ప్రార్థన

ఆత్మరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కాని ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు.
మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు కాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు.’ - మత్తయి 12:31
ఈ వాక్యములో ముందు భాగములో గొప్ప వాగ్దానముంది. పాప క్షమాపణ ఉంది. క్రీస్తులో ఈ క్షమాపణ ఉంది. మారుమనస్సు పొంది పాపాల విషయమై పశ్చాత్తాపపడితే, క్రీస్తు యొక్క యజ్ఞమును నమ్మి క్రీస్తును వెంబడిస్తే ఎంత పాపియైన ఎటువంటి పాపికైన క్షమాపణ ఉంది. క్రీస్తు రక్తములో పాపములు క్షమించబడతాయి. దేవుని క్షమాపణ దొరుకుతుంది. ఈ సువార్త లోకములో ప్రకటింపబడుతుంది. పాపాలు మాని పశ్చాత్తాపముతో క్రీస్తు ద్వారా క్షమాపణ పొందిన నీ జీవితమే ఒక సువార్త ప్రతీక. నీ పాత జీవితము, ఇప్పటి నీ జీవితము - లోకానికి గొప్ప సాక్ష్యము. మనుషులు నీ సత్క్రియలు చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహిమ పరుస్తారు. ఈ సత్క్రియలు చేయటానికి సిలువ శక్తి కావాలి. ఒక్కొక్క మంచి కార్యము చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే నీ తండ్రికి మహిమ నీకు ఆశీర్వాదము కలుగుతుంది.
నీవు కీడు మాని మేలు చేయటం మొదలుపెట్టాలి. కీడు మానినంత మాత్రాన కాదు. మేలు చేయాలి. అప్పుడే తండ్రికి మహిమ కలుగుతుంది. దూషణ మాటలు మాని దీవించాలి. దుష్క్రియలు మాని మంచి కార్యములు చేస్తూ ఉండాలి. దొంగతనము మాని నీ చేతులతో కష్టపడి అక్కర గలవారికి పంచి పెట్టాలి. పుచ్చుకొనుట కంటె ఇచ్చుట మేలు. అసమాధాన పరిస్థితులను మార్చి సమాధానకరముగా ఉండాలి. సమాధానాన్ని వెదకి వెంటాడాలి. చెడుతనమును అసహ్యించుకోవాలి. మంచితనాన్ని ప్రేమతో సంతోషంగా జరిగించాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. వివేకము కలిగి ఉండాలి. కీడుకు దూరముగా ఉండాలి.
నిష్కపటమైన ప్రేమతో ఉండాలి. చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి. చెడ్డ వాటిని ఆశించకు. వ్యభిచరించకు. ఇశ్రాయేలీయులు వ్యభిచరించినందున ఒక్క దినము నందే 24వేల మంది చనిపోయారు. ఆత్మను ఆర్పకుడి. సమస్తము పరీక్షించి మేలైనది చేయాలి. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుడి. అప్పుడే నీ ఆత్మరక్షణ కొనసాగుతుంది. రక్షింపబడుచున్న నీ జీవితము అనేకుల రక్షణకు కారణమై ప్రతిఫలముగా దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి.
అయితే రెండవ భాగములో చెప్పబడిన కఠినమైన మాట ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.
జరిగిన సంగతేమిటంటే - పక్షవాయువుతో బాధపడుచున్న ఒకనిని ప్రభువు యొద్దకు కొంతమంది తెచ్చారు. వారికి పూర్తి విశ్వాసముంది. అయితే యేసు ప్రభువు చెప్పిన మాట - కుమారుడా! నీవు ధైర్యముగా ఉండుము. నీ పాపములు క్షమింపబడి యున్నవని. అందుకు అక్కడున్న శాస్త్రులలో కొందరు - ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనుచుండగా, వారి తలంపులు గ్రహించిన ప్రభువు - నీ పాపములు క్షమించబడి యున్నవని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవానిని చూచి - నీవు లేచి నీ మంచమెత్తికొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమ పరచిరి. -మత్తయి 9:1-8.
పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడిన మాటలకు, పరిశుద్ధాత్మ కార్యాలకు వ్యతిరేకముగా మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు. క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థతలను, క్షమాపణను అంటే దేవునికి వ్యతిరేకముగా మనుష్యులకు వ్యతిరేకముగా చేసిన పాపములు క్షమించుటను అంగీకరించని వారికి క్షమాపణ ఉండదు. ఈ యుగములో ఉండదు రాబోవు యుగములో కూడ ఉండదు. అందుకే ఆత్మ కార్యములను జాగ్రత్తగా గమనించాలి.
ఇది బుద్ధిపూర్వక నిర్లక్ష్యం. దీనికి క్షమాపణ లేదు. పైన పక్షవాయువు గలవానిని చూస్తే తన పాపాలు వెంటనే క్షమించబడ్డాయి. స్వస్థత వెంటనే లభించి మంచము పట్టి లేవలేని వాడు శుద్ధుడై లేచి తన ఇంటికి వెళ్లాడు. మనమైనా ఈలాగున నమ్మి పశ్చాత్తాపపడి పాపక్షమాపణ క్రీస్తు చేయగలడని విశ్వసించి, ఆయనను వేడుకొంటే, ఆయన సిలువ రక్తములో మనకు క్షమాపణ వెనువెంటనే కలుగుతుంది. యేసు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎప్పటికీ మారడు. నమ్మితే ఈ దినము కూడా గొప్ప కార్యాలు చూడగలము.
యూదుల విశ్వాసమేమంటే, పాపము ద్వారా వ్యాధి సంభవించునని. వీరి ఆలోచన గ్రహించిన ప్రభువు తనకు పాపములను క్షమించు అధికారము గలదని మొదట నొక్కి చెప్పి గ్రహింపచేసెను. తరువాత దానికి గుర్తుగా పక్షవాయువుగల రోగిని స్వస్థపరచెను. మనుష్యులకు వ్యతిరేకముగా చేసిన పాపములు దేవుడు మాత్రమే క్షమించగలడు. ఒక విధముగా చెప్పాలంటే పాపాలన్నీ అవి ఏవైనా దేవునికి వ్యతిరేకముగా చేసినవే.
మనము సత్యమును గూర్చి సత్యవంతుడైన యేసు ప్రభువును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు - హెబ్రీ 10:26.
బుద్ధిపూర్వక పాపము: చేయకూడదని తెలిసినా, దేవుని ఆజ్ఞలు తెలిసి కూడా, చేయకూడని కార్యములు చేయుట, దేవుని భయము లేకుండుట, దేవుని విడిచి, దేవుని సంఘాన్ని విడిచి ఇష్టమొచ్చినట్టు జీవించుట (నిఆ జఒ ఘశ ళ్ఘ్ళూ జూళజఇళ్ఘూఆళ తీజజశ ఔళూఒజఒఆ్ఘశఆ ఒళఆఆళజూ, ఔ్ఘఆఆళూశ యఛి ఒజశ.)
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని నూతనపరచుట అసాధ్యము - హెబ్రీ 6:4-8.
ఒకసారి దేవుని ఎరిగి ఆయన ప్రేమను శక్తిని తెలిసిన తరువాత వెనుతిరిగితే - అది అందరికీ తెలిసిపోతుంది. ప్రజల మధ్య ప్రభువు నామము అవమానపరచబడుతుంది. ప్రభువు నామము దూషింపబడుట మనకు శాపము. దేవునికి మన నుండి మంచి పేరు రావాలి గాని అవమానము కాదు.
భూమి ఫలించి వ్యవసాయదారునికి మంచి పేరు తెస్తుంది. మనము ఫలించుట వల్ల దేవునికి మహిమ మనకు ఆశీర్వాదము. ముళ్ల తుప్పలు గచ్చపొదలు పెరిగే పొలాన్ని బట్టి యజమానుడు సంతోషపడడు గాని దాన్ని కాల్చివేస్తాడు. బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే దేవుని నామమునకు అవమానము గనుక ఇక వారికి తీర్పే.
మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా - హెబ్రీ 12:25.
మనతో ఉండటానికి సత్య స్వరూపియగు ఆత్మను ప్రభువు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యము లోనికి నడిపిస్తాడు. సంభవింపబోవు సంగతులను తెలియజేస్తాడు. ఆదరణకర్త మనకు ఉత్తరవాది. ఏది మంచిదో, ఏది మంచిది కాదో తెలియజేస్తాడు. చెడును విసర్జించి మంచి చేయటానికి సహాయము చేస్తాడు. దేవుని నుండి దేవుని బిడ్డల నుండి, దేవుని వాక్యము నుండి, లోకము వైపు పాపము వైపు వెళ్లేటప్పుడు మనలను హెచ్చరిస్తాడు. మనలో పశ్చాత్తాపము కలుగజేసి పాపాన్ని ఒప్పింపచేసి, క్షమాపణ కొరకు తండ్రిని అడిగే మనస్సు ఇస్తాడు. విరిగి నలిగిన హృదయాన్నిచ్చి దేవుని వైపు ఆయన ప్రేమ వైపు క్షమాపణ వైపు మళ్లిస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్ముని హెచ్చరికలు దిద్దుబాట్లు పట్టించుకోకుండా, పరిశుద్ధాత్ముని హెచ్చరికలు వినకుండా, ఇష్టం వచ్చినట్లు జీవించే వారికి ఇక క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యాలను, పరిశుద్ధాత్మ శక్తిని లెక్కచేయకుండా, ఆత్మను నిర్లక్ష్యము చేయటమే క్షమించకూడని పాపము. ఈ యుగములో కాదు మరి ఏ యుగములో క్షమాపణ ఉండదు. జాగ్రత్త.
పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. రక్షింపబడిన వారిలో ఉండి మనకు బోధిస్తూ ఉంటాడు. వాటిని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, మన పాపాలు క్షమించటానికే ప్రభువు ఈ లోకానికి వచ్చి, మన కొరకే బలిగా అర్పించబడ్డాడు. లోకమంతటికి క్షమాపణ ఉంది. పశ్చాత్తాపపడి క్షమాపణ కొరకు ప్రభువుని వేడుకోవాలి. ప్రభువు పంపిన ఆదరణకర్త, సత్యస్వరూపియైన ఆత్మను చేర్చుకొని, ఆత్మ నడిపించే మార్గములో నడవాలి.
సహోదరులారా! జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనికైనా ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మోషే ధర్మశాస్తమ్రును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద, కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది గావించి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? జీవము గల చేతిలో పడుట భయంకరము. రక్షణ సువార్తను తృణీకరించవద్దు. సువార్తను అందించే వారిని నిరాకరించవద్దు. పరిశుద్ధాత్మ ఆవేశముతో మన మేలు కోరేవారిని అవమానపరచవద్దు. ఆత్మ ద్వారా హెచ్చరించబడి పాప క్షమాపణ పొందుకొని రక్షించబడుచున్న నీవు ఈ సత్యసువార్తను లోకానికి అందించు. ఎటువంటి పరిస్థితులు అడ్డుపడినా శోధనలు, చిక్కులు, బాధలు, హింసలు కలిగినా ధైర్యమును విడిచిపెట్టకు. ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎటువంటి పరిస్థితికైనా ప్రభువు చాలిన దేవుడు కనుక, విశ్వాసములో వెనుతిరగక ఆత్మను రక్షించుకొనుటకు ముందుకు సాగుదము.
పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై యుండి సర్వసత్యములోనికి నడిపించునుగాక.

-మద్దు పీటర్ 9490651256