ప్రార్థన

భక్తి - తృప్తి - సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి యుండుట నేర్చుకొని యున్నాను.’ - ఫిలిప్పీ 4:11
ప్రపంచములోని ఏ స్కూళ్లలోను విశ్వవిద్యాలయాలలోను సంతృప్తి కలిగి యుండునట్లు నేర్పించలేరేమో? ఎక్కడ చూసినా High Targets, High Achievements, High Goals తో జీవితమంతా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై యున్నది. మనమీ లోకములోనికి ఏమియు తేలేదు. దీనిలో నుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్తమ్రులు గలవారమై యుండి వాటితో తృప్తి పొంది యుందము - 1 తిమోతి 6:6-8
చాలా మంది భక్తులకు తృప్తి లేదు. కారణం దేవుడు వారికిచ్చినది వారికి చాలటం లేదు. ఎంత ఇచ్చినా చాలటం లేదు. వందలలో ఉన్నవారికి వేలు ఇచ్చినా చాలక లక్షల కోసం చూస్తున్నారు. లక్షలలో ఉన్నవారు కోట్ల రూపాయల కొరకు చూస్తున్నారు. కోట్లున్న వారు అవి చాలనట్లు బ్యాంక్‌ల నుండి రుణాలు తీసుకొంటున్నారు. గురు శిష్యులు ధనాన్ని పెంచుకోవటానికి భక్తి చేస్తున్నారేమో అనిపిస్తున్నది. మోసపు భక్తి ఎక్కువైంది. ఇది బ్రతుకుతెరువుగా మారింది. భక్తి ముసుగులో అనేకమైన మోసాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్నవి. తెలిసినా మోసపోతూనే ఉన్నారు. భక్తిలో చివరిగా కోరుకునేది ఆశించేది డబ్బు, హోదా, పదవి, ఆస్తి.. ఇంకా వ్యభిచారం ఎక్కువగా కనపడుతున్నవి. భక్తిలో ఈ విషయాలే బయటకు కనపడుతున్నవి.
వాస్తవానికి భక్తిలో ప్రేమలో పండాలి.. ప్రేమ పండాలని కోరుకోవాలి. ఎంతమటుకు ప్రేమ పండాలని కోరుకుంటున్నారో తెలియదుగానీ ఆస్తిపాస్తులు పసిడి పంటల కోసం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రేమ మనుషులను వాడుకునేది కాదు. మనుషులకు ఉపయోగపడే ప్రేమ పండాలి. భక్తిలో పండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. స్వప్రయోజనమును విచారించుకొనదు. వాస్తవానికి ఇటువంటి నిస్వార్థమైన ప్రేమనే మనుషులు కోరుకునేది.
భక్తి చేయటం మనకు చాలా ఉపయోగము. దేవునికి దగ్గరౌతాము. దేవునితో సత్సంబంధము సహవాసము కలిగి ఉంటాము. మనము దేవుని వారవౌతాము. దేవుడు మన వాడౌతాడు. దేవుని కోరిక మనతో సహవాసము చేయాలని. మనతోనే ఉండాలని. దేవుని రూపులోనికి మార్చబడతాము. నిత్య సహవాసము పొందుకుంటాము.
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. దావీదు మహారాజు చెప్పినట్టు - ఆయన భక్తులను కాసే దేవుడు. అన్ని విషయాలలోను కాచి ఏ విధమైన కొదువ లేకుండా చూసే దేవుడు. నిజమైన భక్తులకు ఏ కొదువ రానియ్యడు. అన్నిటికి చాలిన దేవుడు చెప్పిన మాట ‘నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయన’ని. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. నేను దేనికి భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో ఉండాలి. ఏమి ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా యేసు ఉంటే చాలు అనగలిగే భక్తి కలిగి ఉండాలి. అంజూరపు చెట్టు పూయకుండినను దాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు కాయకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను అని చెప్పిన హబక్కూకు వలె చెప్పగలిగి భక్తి కలిగి ఉండాలి. భక్తి ద్వారా వచ్చే తృప్తి దేవుని ప్రేమను పొందుకోవటం వల్ల, దేవుని లక్షణాలు కలిగి ఉండటం వల్ల, పరిశుద్ధతగా జీవించటం ద్వారా కలిగే తృప్తి. అంతేగానీ ధనం సమకూడుట వల్ల వచ్చే తృప్తి భక్తివల్ల వచ్చినది కాదు. అసలు ధన సంపాదన వల్ల తృప్తి అనేది ఉండదు. అందుకే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుమని సొలోమోను జ్ఞాని వ్రాశాడు. ద్రవ్యము నపేక్షించు వాడు ద్రవ్యము వలన తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమేనని ప్రసంగి ఐదవ అధ్యాయము పదవ వచనములో సొలోమోను జ్ఞాని వ్రాశాడు. అంతేకాదు ఆస్తి ఎక్కువైతే ఏవౌతుందో పదకొండవ వచనములో వ్రాశాడు. ఆస్తి యెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గానీ ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర (తృప్తి) పొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ సమృద్ధి చేత నిద్ర పట్టదు. అంతేకాదు ఆస్తి వల్ల మనస్సుకు ఆయాసము, నాశనము కలుగునని వ్రాశాడు. ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి సంపాదించినదేది చేతపట్టుకొని పోడు, వచ్చిన ప్రకారమే మరల పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి? ఇది కూడా ఆయాసకరమైనదే. తన దినములన్నియు అతడు చీకటితో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. అయితే కోరదగినది గాను చూడముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏమనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యమని సొలోమోను మహారాజు వ్రాశాడు. ఎంతో సంపాదన కలిగినవాడే, అన్ని రకాలుగా జీవితమును అనుభవించిన వాడు చివరకు వ్రాసిన మాటలివి. ధనములో తృప్తిలేదని, ఎక్కువమంది భార్యల వల్ల తృప్తి లేదని, ఇవే మాటలు పౌలు భక్తుడు మనకు తెలియజేసాడు. సంతుష్టిసహితమైన దైవభక్తి గొప్ప లాభమని, లోకములోనికి ఏమి తేలేదు తిరిగి ఏమీ తీసుకువెళ్లలేము కనుక అన్నవస్తమ్రులు గలవారై తృప్తి కలిగి ఉండమని. లోకపరమైన విషయాలలో తృప్తి దేవుడిచ్చే వరము. ప్రభువును మనము ప్రేమిస్తే దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తానంటున్నాడు. అంటే లోకాన్ని ప్రేమిస్తే తృప్తి ఉండదు. దీర్ఘాయువు ఉండదు. దేవుని ఉపదేశమును భక్తిశ్రద్ధలతో వింటే దీర్ఘాయువు సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.
వాస్తవానికి సగటు మనిషి సంపాదన కొరకు తన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని సగ జీవితం జీవిస్తున్నాడు. మిగిలిన సగ జీవితం పోయిన ఆరోగ్యం తిరిగి పొందుకోవటానికి డబ్బును ఖర్చు చేస్తున్నాడు. "Wealth is like a sea water. The more you drink the thirstier you become' - Philosopheré Arthur Schopenhauer.
True biblical contentment is a conviction that christ's power purpose and provision is sufficient for every circumstance.
తృప్తిపరచగల క్రీస్తును కలిగి ఉండుటయే అసలు తృప్తి. క్రీస్తు ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, ఆ నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని సెలవిచ్చెను. క్రీస్తును వెంబడించే వారిలో తృప్తి ఉంటుంది. నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను అనే ధైర్యము పౌలు వలె మనకు వస్తుంది. నాకు యేసు చాలు ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు చాలు అన్నవారు తృప్తి గలవారౌతారు. క్రీస్తు మనకు తోడుంటే ఈ లోకములో ఏదీ మనకు అక్కరలేదు. దేనిని గూర్చి చింతించవలసిన అవసరముండదు. కారణము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది కాబట్టి - భక్తుడు పౌలు క్రీస్తును పూర్తిగా తెలుసుకున్న తరువాత, ఆయన రక్షణ ప్రణాళిక, సిలువ మరణ పునరుత్థానమును గూర్చి తెలుసుకున్న తరువాత, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి యుండుట నేర్చుకొని యున్నాను అని ఫిలిప్పీయులకు ఆనాడు తెలియచేశాడు.
ఇది నిజమైన భక్తి. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి యుండుటకును ఆకలిగొని యుండుటకును సమృద్ధి కలిగి యుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని యున్నానని నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్న నమ్మకము ధైర్యము కలిగి ఉండటమే తృప్తి. వాస్తవానికి తృప్తి అనేది దేవుని వరము. ఆ వరాన్ని పొందుకున్న వారు ఏ స్థితిలోనైనా ఉండగలరు. కలిమిలో ఉప్పొంగరు. లేమిలో దిగులు చెందరు. ‘యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు మానదు.’ - ఇర్మియా 17:7-8. దేవునిలో అంటుకట్టబడుటయే తృప్తి. సర్వశక్తుని ఆశ్రయించుట ఎంతో గొప్ప భాగ్యము. మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువ లేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. సింహాలు లాంటి గొప్పగొప్పవారు, రాజులైన వారి పిల్లలు కావచ్చు, పరిస్థితులు తారుమారై, వారైనా ఆకలిగొనవచ్చు గానీ యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువై ఉండదు.
నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను. నీతోకూడ వచ్చువాడు యెహోవాయే. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని చెప్పిన ప్రభువు వాగ్దానమును బట్టి ధైర్యముగా ఉండాలి. అన్నిటికి చాలిన యేసే మన తృప్తి. కాబట్టి తృప్తిగానే ఉంటాము. ఇమ్మానుయేలు దేవుడు గనుక ఎల్లవేళల మనతో ఉంటాడు గనుక సర్వసమృద్ధిగల దేవుడున్నందుకు మనకు తృప్తి ఉంటుంది.
విశ్వాసి పాపము చేస్తే సంగతేంటి? నిన్ను ఎడబాయను విడువనని చెప్పిన దేవుడు పాపము చేసేవారితో ఉంటాడా? విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు విడువడు ఎన్నటికి ఎడబాయడు. కారణము నిజమైన విశ్వాసి పాపము చేయడు. అంతేకాదు, పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎందుకు జీవిస్తాము? పాపమును ద్వేషిస్తాము కనుక దేవుడు మనలను విడువడు ఎడబాయడు. ఆయన యందు పూర్తి విశ్వాసము గలవారు ఆయనను మాత్రమే వెంబడిస్తారు. ‘నా గొఱ్ఱెలు నా స్వరము వినును. నేను వాటి నెరుగుదును. అది నన్ను వెంబడించును’ - యోహాను 10:27. దేవుని వెంబడించే వారిని ఎవరూ ఆపలేరు, అపహరింపలేరు. దేవుని బలమైన హస్తాలలో ఉన్నవారిని పాపము శాపము అంటదు.
నీతికొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. క్రీస్తు అనుచరులు నీతికొరకు ఆకలిదప్పులు కలిగి ఉంటారు. కానీ ఇహలోకపరమైన విషయాల మీద ఆశ ఉండదు. ఆకలి ఉండదు. గనుక ఏది ఉంటే దానితో, ఎంత ఉంటే అంతటితో తృప్తిగా ఉంటారు. కనుక గొణుగుడు ఉండదు. ఆరోపణలు ఉండవు. అసంతృప్తి ఉంటే జీవితమంతా ఆరోపణలు ఎవరో ఒకరి మీద ఉంటాయి. చివరకు దేవుని మీద కూడా ఆరోపణలు ఉంటాయి.
Contentment is the result of confidence and trust in God. Contentment will keep us from complaining and from going after greedy things.
Being content is being happy even if you don't get or achieve what you want.
"We will only be truly content with what we have when we know that we have Christ.'
The Love of Money is ruinous.

సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు?
అందుకే హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ‘్ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడని’ ప్రభువు సెలవిస్తున్నాడు. వివాహము యొక్క ప్రాధాన్యతను వివరించిన వెంటనే ధనాపేక్ష ఉండకూడదని తెలియపరచబడింది. మనకు తెలుసు. వివాహమంటేనే డబ్బులతో ముడిపడి ఉంది. ఎంత కట్నం ఇవ్వాల్సి వస్తుందో అని ఒకరు, ఎంత అడిగితే బాగుంటుందని మరొకరు ఆలోచనలతో ఉంటారు. కొంతమంది వివాహ సమయములో ధనాశ చల్లారక ఎన్నో రకాల బాధలు పడుచున్నారు. పెళ్లిలో ఇస్తామన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదని వివాహమైన 40 సం.ల తర్వాత కూడా ఆలోచిస్తున్నారు. అంటే వివాహ జీవితకాలమంతా అసంతృప్తిగానే జరిగి ఉండొచ్చు.
Choose richer or relationship.
ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలలోను ఉరిలోను అవివేకయుక్తములును హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. - 1 తిమోతి 6:9-10.
దైవజనుడా! నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడి తృప్తి కలిగి జీవించు

- మద్దు పీటర్ 9490651256