ప్రార్థన

శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటె నిన్ను హెచ్చించును’ - ద్వితీయో 28:1.
శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు - సామెతలు 12:24.
ఉండవలసిన పనుల మీద శ్రద్ధ ఉండటము లేదు. ఉపయోగపడే విషయాల మీద శ్రద్ధ ఉండటం లేదు కానీ అనవసరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అంటే మనిషి శ్రద్ధ గలవాడే, తనకిష్టమైన వాటి మీద శ్రద్ధ చూపగలడు. ఆ లక్షణము ఉంది. కానీ ఉండవలసిన దాని మీద కాదు. ఉండవలసిన దగ్గర శ్రద్ధ ఉండటం లేదు. ఉండకూడని విషయాలలో అతిగా శ్రద్ధ కనపడుతున్నది. ఈ మార్పు ఎందుకు వచ్చి ఉంటుంది? అసలు నిర్లక్ష్యమెందుకు వచ్చింది? అశ్రద్ధగా ఎందుకు ఉంటున్నారు? లోకమంతా ఇదే ఆరోపణ. మీ పిల్లవాడికి చదువు మీద శ్రద్ధ లేదండీ. మీ వాడు పనిలో శ్రద్ధగా ఉండడు. ఇల్లంటే శ్రద్ధ లేదు. భార్యాబిడ్డల మీద శ్రద్ధ లేదు. ఇవి తరచుగా వచ్చే ఆరోపణలు.
పిల్లలకు చదువుల మీద శ్రద్ధ ఉండటం లేదు. చదువుకునే రోజుల్లో సరియైన శ్రద్ధ చూయించక చెడు అలవాట్లకు బానిసలై బ్రతుకును నాశనము చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం, చాలీచాలని జీతాలతో కుటుంబాలు ఎన్నో సతమతమవుతున్నాయి. అన్ని వసతులు ఉన్నాగానీ శ్రద్ధ లేకపోవటం వల్ల జీవితాలు అలా తగులబడుచున్నాయి.
అసలు తల్లిదండ్రుల మీద శ్రద్ధ లేదు. వారి మాటలు ఎంతో అనుభవపూర్వకమైనటు వంటివి అయినా సరే వారి మాటలంటే శ్రద్ధ లేదు. దానివల్ల పిల్లలు ఎంతో నష్టపోయారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే బైబిల్‌లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పబడింది. కని పెంచిన తల్లిదండ్రులంటే ఎందుకంటే చులకన భావమో? ఆంటీ అంకుల్స్ మాటలు చాలా శ్రద్ధగా వింటారు. మరి తల్లిదండ్రులు ఏం తప్పు చేశారు? ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా నిన్ను శ్రద్ధగా పెంచటం వల్ల నీవు ఈ స్థితిలో ఉన్నావని జ్ఞాపకముంచుకోవాలి. వాళ్ల మాటలు ఎంత శ్రద్ధగా వింటే అంత వృద్ధి చెందుతావు. శ్రద్ధ వృద్ధి చేస్తుంది.
అసలు కారణము దేవుని మాటలంటే శ్రద్ధ లేదు. దేవుడంటే శ్రద్ధ లేకపోవటమే ముఖ్య కారణము. దేవుడు మనలను సృష్టించి సమస్త అవసరతలను తీరుస్తూ కంటికిరెప్ప వలె కాయుచు పాపపు ఊబిలో చిక్కుకొని, మన సొంత బలముతో, శక్తితో, జ్ఞానముతో, ఆస్తిపాస్తులతో బయటపడలేని మనలను రక్షించటానికి నరావతారిగా ఈ లోకములోనికి ఒక సేవకునిగా వచ్చి, పాప క్షమాపణకు తన రక్తాన్ని ధారపోసి ప్రాణానే్న బలిగా అర్పించి రక్షించాడు. దేవునికి స్తోత్రము. అయినా ఆయన మాట అంటే శ్రద్ధ లేదు. ఆయన పని అంటే శ్రద్ధ లేదు. నీ అధికారికిచ్చిన గౌరవము కూడా దేవునికి ఇవ్వవా?
దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కన్నతల్లి తన బిడ్డను మరచునా? మరచినా గానీ నేను నిన్ను మరువనంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయను. నిన్ను కునుకక నిద్రపోక కాపాడతానంటున్నాడు. ఆయన సన్నిధికి వెళ్లటానికి ఎంతో సంతోషముతో కీర్తనలతో అర్పణలతో వెళ్లాల్సింది. కానీ ఏదో వెళ్లాలి కాబట్టి గుడికి వెళ్లడం, వీలైతే ఏదో ఒక సాకుతో ఎగ్గొట్టటం, ఏదో వెళ్లాం కాబట్టి కూర్చోవటమే గానీ అసలు ఏమి జరుగుతుందో? పాడే పాటల అర్థమేమిటో గ్రహించరు. ఏళ్ల తరబడి పాడి పాడి కంఠతా అవుతోంది కానీ దాని అర్థమేమిటో తెలియదు. ఆరాధన ఎలా జరుగుతోంది? మనమెలా ఆరాధించాలి? ప్రార్థనతో ఏమి చేస్తున్నారో? ఆ సమయములో మనమేమి చేయాలి.. ఈ విషయాలపై శ్రద్ధ ఉండటం లేదు. అసలు దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కానీ కనీసం శరీరముతో కూడా ఆరాధించటం లేదు. చాలామంది ‘బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సంట్’ లాగా ఉంటున్నారు. ప్రార్థన మీద ఉండవలసిన శ్రద్ధ లేకపోవడం వల్ల ఇక మైండ్ దేశ విదేశాలు ఇల్లు వాకిలీ తిరిగి వస్తుంది.
‘మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని విని అనుసరించిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే’ అనెను - నిర్గమ 15:26.
కనుక గుడిలో ఉన్నప్పుడు, ఈ రోజు దేవుడు నాకు ఏ విషయాన్ని తెలుపుచున్నాడు. దానిని ఎలా పాటించాలి అనే ఆలోచనతో శ్రద్ధగా వినాలి. కానీ అంత శ్రద్ధ ఉండటం లేదు కాబట్టి అసలు సంగతి ‘పక్కదారి’ పడుతుంది. ఎంతో వినయంగా విధేయతగా కూర్చుంటాం కానీ శ్రద్ధ లేకపోవుట వల్ల మనకు రావలసిన ఆశీర్వాదము రాదు.
సరే! ఆరాధన అయిపోయి బయటకు వచ్చిన తరువాత ఇక ఎవరి ఇష్టం వారిది. ఇష్టమొచ్చినట్టు మాటలు, దూషణలు, అసభ్యకరమైన మాటలు, చూపులు, సరసాలు, వ్యంగ్యాలు మొదలౌతాయి. దేవుడేమో నోటిని నాలుకను అదుపులో ఉంచుకోమంటే.. ప్రభువు మాటల మీద శ్రద్ధ లేనివారు చేసే పని ఇది. వాస్తవానికి అనుకూలమైన మాటలు మాట్లాడి దీవించాలి. హెచ్చరికలు చేయాలి. సువార్త సంబంధమైన మాటలు ఉండాలి. ఆ దినము ప్రభువు ఏమి మాట్లాడాడో ఏమి సరిచేసుకోమన్నాడో ఎలా ఉండమని చెప్పాడో వాటిని గూర్చి మాట్లాడాలి. ‘ఎమ్మాయి’ గ్రామములో శిష్యులు ప్రభువు మాటలు విన్న తరువాత వారి హృదయాలలో ఉన్న మంటను గూర్చి చెప్పుకున్నట్టు ఉండాలి.
ఇంకా రెండు అడుగులు బయటకు వేసి దాహం తట్టుకోలేక మండుటెండల్లో నీటి కోసం తహతహలాడినట్టు ధూమపానానికి వెళ్తారు. పొగ త్రాగుట హానికరమైందని వ్రాసి మరీ అమ్ముతుంటే బైబిల్‌లో ఎక్కడా పొగ తాగకూడదని ఉన్నదో చూయించండని వాదించే వారున్నారు. అది సమర్థత కాదు.
ఇక అసలు సంగతి ‘లంచ్’ ఏమిటి? - దాని మీద తర్జన భర్జన. ఒకరు ఒకటంటే ఇంకొకరు ఇంకొకటి. ఇలా వాదన ప్రతివాదనలు. ఎవరి ఇష్టం వారిది. ఒక సంగతి ఆలోచిద్దాం. అసలు తిండిలేనివారు అలమటిస్తూ ఆకలితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారితో పోలిస్తే దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదించాడు. దానికి బదులు మనము చేయగల సహాయము చేయాలి గానీ ఏమి తిందాం? ఎక్కడ తిందాం? ఎలా తిందాం - ఏ/సి హోటల్‌లోనా? అనే విషయం కాదు. దేవుడు చేసిన దానికి కృతజ్ఞతతో సంతోష సమాధానాలతో ఉంటూ చేయగల సహాయము చేస్తూ ఉంటే ఇంకా ఆశీర్వదిస్తాడు.
ప్రభువు తీర్పు దినాన ‘నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు. నేను దాహము గొంటిని మీరు నాకు దాహమివ్వలేదన్నప్పుడు’ ఆశ్చర్యం కలుగుతుంది. యేసు ప్రభువు వచ్చి ఎప్పుడు దాహమడిగాడు. ఎప్పుడు ఆహారమడిగాడు అనిపిస్తుంది. అయితే అల్పులైన వారికి నీవు చేయగలిగి చేయకపోవటమే ప్రభువుకు చేయకపోవటం. ఆయన చెప్పిన మాట శ్రద్ధగా వింటే ‘నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించమ’ని. అలా చేస్తే ఏది చేసినా ప్రభువునకు చేసినట్టే. ప్రభువు పేరిట గినె్నడు చన్నీళ్లు ఇచ్చినా దానికి ప్రతిఫలముంటుంది. అల్పులు ఘనులు అందరూ ఆయన దృష్టిలో సమానులే. అందరూ ఆయన రూపులో చేయబడినవారే. నీకు ఘనత ఇచ్చి సహాయము చేయగలిగే అవకాశమిచ్చింది ఆయనే. అల్పుల సంగతి ఆలోచిస్తుంది ఆయనే. ఆయన అందరినీ అన్ని వేళలా చూస్తున్నాడు.
మనలో పక్షపాతముంటుంది. ఉన్నవాళ్లకే తీసుకెళ్లి అవీ ఇవీ ఇస్తాం. పేదవాళ్లను అదీ సొంతవాళ్లను కూడా అశ్రద్ధ చేస్తాం. అసహ్యించుకుంటాం. నెట్టివేస్తాం. పేదవారిని అవసరములో ఉన్నవారిని అశ్రద్ధ చేస్తే దేవుణ్ణి అశ్రద్ధ చేసినట్టే. కానుకలు లక్షలు ఇచ్చినా, నీ బంగారమంతా దేవునికి ఇచ్చినా దేవుని దగ్గర చెల్లదు. దేవుని ఖాతాలో పడవు. మనుషులకు కనపడవలెనని మనుషుల మెప్పు కొరకు కాదు సమస్తము చూస్తున్న ప్రభువు కొరకే చేయాలి. ప్రభువు మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారము చేస్తే ప్రభువు ఆశీర్వాదము మన మీద మెండుగా ఉంటుంది. ఆకాశ వాకిళ్లు విప్పి తన గొప్ప ధన నిధిలో నుండి మనలను ఆశీర్వదిస్తాడు.
‘ఉపదేశములను నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి’ - సామెతలు 8:33
‘మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడచిన యెడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు’ - నిర్గమ 19:5.
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును - సామెతలు 19:17
బీదల కిచ్చువానికి లేమి కలుగదు - సామెతలు 20:27
శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును - సామెతలు 10:4
శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా ఉండును - సామెతలు 18:4
శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు - సామెతలు 21:5
ఆయన మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారము ఒకరినొకరు ప్రేమించుచు ఆకలి గొనిన వారికి ఆహారము దప్పిగొన్నవారి దాహము తీర్చుచు పరదేశులను ఇంట చేర్చుకొనుచు దిగంబరునకు బట్టలిచ్చి రోగులను దర్శించుచు చెరసాలలో ఉన్నవారిని దర్శించుచు ఉండాలి. నీ చేతనైనంత మట్టుకు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది చేస్తూ ఉంటే అది ప్రభువుకు చేసినట్లే. గనుక ప్రత్యేకమైన ఆహ్వానముంటుంది. నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా రండి.. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడని పిలుపు వినపడుతోంది.
దేవుడిచ్చిన ఆరోగ్యము యెడల శ్రద్ధ కలిగి ఉండాలి. కాపాడుకోవాలి. ఆహార వ్యవహారాలు వ్యాయామాలు చేస్తూ దేవునికి మహిమార్థముగా జీవించాలి.
శ్రద్ధ ఉండకూడని విషయాల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ల మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఎక్కువ సమయాన్ని దానితోనే గడుపుచున్నారు. నిలుచున్నా కూర్చున్నా పండుకొన్నా తింటున్నా ఇక ఏం చేస్తున్నా సెల్‌ఫోన్ మీదనే ధ్యాస ఉంటుంది. కన్నపిల్లల మీద ఉండవలసిన శ్రద్ధ సెల్‌ఫోన్ మీద ఉంటుంది. పండుకునే వరకు దానితోనే సమయం గడిపి తిరిగి నిద్ర లేచిన వెంటనే ముందు దర్శనముగా సెల్‌ఫోనే. అయితే వాస్తవానికి మనం శ్రద్ధ చూపవలసినది దేవుని మీద. కారణము మనలను పుట్టించాడు గనుక. ఆయన జీవపు మాటలపైన, అమూల్యమైన మాటలపైన శ్రద్ధ చూపాలి. ఆయన మాటలు మన హృదయములో ఉండాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ యింటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. కానీ జరుగుచున్న సంగతి.. దేవుని మీద ఆయన వాక్యము మీద ఉండవలసిన శ్రద్ధ మొత్తంగా సెల్‌ఫోన్ మీద పడింది. దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాడు.
అయితే దివారాత్రులు సెల్‌ఫోన్ ధ్యాసలో ఉంటున్నారు. దీనిని బట్టి మనకు లభించే ఆశీర్వాదాలు పోతున్నాయి. చివరకు ప్రాణాలు కూడా పోతున్నాయి. సమయమంతా వృథా అవుతోంది. ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఆర్థిక పరిస్థితులు దెబ్బ తింటున్నాయి. మనుషుల మీద శ్రద్ధ చూపించకపోవుట వల్ల సంబంధాలు చెడిపోయి కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. ప్రేమలు పలుచబడుతున్నాయి. కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా విని తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకుంటూ పిల్లలను శ్రద్ధగా చదివించుకుంటూ, దేవుడు మనకిచ్చిన పనులను శక్తివంచన లేకుండా శ్రద్ధగా చేసుకుంటూ వృద్ధిలోనికి రావాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని శాంతి సమాధానాలతో మనమంతా ఉండటానికి ప్రభువును ప్రార్థించుదాము. గొర్రెలను శ్రద్ధగా కాచిన దావీదు చివరకు మహారాజయ్యాడు.

-మద్దు పీటర్ 9490651256