ప్రార్థన

దేవుని ధన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.’ -మత్తయి 5:5
సాత్వికం అంటే శక్తిని అదుపులో ఉంచుకోవటం. పరాక్రమశాలి కంటె దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును కాపాడువాని కంటె తన మనస్సును స్వాధీనపరచు కొనువాడు శ్రేష్ఠుడు. సాత్వికులు ఏది ఎలా ఎప్పుడు చేయాలో అనే విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. జ్ఞానమున్నా సాత్వికము లేకపోతే, కోతి చేతిలో కొబ్బరికాయ సామెతలా ఉంటుంది. సాత్వికతను కలిగి ఉండటానికి లోకం ఇష్టపడటం లేదు. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడు అంతే. అదుపు లేని గాలి ఎంత నాశనాన్ని కలుగజేస్తుంది. వానకు అదుపులేని గాలి తోడైతే ఎంత నష్టం కలుగుతుందో తరచూ చూస్తూనే ఉంటాం. ఆస్తినష్టం, ప్రాణనష్టం, పంట నష్టం... అది తిరిగి సమకూర్చుకోటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. ఆస్తులైతే సంపాదించవచ్చు. మరి పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. ఉద్రేకం కూడా అంతే. అదుపు లేకపోతే ప్రమాదం. ప్రమాదాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. కుటుంబాలు చెల్లాచెదరై పోతాయి. పిల్లలు మానసిక వత్తిడులకు గురవుతారు. సొంత వారిని కోల్పోతాం.
సాత్వికులు హింసించరు. పగ ఉండదు. అవమానాన్నీ అపనిందలనూ కష్టాలను నష్టాలను పట్టించుకోరు. సాత్వికం పిరికితనం కాదు గాని సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చిన బలము. నిమ్మళము. సాత్వికమైన మనస్సు సాత్వికుడైన క్రీస్తు నుండి మాత్రమే లభిస్తుంది. అంత ఘోరమైన శ్రమలూ బాధలో కూడా ఆయన సాత్వికంగానే ఉన్నాడు. దూషించబడియు దూషించలేదు. దౌర్జన్యము చేసినా బాధపెట్టినా హేళన చేసినా, ఉమ్మి వేసినా, కొరడాలతో కొట్టినా మోయలేని భారం మోపినా నోరు తెరవలేదు. బదులు చెప్పలేక కాదు గాని నీ కోసం నా కోసం అన్నింటిని ఓర్చుకున్నాడు. అందుకే ప్రభువు అన్నాడు ‘నన్ను వెంబడించగోరు వారు తన్నుతాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించమని.’
సాత్వికము మన మనసులను నెమ్మదిగా ఉంచుతుంది. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకొని సరి చేయగలము. మనసులో కోపం ఉంటే తొందరపెడుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేం. ఏమి మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాదు. ‘సముద్రము కన్న శాంతము మిన్న’ అన్నది ఇందుకే. శాంతము లేని హృదయములో అహంకారము, కోపము, పౌరుషం, పంతాలూ పట్టింపులూ దుడుకుతనం ఆవేశం అల్లరి చోటు చేసుకొని పెద్దల మాట వినరు. అధికారుల మాట వినరు. తల్లిదండ్రులను లెక్క చేయరు. చివరకు సృష్టికర్తయైన దేవుని అమూల్యమైన సలహాలూ సూచనలూ ఆజ్ఞలూ పాటించరు. కనుక దేవుని ఆశీర్వాదము పొందుకోలేరు. సాత్వికముతో పనులు చేస్తుంటే తల్లిదండ్రుల ఆశీర్వాదము.. పెద్దల ఆశీర్వాదము.. దేవుని ఆశీర్వాదము కలుగుతుంది. చేసిన పని కూడా చాలా మేలైనదిగా ఉంటుంది.
దేవుడు మనలాగా ఉద్రేకపరుడైతే.. లోకం ఏనాడో అంతరించిపోయేది. దేవుడు సాత్వికుడు. ప్రేమగలవాడు గనుక ఎంతగా విసిగించినా క్షమించుచున్నాడు. అందుకే దేవుని విశ్వసించు వాడు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసము నందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహము ఆశా నిగ్రహము నందు సహనమును సహనము నందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సహనము సాత్వికము లేని భక్తి భక్తి కానేకాదు.
సాత్వికము లేనివారు అంటే - ఏదో ఒక సంగతి వింటారు. నిజానిజాలు తెలిసికోకుండా ఉడికిపోయి ఒక నిర్ణయానికి వస్తారు. అలా కోపం పొంగకూడదు.
‘ళళరీశళఒఒ జఒ ఒఆళశఆ్ద ఖశజూళూ ష్యశఆ్య ధ్యిజూ’ఒ ళ్యశఆ్య. డ్య ఒళళరీ ౄళళరీశళఒఒ. ఒ్ద్యతీ ౄళళరీశళఒఒ. ఒళ్పూళ జశ ౄళళరీశళఒఒ ఒ్ద్ఘళ ౄళళరీశళఒఒ ఒఖఇౄజఆ ఆ్య ౄళళరీశళఒఒ. ఘరీళ చిజళశజూఒ్దజఔ తీజఆ్ద ౄళళరీ ఔళ్యఔళ.
‘కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గలవారితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.’
-సామెతలు 22:24-25
సాత్వికుడైన క్రీస్తులా, నిన్ను మార్చగల వారితో పరిచయము పెంచుకుని స్నేహము కలిగియుండు.
‘నా ప్రియ సహోదరులారా! ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై యుండవలెను’ -యాకోబు 1:19
యుద్ధాలతో భూమి స్వతంత్రించుకోవాలని అనేక మంది రాజులు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేకపోయారు కాని సాత్వికుడైన ప్రభువు ప్రేమతో ఫలించాడు. లోకాన్ని ప్రేమతో నింపాడు.
సాత్వికత ఆత్మ ఫలము ద్వారా వస్తుంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము.
మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడై లక్షల మందిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించగలిగాడు. యోసేపు అన్నలతో కొట్టబడినా, అధికారులతో శిక్షింపబడినా అనేక అననుకూల పరిస్థితులు ఎదురైనా సాత్వికముతో నిలువబడి ఉన్నత పదవిని పొందుకున్నాడు.
ఈ సాత్వికము కలిగి ఉంటే కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. సమాజము నెమ్మదిగా ఉంటుంది. ఆశీర్వాదము కలుగుతుంది. ఈ ధన్యత అందరికీ కలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.
ప్రయాసములో భారములో ఉన్నావా? నీ శక్తితో యుక్తితో బలముతో సమాధానపరచుటకు ప్రయత్నించుచున్నావా? నా యొద్దకురా నేను నీకు విశ్రాంతి నిస్తాను. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను అని ప్రభువు పిలుస్తున్నాడు. ప్రభువు శక్తి నెరిగి మనల్ని మనం తగ్గించుకొని ఆయన మాట ప్రకారము జీవిస్తే తగిన సమయములో నిన్ను హెచ్చిస్తాడు. లోకములో తగ్గింపు లేదు. అటువంటి బోధ కూడా చేయటంలేదు. సాత్వికపు బోధ ఎవరూ వినటానికి ఇష్టపడటం లేదు. ఈ లోక బోధ అంతా కంటికి కన్ను పంటికి పన్ను మాటకు మాట దెబ్బకు దెబ్బగా ఉంది. అసలు దేనిలోనూ తగ్గేది లేదు. దాని నుండి పగలూ ప్రతీకారాలూ ఎక్కువైనాయి.
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ‘దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు’ -కీర్తనలు 37:11
ఈ సాత్వికుని వెంబడించకపోతే పగ ప్రతీకారాలు కోపం మనలను రెచ్చగొట్టి నెమ్మదిలేని జీవితం జీవించాల్సి వస్తుంది. ‘మహాఘనుడు మహోన్నతుడు నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును వినయముగల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను’ -యెషయా 57:15.
‘నాకేంటి. నేను బలాఢ్యుడను. ధనికుడను. శక్తియుక్తులు గలవాడను’ అని తనను తాను హెచ్చించుకొనేవారి యొద్ద ప్రభువు ఉండడు కాని, ఈ శక్తి ఈ బలము ఈ దేహం నీవు ఇచ్చినవేనని ఎరిగి ప్రభువు ముందు తగ్గించుకొని.. నేనేమై యున్నానో అది నీ కృపయేనని నమ్ము వారి దగ్గర ప్రభువు ఉండి వారిని రక్షణతో అలంకరిస్తాడు. శరీర రక్షణ, ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణ, ప్రాణ రక్షణ, నరకము నుండి రక్షణ కలుగజేస్తాడు. ఆకాశాన్ని సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకొన్న దేవుడు నలిగిన హృదయము, దీనత్వము గలవారిని చూచుచున్నాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చవు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును చూచి లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.

-మద్దు పీటర్ 9490651256