ప్రార్థన

రక్షణ శిరస్త్రాణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.’ - ఎఫెసి 6:11
సర్వాంగ కవచము దేవుడు ఉచితముగా ఇచ్చేది. ఎవరో ఇచ్చేది కాదు. ఎక్కడో దొరికేది కాదు. ఆయనను నమ్మినటువంటి వారికందరికి ఉచితము. దేవుడు లోకాన్ని ప్రేమించి లోకమంతటికి కృపతో రక్షణను అనుగ్రహించాడు. దానిని పొందుకున్న వారి శిరస్సుకు ఇది రక్షణ శిరస్త్రాణము (హెల్మెట్)గా ఉంటుంది.
రక్షణ శిరస్త్రాణమును కలిగి ఉంటే - * పాత ఆలోచనలు, అభిప్రాయాలు, అబద్ధాలు, గందరగోళ పరిస్థితి పోయి పరిశుద్ధమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉంటాము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుతాము.
* తరచు మనకు వచ్చే అనుమానాలు ఉండవు. అనవసరమైన అనుమానాల వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందుల్లో కూరుకు పోతున్నాయి. భార్యాభర్తలు అనుమానాలతో ఇంటినే నరకం చేసుకొంటున్నారు. దాని నుండి గొడవలు, కొట్లాటలు చివరకు విడాకుల దాకా వెళ్తున్నారు.
* అల్పకాల భోగాలు సుఖాల కన్న నిత్యజీవము మీద మనసు ఉంటుంది.
* క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన సంగతి జ్ఞాపకముంచుకొని, (పాపము విషయములో మృతులుగా దేవుని విషయములో క్రీస్తు యేసు నందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. - రోమీ 6:11) క్రీస్తులో జీవము కలిగి ఉంటాము.
క్రీస్తు యేసు నందున్న వారు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో సమస్తము కొత్తవాయెను - 2 కొరింథీ 6:17
దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. - 1 యోహాను 3:9. క్రీస్తును నమ్మినవారు అందరూ దేవుని వలన పుట్టినవారే.
* మన నిరీక్షణ (్హ్యఔళ) విషయములో పూర్తిగా క్రీస్తు పైనే ఆధారపడి ఉంటాము.
నీవు నాకు ఉండగ లోకములోనిది ఏదీ నాకక్కరలేదు అని దావీదు మహారాజు కీర్తన 73:25లో చెప్పినట్టు, మనము కూడా ఎటువంటి ఆరాటము లేకుండా ఉండగలము. డ్ఘ్ప్ఘఆజ్యశ జఒ ఒ్ఘ్పళ, దళఔ జశ జూజఒఆళఒఒ, ళఒషఖళ, జూళజ్పళూ, ఒళఆ చిళళ.
హళౄళఆ ఎంత ఉపయోగమో మనకందరికి తెలిసిందే. పోలీసు వారు పదేపదే చెబుతూనే ఉంటారు. కొన్నిసార్లు వారే కొని ఇస్తున్నారు కూడా. ఇది మన మేలుకే అన్నది చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. వాస్తవానికి హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ ఉంది గనుక చాలామంది కొంటున్నారు. కొంతమంది మాత్రమే ధరిస్తున్నారు. కొంతమందేమో హేండిల్‌కి తగిలించి ఉంచుతున్నారు. కొంతమంది హెల్మెట్‌ను తలకు పెట్టుకుంటారు గానీ బకిల్ అప్ చేయరు. దానివల్ల ఉపయోగం లేదు. ప్రమాద సమయములో అది ఉపయోగపడదు. మాకు తెలిసిన ఒకమ్మాయి హెల్మెట్ పెట్టుకుంది గానీ బకిల్ అప్ చేయక పోవటం వల్ల ప్రమాదం జరిగి తలకు గాయమై కోమాలోకి వెళ్లి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. దీన్నిబట్టి హెల్మెట్ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. శరీరంలోని ఏ అవయవం లేకున్నా బతికేయ్యొచ్చు గానీ తల లేకుండా ఎలా? దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే.
క్రీస్తును నమ్మినటు వంటి వారు ఆయన ఉచితముగా ఇచ్చిన రక్షణను తప్పనిసరిగా తలకు తగిలించుకోవాలి. అయితే చాలామంది చర్చిలో మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటారు. బైటకు రాగానే దాన్ని తీసివేస్తారు. ఆఫీసులలో మార్కెట్ స్థలాలలో అసలు వాడరు. ప్రార్థన సమయాలలో పెడుతూ ఉంటారు. శిరస్త్రాణము ఎంత మంచిది ఉన్నా ధరించుకొనకపోతే ఉపయోగం లేదు. కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. చులకనగా చూస్తున్నారు. ఇది మాకవసరం లేదు అనుకునేవారు కూడా ఉన్నారు.
మన తలంపులలో ఊహలలో ఎన్ని దురాలోచనలు, దుష్ట తలంపులు వస్తుంటాయో మనకు తెలుసు. క్రీస్తును ధరించుకొనక మునుపు నా తలంపులు ఊహలు ఎలా ఉండేవి నాకు తెలుసు. ఆ చెడు తలంపులకు వావి వరుసలు, చిన్నాపెద్దా తేడాలు ఉండేవి కాదు. క్రీస్తే మన ‘హెల్మెట్’ అయినప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనకు పరిశుద్ధమైన తలంపులు ఉంటాయి. ఆయన చేసిన బలియాగము జ్ఞాపకముంటుంది. మన చెడు తలంపులకు మన తలకు పెట్టవలసిన ముండ్ల కిరీటము ఆయన ధరించి, రక్షణ శిరస్త్రాణమును మనకు ఇచ్చాడు. రక్షణ శిరస్త్రాణము ధరించుకొని సాతానుని ఎదిరించి స్థిరముగా ఉంటే జీవ కిరీటము ఇస్తానని వాగ్దానమిస్తున్నాడు. - ప్రకటన 2:10. సాతానుతో పోరాడటానికి రక్షణ శిరస్త్రాణము ధరించవలసిందే. లేకపోతే వాడు వేసే బాణాలు మన తలకు తగిలే అవకాశముంది. దుష్ట తలంపులు, చెడు ఆలోచనలు, భయాందోళన, దిగులు, విచారము, కోపం, అసూయ, అహం.. ఇంకా ఇహలోక పరమైన అనేక విషయాలు చోటు చేసుకొంటాయి. పాపములో పడి రక్షణ పోగొట్టుకుంటాము.
దేవుడే మానవునిగా వచ్చి ఎన్నో శ్రమలు శోధనలు భరించి కొరడా దెబ్బలు తిని ముండ్ల కిరీటము పెట్టించుకొని మోయలేని సిలువను మోసి చేతులలో కాళ్లల్లో సీలలతో గుచ్చబడి రక్తమంతా ధారపోసి ప్రాణమిచ్చి సంపాదించిన ఈ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల నరకము నుండి ఎలా తప్పించుకొనగలము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. రక్తము చిందించిన యేసు నామమున మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.- అపొ.కార్యములు 4:12.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. - మత్తయి 1:21
చేసిన పాపాల నుండి రక్షణ. ఇక చేయకుండా రక్షణ.
క్రీస్తును ధరించుకున్నప్పుడు అది తలను మాత్రమే కాదు కన్నులకు చెవులకు నాలుకకు కూడా కవచముగా ఉంటుంది. చెడును చూడనివ్వదు. విననివ్వదు. మాట్లాడనివ్వదు.
క్రీస్తు ఇచ్చిన రక్షణ శిరస్త్రాణమును ధరించుకొనకపోతే ఉపయోగము లేదు. మన తలంపులు మాటలు చూపులు ఏవీ మన నియంత్రణలో ఉండవు.
క్రీస్తు రక్షించకపోతే మన పాపాలను కడుగకపోతే, మన జన్మ పాపములు కర్మ పాపములకు ప్రాయశ్చిత్తము లేదు. పాపాలకు పరిహారము మానవునికి అసాధ్యము. లోకములో ఏ నీరు మన మెదడును శుభ్రపరచలేదు. కేవలము క్రీస్తు చిందించిన సిలువ రక్తములోనే మన పాపములకు పరిహారము కలుగుతుంది. సిలువలో మన పాపముల కొరకు రక్తము చిందించిన క్రీస్తును కలిగి ఉండటమే మనకు రక్షణ. ఈ రక్షణను కొనసాగిస్తూనే ఉండాలి.
క్రీస్తులో ఉచితముగా దొరికే ఈ రక్షణను పోగొట్టుకొనకూడదు. ఎవరైనా ఈ రక్షణను పొందుకోవచ్చు. క్రీస్తు మనకు కొండ అండ కోట దుర్గము బలమై ఉన్నాడు. ఆయనలో మనకు రక్షణ బలము ధైర్యము శక్తి ఐశ్వర్యము ఆరోగ్యము కాపుదల భద్రత నడిపింపు అన్నీ ఉంటాయి.
యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును. -కీర్తన 27:1
యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము.
ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త.
క్రీస్తును ప్రేమించి శిరస్సునకు కవచముగా ధరించుకొంటే నరకము నుండి తప్పిస్తాడు. ఘనపరుస్తాడు. మొఱ్ఱ పెట్టినప్పుడు జవాబిస్తాడు. శ్రమలో తోడై ఉంటాడు. బంధకాల నుండి విడిపించి గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరచి రక్షణ చూయిస్తాడు.
దేవుడిచ్చిన ఈ రక్షణను చులకనగా చూడవద్దు. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎవరి రక్షణ వారిదే. ఒకరిది ఇంకొకరికి ఉపయోగపడదు.
మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడుదురు. ఇది దేవుని వరము. ఉచితముగా దేవుడిచ్చే ఈ రక్షణ వరాన్ని అందరము పొందుకొని కొనసాగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక.
పాప బంధకాల నుండి శాపము నుండి రక్షించటానికి శక్తిగల మన అద్వితీయ దేవునికి మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక. ఆమెన్.
రక్షణ శిరస్త్రాణము ధరించు.. క్రీస్తు వలె మాట్లాడు ఆలోచించు జీవించు.

-మద్దు పీటర్ 9490651256