ప్రార్థన

ధన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు’ -మత్తయి 5:6
యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించువాడు. యధార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుని కుడిచెయ్యి నీతితో నిండి యున్నది. నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారములు. ఆయన న్యాయవిధులు యధార్థములు. ప్రభువు తన మార్గము లన్నిటిలో నీతి గలవాడు. యెహోవా మనకు నీతియని అతనికి పేరు. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.
పాపమునకు జీతము మరణము తప్పదు గనుక పాపమెరుగని ప్రభువు శరీరధారియై ఈ లోకానికి వచ్చి మన తరఫున ఆయన శిక్షింపబడి, మన దోషములను బట్టి నలుగగొట్టబడి, శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడెను. దీనిని బట్టి దేవుని నీతి అర్థవౌతోంది. అంతేకాదు చిన్నచిన్న విషయాలకు కూడా ప్రాణాలు తీస్తున్న ఈ లోకములో మన నిమిత్తము క్రీస్తు ప్రాణమిచ్చెను. గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలిసికొన్నాము. మనలను ప్రేమించి రక్తాన్ని చిందించి మన పాపముల నుండి విడిపించిన ప్రభువుకు మహిమా ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. దళ జదఆళ్యఖఒ చఖజూళౄళశఆ యఛి ద్యిజూ ఘశజూ ఆ్దళ య్పళ యచి ద్యిజూ ౄళఆ యశ ఆ్దళ ళ్యూఒఒ. ఈ సంగతిని గ్రహించి క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయనను ప్రేమించి ఆయన మార్గములలో అంటే నీతి మార్గము శాంతి మార్గములో నడిచేవారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. దానిని నీతితో ఒప్పుకొనువారు రక్షింపబడుతారు.
ఈ లోకంలో నీతి ఎన్ని రకాలుగా ఉందో ఎన్ని రంగులు మారుస్తుందో? మన మెరుగుదుము. మనిషి మనిషికి ఒక నీతి ఉన్నప్పుడు, దేవుని ప్రాణమిచ్చిన నీతి ముందు మురికిగుడ్డ వలె ఉంది. దేవుని పవిత్రత ముందు, పరిశుద్ధత ముందు, ఆయన నీతి ముందు, మానవ నీతి తేలిపోతుంది. మనిషికి మంచి తెలుసు చెడు తెలుసు. కారణము ఏదేను వనములో ఉన్న మంచి చెడులు తెలిపే జ్ఞానమిచ్చే పండు తిన్న ఫలితము. మంచి తెలుసు నీతి తెలుసు. మంచిగా ఉండాలని చెడు పనులు చేసేవారు వారి పిల్లల విషయములో ఆశ కలిగి ఉంటారు. నా కొడుకు దొంగ కాకూడదు, వ్యభిచారి కాకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. చిలిపి చిల్లర చేష్ఠలు చేయకూడదు. నేను పడే బాధ వాడు పడకూడదు. తాగుడు, జూదం, కొట్లాటలకు వెళ్లకూడదు అని ఎంతో ఆశపడతారు. చాలా నీతిగా ఉండాలని తపిస్తారు.
ఇర్మియా 13:23 - కూషు దేశస్థుడు (ఇథియోపియన్) తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన యెడల కీడు చేయుటకు అలవాటు పడినవారును మేలు చేయగలరు. శరీర రంగునే మార్చుకోలేని మనము జీవితాంతము ప్రయత్నించిన హృదయాంతరంగమును మార్చలేము. ఎందుకంటే హృదయము అన్నిటికంటె మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది.
ఇటువంటి పరిస్థితులలో దేవుని నీతిని ఎరిగి దాని కొరకు ఆకలి దప్పులు కలిగినవారు ధన్యులు. కొరహు కుమారులు రచించిన విధముగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని, నీ కొరకు తృష్ణ కొనుచున్నదని ప్రభువుకు తెలపాలి. ఎందుకంటే ప్రభువు ఆశపడే ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఆకలి గొనిన ప్రాణాలను మేలుతో నింపే దేవుడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిలో తన భాగమును తీసికొని స్నేహితులతో వేశ్యలతో తిరిగి అంతా పోగొట్టుకొని బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు సమృద్ధిగా ఆహారమున్నదని వెళ్లి నీ కూలివారిలో ఒకరిగా నన్ను పెట్టుకోమని అడగాలనే మనస్సును తండ్రి గ్రహించినట్టు, ప్రభువు మన ఆశ నెరిగి తప్పులు క్షమించి తృప్తిపరుస్తాడు.
దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడని వారు ఎందరో. అబ్రహాము దేవుని నమ్మెను అని అతనికి నీతిగా ఎంచబడెను. ప్రభువు మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయెను. ఆయన నీతిమంతుడని ఎరిగియున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టియున్నారని ఎరుగుదురు. ఆయనను నమ్మి అంగీకరించిన వారందరు దేవుని పిల్లలగుటకు అధికారమున్నది. ప్రభువును నమ్మిన వారు తప్పక నీతిగా జీవిస్తారు.
హోషేయా 10:12 - నీతి ఫలించునట్లు విత్తనము వేయుడి ప్రేమయను పంట కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి. నీతిఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ప్రభువును అంగీకరించి ఆయనకు ఇష్టులుగా ఉండు వారికే భూమి మీద సమాధానము. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. యధార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు చేయువాడు తన మరణమునకే చేయును.
కనుక మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును స్వనీతిని, అనీతిని వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచ బడినవారై, నీతియు యధార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతిమంతుడైన క్రీస్తును ధరించుకొని దేవునితోను దేవుని పోలికలో చేయబడిన మానవునితో సమాధానము కలిగి యుందము.
డ్యతీజశ జశ జదఆళ్యఖఒశళఒఒ ఇళళజూఒ ద్ఘ్పూళఒఆ యఛి ఔళ్ఘషళ.
డ్యతీజశ జశ -ళ్ఘషళ ఇళళజూఒ ద్ఘ్పూళఒఆ యఛి జదఆళ్యఖఒశళఒఒ. నిఆ’ఒ ఘ షకషళ.
నీతియను మైమరువు (ఇళ్ఘఒఆఔ్ఘఆళ యఛి జదఆళ్యఖఒశళఒఒ) ను ఎల్లఫ్పుడు తొడుగుకొని ఉండాలి. దేవుని శక్తిని కలిగి సాతానుడు హృదయములో పుట్టించే అనీతికరమైన ఆలోచనలను తీసివేసి నీతిగా జీవించాలి. క్రీస్తు నీతిని ఎల్లప్పుడు, అన్ని స్థలాలలో ధరించే ఉండాలి. లోకంలో ఎక్కడకు వెళ్లినా సరే. అప్పుడే నీతి ఫలించేటట్లు విత్తనాలు వేయగలము. తద్వారా లోకం నీతితో సమాధానముతో శాంతితో ప్రేమతో నింపగలము. అనీతిని పారద్రోలగలము.
నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. నీతిమంతులను యెహోవా ప్రేమించును. నీతిమంతులు ఖర్జూరము వలె మొవ్వ వేయుదురు. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల నివాస స్థలమును ప్రభువు ఆశీర్వదించును. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతులను జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరము. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. నీతిమంతులు చిగురాకు వలె వర్థిల్లుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి.
నీతిని అనుసరించి నడచుచు యధార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్యయును మాట వినకుండా చెవులు మూసికొని చెడుతనము చూడకుండా కన్నులు మూసికొను వాడు ఉన్నత స్థలమున నివసించును. - యెషయా 33:15
నీతి కొరకు ఆకలిదప్పులు గలిగి ఈ ధన్యత లన్నింటిని పొందుకొని తృప్తి కలిగి జీవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256