్వేచ్ఛ కావాలని తల్లిదండ్రులను ఇంటిని వదలి వెళ్లిన వారిని ఆహ్వానించి విశాలమైన మార్గము చూపినట్టు చూపి ఒక్కొక్కరిని బందీలుగా చేశాడు సాతానుడు. అది తెలిసేలోపల పుణ్యకాలం దాటిపోతుంది.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని కట్టుబాట్ల నుండి బైటకు వచ్చిన వారికి సాతానుడు పెట్టిన ఉచ్చులు. కనుక ఈ లోకాన్ని ప్రేమించక, లోకంతో స్నేహించక ప్రభువు మార్గములో నడుస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఎటువంటి బంధకాలలో పడిపోకుండుటకు ఆత్మ దేవుడు సహాయము చేయునుగాక. ప్రభువులో ఉంటే ఈ లోక సంకెళ్లు సంకెళ్లు కాదు. అగ్ని నిన్ను కాల్చజాలదు. జలములు నీ మీద పొర్లిపారవు. సర్వశక్తుడు నీకు ఆశ్రయముగా కోటగా ఉంటాడు. అపాయమేమియు నీ గుడారము సమీపించదు. రేయి పగలు కంటికి రెప్పలా కాయుచున్న తండ్రి చాటున ఉండి ఆయన ఇచ్చే స్వేచ్ఛను అందరూ పొందుకోవాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256