ప్రార్థన

వివాహము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వివాహము అన్ని విషయములలో ఘనమైనది’ - హెబ్రీ 13:4
నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదు.
పెళ్లి, వివాహము దేవుని దృష్టిలో ఘనమైనది. పవిత్రమైనది. అయితే దానిని తేలికగా చూస్తారు. కారణం తెలీదు. పిల్లల్ని తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు ‘నీకు పెళ్లైంది లేరా!’ అంటారు. పిల్లలపై బాగా కోపం వచ్చినప్పుడు ‘ఇంటికి రా. నీ పెళ్లి చేస్తా’ అనటం పరిపాటి. దేవుని దృష్టిలో విలువైన వ్యవస్థ మనుషులలో చాలా తేలికగా అయింది. ఇది చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఘనమైన విషయం ఎందుకు ఘనహీనంగా అవుతోంది? ఇది వాస్తవానికి దేవుడు చేసిన కార్యము. కనుక పెళ్లి దినము నుండి ఒకరినొకరు గౌరవించుకుంటూ హెచ్చించుకుంటూ సంసారాన్ని సంతోషంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చేసుకుంటూ ఉండాలి. 70-75 సం.ల వృద్ధ జంట ఎయిర్‌పోర్ట్ చూసి బయటకు మెల్లగా నడుస్తున్న సమయంలో బస్టాప్ దగ్గరకు బస్సు రానే వచ్చింది. ఆయనగారు కాస్త ముందు ముందు నడుస్తూ ‘త్వరగా రావే బుద్ధిలేనిదానా!’ అన్నాడు. వెనుక నుండి ఆమె నడవలేక నడవలేక నడుస్తూ ‘ఆ.. నీకు మహా ఉన్నట్టు?’ అని కొద్దిగా వినపడేట్టే అంది. సుమారు 40 సం.ల సంసార జీవితం తరువాత తెలిసింది ఇద్దరికీ బుద్ధి లేదని.
ప్రేమయైన దేవుడు, ప్రేమగల దేవుడు ప్రేమతో చేసిన కార్యమిది. కాబట్టి సంసార జీవితంలో ముందు దైవ ప్రేమ జనించాలి. దేవుడు జతపరచాడు గనుక దైవ ప్రేమతో ఇక నుండి వారిరువురు ఏక శరీరులు. దైవ ప్రేమ వారిని కలిపింది గనుక ఏకమై జీవించాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. వారివారి individuality వారికి ఉన్నా గానీ ఒక్క శరీరముగానే ఉండాలి. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. వారిరువురు ఏకశరీరమై ఉందురు అని దేవుని వాక్యము తెలియజేస్తోంది. దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. గమనించాలి. స్ర్తిని పురుషుని దేవుడు జతపరచాడు. ఇది దైవ కార్యము. దీనిని ఎవరూ మార్చకూడదు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్ర్తినిగాను పురుషునిగాను సృజించెను. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినపుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్ర్తినిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తెచ్చెను. దేవుడు హవ్వను స్వయముగా ఆదాము నొద్దకు తెచ్చాడు. ఇది దైవ కార్యము. వివాహమనేది దైవ సంకల్పము కనుక పవిత్రముగా జాగ్రత్తగా గౌరవముతో జీవించాలి.
వివాహానికి ముందు ‘ప్రేమ’ పొంగుతుంటుంది. వాటిని ఎవరూ ఆపలేరు. నీవు లేకపోతే నేను లేను. నువ్వు కనపడకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఎనె్నన్నో జన్మల బంధం మనది. ఆకలి లుండదు. దాహమవ్వదు. నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు నాతో ఉంటే ఏదైనా చేయగలను. నీవు ఏది అడిగితే అది ఇస్తా. ఎంత అడిగితే అంత ఇస్తా. నీ కోసం ఏమైనా చేస్తా. చివరకు ప్రాణాలైనా ఇస్తానంటూ తెగ మాట్లాడుకుంటారు. ఫోన్లు, మెసేజ్‌లు, వాట్సప్‌లూ చేస్తూ టైమ్ తెలియదు. పనులు ఉండవు. నిద్ర ఉండదు. తల్లిదండ్రుల మాటలు వినపడవు. వినపడినా లెక్కలోనికి రావు.
ఒక సంగతి గమనించాలి. తల్లిదండ్రులతో ఉన్నప్పుడు వారిని సన్మానించాలి. పరిచర్యలు చేయాలి. వారితో మాట్లాడుతూ వారి మాటలను పట్టించుకోవాలి. కానీ అదేంటో ఇక్కడున్నప్పుడు వీళ్ల మాటలు వినరు. పట్టించుకోరు. ఫ్రెండ్ దగ్గర నుండి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. తల్లిదండ్రులకు కోపం పుట్టిస్తుంటారు. బాధ కలుగజేస్తారు. సరే అని పెళ్లి చేస్తే అప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. మమీ నిన్ను చూడాలి. డాడీ నిన్ను చూడాలి అని ఒకటే ఫోన్లు. అక్కడ వారు కోపపడుతుంటారు. అందుకే తల్లిదండ్రులతో ఉన్నప్పుడు వారి మాటలు వినాలి. వారిని సంతోషపెట్టాలి. వివాహమైన తర్వాత నీవెక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉండాలి. అలాగని తల్లిదండ్రులను వదలమని కాదు సుమా!
"Marriage is honourable'. Thw word honor means high value something to appriciate, cherish and recognize it as a priceless treasure. For where your treasure is. There your heart will be also. honor is primarily a matter of the heart.
వివాహ విషయము వివాహానికి ముందు ఉన్న ఘనత వివాహమునకు తరువాత ఉండటం లేదు. వివాహ వ్యవస్థను స్థాపించింది దేవాది దేవుడు.
God the father honored it by designing instituting regulating and witnessing the first marriage. God defines its nature, its parties and its terms.

క్రీస్తు వివాహ వ్యవస్థను గౌరవించి, మొదటి అద్భుతముగా కానా వివాహ విందులో కొదువను తీర్చాడు. ఆయన మన కుటుంబములో ఉంటే ఎటువంటి కొదువ ఉండదు. అన్ని విషయాలలో చాలిన దేవుడు. తృప్తినిచ్చే దేవుడు. కాపాడి భద్రపరిచే దేవుడు.
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును - హెబ్రీ 13:4.
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. -ప్రకటన 21:8.
ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో వివాహ విషయాన్ని ఐదవ అధ్యాయము నాల్గవ వచనములో వ్రాశాడు. ముందు మూడు వచనాలు చూసినట్లయితే సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయాలి. ఆతిథ్యము చేయుట మరువకూడదని వ్రాశాడు. భార్య తరఫు వారైనా భర్త తరఫు వారైనా వచ్చినప్పుడు ఆతిథ్యాన్ని మరువకూడదు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే గనుక దేవదూతలు మనకు తెలియకుండానే రావచ్చు. దేవదూతలకు అతిథ్యమిచ్చే గొప్ప అవకాశాలు వస్తుంటాయి కనుక సహోదరుల ప్రేమలు మరువకూడదు. ప్రేమతో ఆహ్వానించాలి. ప్రేమ లేకుండా ఎంత చేసినా ఏది చేసినా వ్యర్థమే. దేవదూతలు గొప్పగొప్ప వాళ్లలాగా రాకపోవచ్చు. మన వాళ్లలోనే పేదలుగా ఉన్న వారి రూపములో రావచ్చు. జాగ్రత్త! నేను ఆకలిగొంటిని మీరు నాకు అన్నము పెట్టితిరి, దాహము గొంటిని దాహమిచ్చితిరి. దిగంబరినైతిని వస్తమ్రులిచ్చారు. రోగినైతిని. చెరసాలలో ఉంటిని. చూడవచ్చితిరని ప్రభువు మెప్పు పొందే వారముగా ఉండాలి.
రెండు మూడు వచనాలలో బంధకములలో ఉన్నవారిని జ్ఞాపకము చేసికోవాలి. కష్టాలలో ఉన్నవారిని జ్ఞాపకము చేసికోవాలని తెలియజేస్తున్నారు.
చాలామంది వివాహమైన తరువాత చాలా సెల్ఫిష్‌గా ఉంటూ, ఇతరులను పట్టించుకోరు. సొంత వారిని కూడా లెక్కచేయకుండా ఉంటున్నారు. నేను నా కుటుంబము అన్నట్టు ఉంటున్నారు.
ఆ తరువాత ఐదు ఆరు వచనాలలో ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండమంటున్నాడు. తృప్తి కలిగి ఉండుట గొప్ప భాగ్యము. తృప్తి లేకపోవటం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. పొరుగు వారితో పోలిక వద్దు. వారి ఇళ్లు కార్లు నగా నట్రా ఆస్తిపాస్తులతో పోటీ పడకు. ధనాశ మొదలౌతోంది ఎలాగైనా సంపాదించాలన్న కోరికతో. భర్తలైతే భార్యలను వేధించి మీ అమ్మావాళ్ల దగ్గరకు వెళ్లి అది తీసుకురా ఇది తీసుకురా అని చితకబాది పుట్టింటికి పంపిస్తున్నారు. అదేంటో గొప్ప ఉద్యోగాలలో గొప్పగొప్ప దేశాలలో ఉన్నవారూ అంతే చేస్తున్నారు. తల్లిదండ్రులను బాధ పెట్టలేక వారికి భారమై ఉండలేక, ఇక్కడ భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని ఎందరినో చూశాము. ఒక హెచ్చరిక! ఆత్మహత్య మహాపాపము. ఇక్కడ ఉన్న సమస్యలకు పరిష్కారమనుకుంటారు కానీ, అది పాపము గనుక నిత్య నరకము అనుభవించాల్సి ఉంటుంది. ఈ లోకములో కష్టాలు కొంతకాలమే ఉంటాయి. సహించువారు ధన్యులు. సహించటానికి శక్తి ఓర్పు దేవుడే ఇస్తాడు. సహింపులో సుఖముంటుంది. వివాహ సమయములో పాడే పాట - దేవరనీ దీవెనలు ధారాళముగను వీరలపై’ మొదటి వచనములో ‘దంపతులు దండిగనీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్ - సొంపుగా నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ‘దేవరనీ’ అని ఉంటుంది.
సహించుకుంటే సుఖముంటుంది. ఓర్పు చాలా అవసరం. మీరు సంపూర్ణులు అనునాయులును ఏ విషయములోను కొదువలేని వారై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అందుకే స్ర్తిలు స్వ పురుషులకు లోబడి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వల్ల మంచి నడవడి వల్ల అవిధేయులైన భర్తలను మార్చవచ్చును. పేతురు తన మొదటి పత్రిక మూడవ అధ్యాయములో వ్రాశాడు. అంతేగానీ మాటకు మాట, దెబ్బకు దెబ్బ వల్ల సంసారము నిలువదు. ఇంకొక సంగతి సామెతల గ్రంథములో సొలోమోను జ్ఞాని వ్రాసిన మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనునని. అయితే ఇది లోక జ్ఞానము కాదు సుమీ. దేవుని జ్ఞానముతో ఇల్లు కట్టుకోగలము.
కొంతమంది భార్యలు ప్రక్కవారితో పోటీలు పడి భర్తలను సాధించేవారు కూడా లేకపోలేదు. ఈ పోటీలలో అంతూపొంతూ ఉండదు. వాళ్లు కారు కొన్నారు. మనకు కావాలి. వాళ్లు ఇల్లు కొన్నారు మనకు కావాలి. నగానట్రా కొనమని రాచి రంపాన పెట్టేవారి వల్ల అప్పుల పాలైన భర్తలు, అడ్డత్రోవ తొక్కే భర్తలు ఎందరో. జాగ్రత్త!! వాక్యము ఏమి చెప్తోందంటే - ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండమని. అవసరాన్ని బట్టి లంచాల కలవాటై చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉన్నదానితో తృప్తిగా ఉంటే, నిన్ను విడువని ఎడబాయని ప్రభువు నీకు తోడుగా ఉండి ఏ కొదువ లేకుండా చేస్తాడు. ప్రభువు మనకు సహాయకుడు గనుక ధైర్యంగా జీవించాలి.
స్ర్తిలారా మీ స్వపురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు అంటే సొంత భర్తలకు లోబడి ఉండాలి. అన్నలను తమ్ముళ్లని అడిగే పనిలేదు. భర్తకు లోబడి ఉండాలి.
పురుషులారా! మీ భార్యను ప్రేమించుడి. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకొన్నట్లు అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినంతగా పురుషులు భార్యలను ప్రేమించాలి. కలిమిలో లేమిలో కష్టములో నష్టములో ఆరోగ్యమున్నా లేకున్నా ప్రాణమున్నంత వరకు ఈ బంధములోనే ఉండాలి. ఇది దేవుడు ఏర్పరచిన బంధము. అంతేకానీ అనారోగ్యములో, లేమి సమయములలో, కష్టాలలో ఒకరిని ఒకరు విడువకూడదు. దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానమిచ్చాడు గనుక ఎటువంటి కష్ట సమయాలొచ్చినా భార్యాభర్తలు విడిపోకూడదు. దేవుడు జతపరచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు.
ఇక్కడ ఇంకొక విషయం - భార్యలు భర్తలకు లోబడుట అంటే ప్రేమించటమే. భర్తలు భార్యలను ప్రేమించటమంటే వారి మాట వినటమే. ఇది ఒక క్రమమే. భర్త, భార్య, పిల్లలు. భార్యాభర్తలిరువురికి చెప్పింది ఒకరినొకరు ప్రేమించమని.
యోహాను 2:6 - ‘మనమాయన ఆజ్ఞల ప్రకారము నడచుటయే ప్రేమ. ప్రేలో నడుచుకోవటమే ఆజ్ఞ.’
దీనినిబట్టి మాట ప్రకారము చేయటమే ప్రేమ.
యోహాను 14:15 - మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే లోబడుట ప్రేమ. ప్రేమించటం చెప్పిన పని చేయటం. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్లు కానే కాదు.
Women a power equal to Man.
(Biblical Archaeology Review 9 (1983) 56-58.
The First Woman was taken out of the first man. Before her creation Eve was already a part of Adam in some way. When Adam looked at his new partner he exclaimed that she was "flesh of my flesh Bone of my bone నా యెముకలలో యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై యుందురు.
ఈ వివాహ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది కదుక, దేవుడు వివాహానికి సంబంధించి పది ఆజ్ఞలలో రెండింటిని వ్రాయించాడు. అంతేకాదు ఒకరినొకరు ఎడబాయకూడదు. Every marriage is ordained by God and every diverse is not.

వివాహాన్ని ప్రార్థనాపూర్వకంగా ఘనపరచాలి. క్రీస్తు కుటుంబ యజమానిగా ఉండాలి. వివాహ వ్యవస్థను ఘనపరచాలి. అదీ జీవితాంతము. దినదినము ఆ ఘనత పెరగాలి. ప్రేమ పెరగాలి తరగకూడదు.
వివాహములో భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. అలాగుననే భార్యకేగానీ భర్తకు తన దేహముపైన ఎటువంటి అధికారము లేదు - 1 కొరింథీ 7:4. Consequently Jesus said when a man and woman joined in marriage they are no longer two but one flesh. One in mind and spirit, in goals, in direction, in emotion and will.
Marriage is a mutual covenant, God ordained obligation between a man and a woman to life long companionship.
Wishing you a lifetime of happiness together and a love that grows stronger with each passing day. ధేవుడు మీకు తోడై యుండును గాక.

- మద్దు పీటర్ 9490651256