ప్రార్థన

గర్భ ఫలము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే’ - కీర్తన 127:3
వివాహ వ్యవస్థలో ప్రభువిచ్చే బహుమానము గర్భఫలము. దేవుడిచ్చే ఈ అమూల్యమైన గర్భఫలమును పొందుకోవటానికి సిద్ధపడాలి. కొందరు భార్యాభర్తలిరువురు కూడా ఇది ఒక సామాన్య చర్యగా తీసుకుంటున్నారు. దేవుడు ఇచ్చే బహుమానము - గర్భఫలము. పరిశుద్ధమైనది. ఎంతో పరిపూర్ణమైనది గనుక ఇష్టమొచ్చినట్లు చేయకూడదు. కొంతమంది ఈ గర్భఫలమును నిరాకరిస్తారు. మాకు వద్దు, మాకు కొంతకాలం ‘స్వేచ్ఛ’ కావాలి. మేం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇప్పుడే మాకు అవసరం లేదని ఏవేవో మందులు వాడి, గర్భము దాల్చరు. కొంతమంది గర్భాన పడిన బిడ్డను అర్థంతరంగా ‘అబార్షన్’ చేయించుకుంటున్నారు. ఇది నరహత్యగానే పరిగణించబడుతుంది. దేవుని దృష్టిలో అది మహాపాపము. కొంతమంది వివాహానికి ముందే తొందరపాటుతో గర్భము దాల్చి, దాచలేక అబార్షన్ చేయించుకుంటున్నారు. మనుషులకు ఆనందం కావాలి. గౌరవం కావాలి. అందరూ మంచివారనుకోవాలి. అయితే ప్రతి విషయానికి దేవుడు సమయాన్ని నిర్దేశించాడు. దేవుని నిర్ణయ సమయానికి వివాహాలు జరిగితే ఎంతో ఆనందముంటుంది. సంతోషముంటుంది. కానీ మనుషులకు ముందు ముందే అన్నీ కావాలి. దేవుడు తల్లిదండ్రులకు ఆ పని అప్పగించాడు. వారికి కూడా ఆ ఆలోచన ఉంటుంది. కానీ తల్లిదండ్రులు పట్టించుకోలేదు కనుక నేను ‘వెయిట్’ చేయాల్సిన పని లేదని యువతరం చ్యిశజష్ఘఆజ్యశ కు అలవాటు పడుతున్నారు. దాని పర్యవసానంగా గర్భం దాలుస్తున్నారు. దాని నుండి అనేక రకాలైన సమస్యలు కనపడుతున్నాయి. తల్లిదండ్రులు ఇష్టపడని సంబంధాలతో అనేకమైన సమస్యలలో పిల్లలు సతమతవౌతూ ఆరోగ్యాలు కూడా పాడుచేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని చేత కట్టబడని ఇల్లు నిలువదు. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థము. దేవుడు మొదటి జంటను ఆశీర్వదించిన విధానము ‘మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడని’ - ఆదికాండము 2:28. పెళ్లి పిల్లలు - అంతా దేవుని ఏర్పాటే. అనాది కాల సంకల్పములోనే ఏ వ్యక్తి ఎక్కడ ఏ కుటుంబములో ఏ దేశములో జన్మించాలో ఎరిగి ఉన్నాడు. వాస్తవానికి మన పుట్టుక అనేది ‘యాక్సిడెంటల్’ కాదు. భూమికి పునాదులు వేయబడక మునుపే, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు.
యిర్మియా ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట - గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నినె్నరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని’ అని. అంటే ప్రతి ఒక్కరినీ ఏదో ఒక ఉద్దేశముతోనే దేవుడు పుట్టించాడు. మనకు కూడా అనేక కోరికలుంటాయి. కుమారుడు కావాలని, కుమార్తెలు కావాలని. వారు ఇలా ఉండాలి అలా ఉండాలి. వాళ్లు డాక్టర్లవ్వాలని, కలెక్టర్లవ్వాలనీ, ఉన్నత స్థితిలో ఉండాలని, మన కష్టాల నుండి కడతేర్చాలని ఇంకా ఎన్నో కోరికలుంటాయి. మనకైతే కోరికలే గానీ, దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రతి ఒక్కరి విషయంలో ఉంటుంది. ప్రజలకు మంచి రాజుగా, విమోచనకారిగా, ఉపకారిగా, మంచి సమరయునిగా, మంచి కాపరిగా, మంచి ఉపదేశిగా, హెచ్చరించేవారినిగా, బోధకునిగా, పంచిపెట్టే వారిగా, మంచిగా విచారణ చేయువానిగా, కరుణించు వానిగా, అపొస్తలులుగా, అద్భుతములు చేయువారిగా, స్వస్థపరచువారిగా ప్రభుత్వములు చేయువారినిగా అనేక రకాలైన ఉద్దేశాలు, సమాజానికి సంఘానికి ఉపయోగపడేటట్లు పుట్టిస్తాడు. అందరూ దేవుని ప్రేమను పొందుకోవాలని, ఎవరూ నశించకూడదని ప్రభువు చిత్తము. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు సహాయపడుతూ అందరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరిక. కనుక ఏ బిడ్డనూ తక్కువగా చూడకూడదు. దేవుని దృష్టిలో స్ర్తి అనీ పురుషుడు అనీ భేదము లేదు. అందరూ సమానులే. ఒకరికి ఒకరు సాటి. కనుక ఆడపిల్లా, మగపిల్లాడు అనేది చూడకూడదు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము గనుక ఆడైనా మగైనా సంతోషంగా, కృతజ్ఞతతో స్వీకరించాలి. వాస్తవానికి మన కోరికైతే మన కుటుంబాన్ని ఉద్ధరించే వాళ్లు కావాలని, కానీ దైవచిత్తము మనకే కాదు ఎందరికో ఉపయోగపడాలని. ఈ రోజుల్లో వైద్య శాస్తమ్రు ఎంతో అభివృద్ధి చెంది, గర్భములో ఉన్న శిశువు మగ, ఆడ అని తెలుసుకోగలుగుతున్నాం. నిర్గమ కాండములో ఫరో ఇశ్రాయేలీయులకు పుట్టిన మగ బిడ్డలందరినీ చంపమని మంత్రసానులకు ఆదేశించాడు. వారు పెరిగి సైన్యముగా మారి, ఎక్కడ ఐగుప్తు దేశముతో యుద్ధము చేస్తారో అన్న భయముతో క్రీస్తు జన్మించినప్పుడు కూడా యూదుల రాజు పుట్టాడు అని తెలిసి ఎక్కడ ఆయన రాజ్యాధికారం పోతుందోనని రెండు సంవత్సరముల లోపు ఉన్న మగబిడ్డలని చంపించాడు.
ఇప్పటి సంగతి - లింగ నిర్ధారణ చేసికొని, ‘అబార్షన్’కు వెళ్లటం వల్ల ముఖ్యంగా ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేస్తున్నారు. అది దేవుని దృష్టిలో పాపము. మన దేశములో కూడా అబార్షన్స్ వ్యతిరేకిస్తూ ఒక చట్టాన్ని రూపొందించారు. ఒకటి లింగ నిర్ధారణ పరీక్ష చేయకూడదని, ఇంకొకటి అబార్షన్ చేయకూడదని.
Two laws that prohibit the sex selection of a fetus in India and the Medical Termination of Pregnency Act, 1971 (MTP) as amended in 2002 and the pre natal Dignostic Techniques (Regulation and precaution of mis use) Act, 1994 (PNDT) as amended in 2008. The former Act prohibit Abortion except only in certain qualified situation which the latter prohibits the sex selection of a fetus with a view towards aborting it.

‘ఎలీసభెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను.’ - లూకా 1:41
దేవుని శక్తిని ఎరిగిన దావీదు నా అంతరీంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతులు నాకు బాగుగా తెలిసియున్నవి. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను - అని కీర్తనలు 139:13-16 వ్రాయబడి యున్నది. అంతేకాదు దేవుని చేతులు ఆయనకు రూపునిచ్చినవని వ్రాసుకున్నాడు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను - కీర్తనలు 117:73. ఇదే సంగతి యోబు గ్రంథము పదవ అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి పనె్నండవ వచనము వరకు ఉన్నది.
నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి యున్నను నీవు నన్ను మ్రింగివేయుచున్నావు. జిగటమన్నుగా నీవు నన్ను నిర్మించితివి. నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము ననుగ్రహించి నా యెడల కృప చూపితివి. నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి - యోబు భక్తుడు దేవునితో మాట్లాడాడు. -యోబు 10:8-12.
నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము. నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించెదను. -యెషయా 44-2.
గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను. నేనే భూమిని పరచినవాడను. - యోబు 44:24.
ఈ వాక్యానుసారముగా దేవుడు ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశముతో ప్రతి ఒక్కరిని సృష్టిస్తున్నాడని అర్థవౌతుంది.
దేవుని ప్రణాళికకు అడ్డుపడి, దేవుడిచ్చు బహుమానాలు వద్దనుకోవటం, అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలనుకోవటం, గర్భస్రావము చేయించుకోవటం పాపము. దేవుని చిత్తాన్ని జరిగించటానికే మనలను ఈ లోకములో సృష్టించాడు. అంతేకానీ మన ఇష్టమొచ్చినట్లు చేయుటకు కాదు. ఆయన చిత్తము కూడా మన ఆనందము కొరకే. మన సంతోషము కొరకే. మన విమోచన కొరకే. ఒక సంగతి ప్రాణమే ఇచ్చిన దేవుడు మన మంచినే కోరుకుంటాడు. గనుక ఆయన చిత్తాన్ని మన జీవితములో జరిగించుటకు ఇష్టపడాలి.
మానోహ దంపతులకు దేవుడు కుమారుని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు, ఆ బిడ్డను ఎలా పెంచాలో తెలియజేయమని ప్రార్థించాడు. నా ప్రభువా! నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను - న్యాయాధిపతులు 13:8-9
ఎంతో మంది భక్తులు ప్రార్థించి బిడ్డలను పొందుకొని వారిని దైవశిక్షణలో పెంచి ఎంతోమందికి ఉపయోగముగా పంపారు. మోషే పెద్దవాడై ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి విడుదల కావించాడు. సమూయేలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులకు సహాయము చేశాడు. న్యాయము కోసం, బంధకాలలో ఉన్నవారిని విడిపించుట కోసం, ప్రేమను పంచటానికి, నీతి నియమాలు అంతరించిపోతున్న దినాలలో వాటిని పెంచటానికి, దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన గర్భఫలములను సంతోషముతో స్వీకరించి దేవుని యందు భయభక్తులతో పెంచి ప్రేమ రాజ్యాన్ని పెంచాలి. బిడ్డలు దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన బహుమానము. దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని దేవుడు కోరుకున్న రీతిలో పెంచాలి. మన ఇష్టమొచ్చినట్లు కాదు. దైవ మార్గములో పెంచాలి. వారికి చిన్ననాటి నుండే దేవుని ప్రేమను పరిశుద్ధతను నీతిని బోధిస్తూ ఉండాలి. ఆయన కట్టడలను నేర్పిస్తూ ఉండాలి. ఈ ‘కన్‌ఫ్యూజ్డ్ వరల్డ్’లో ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అర్థం కావటంలేదు. మంచిదే అనుకొని మొదలుపెడితే చెడు అని తెలుస్తుంది. ఎవరు మంచివారో ఎవరు మోసగాళ్లో తెలియటం లేదు. చూడటానికి అంతా చాలా మంచిగా కనపడుతుంది. ఎంతో కాలము జరిగిన తర్వాత గానీ తెలియటంలేదు మోసపోయామని. దాని కొరకే దేవుని జ్ఞానము మనకు అవసరము. ఇది దేవుని యందు భయభక్తులు గలవారికే ఉంటుంది. యెహోవా యందలి భయభక్తులు నేర్చుకోవాలి. దానికి ప్రతిఫలము మేలుతో అనేక దినాలు బ్రతుకుతారు. చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. -కీర్తనలు 34:11-14.
ఇందుకే బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సొలోమోను రాజు వ్రాశాడు. దేవుడు ఆజ్ఞాపించిన మాటలు బిడ్డలకు నేర్పించాలి. పిల్లలకు వాటిని అభ్యసింపజేసి, పండుకొనునపుడు, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడచునప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. ఈ విషయాల మీదనే ధ్యాస ఉంచాలి. దేవుని మాటలు కన్నుల మధ్య బాసికము వలె ఉండాలి. ఇంటి ద్వార బంధముల మీదను గవునుల మీదను వాటిని వ్రాయవలెను. అప్పుడే వారికి ఎక్కడ నడువకూడదో ఎక్కడ నిలువకూడదో ఎక్కడ కూర్చోకూడదో ఎవరితో ఎలా ఉండాలో ఎవరి స్నేహము చేయవచ్చో అన్నీ తేటగా అర్థవౌతాయి. దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించాలి. అప్పుడే ఆ వాక్యము నీ పాదములకు దీపమును నీ త్రోవకు వెలుగుగా ఉండి ఎటువంటి ప్రమాదము వాటిల్లకుండా కాపాడుతుంది.
యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు అంటే - బాణములలాగా తయారుచేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉన్నవారిని పరిశుద్ధతలో నీతి న్యాయము గలవారిగా తీర్చిదిద్దాలి. వారిని తీర్చిదిద్దిన తరువాత అంబుల పొదిలోనే ఉంచకూడదు. బాణాలను వాడాలి. దేవుని నామ మహిమార్థం సాతానును ఎదిరించటానికి సాతాను పన్నిన పన్నాగాలను ఛేదించటానికి వాడాలి. అంటే ముందు తల్లిదండ్రులైన వారు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన మార్గములో నడవాలి. అప్పుడే పిల్లలు కూడా నీతి మార్గములో నడుస్తారు. నీతి మార్గములో భీతి ఉండదు. పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే చిన్నబిడ్డల వంటి వారుగా అవ్వాలి. అంటే చిన్నబిడ్డల వలె తగ్గింపు మనసు కలిగి ఉండాలి. చిన్నబిడ్డల మాదిరి నమ్మకంగా, వినయంగా ఉన్నట్టు ఉంటేనే మనకు పరలోక రాజ్యములో ప్రవేశముంటుంది. బిడ్డలు కలుగుట వల్ల మరల ఇంట్లో సంతోషము సమాధానము నిర్మలత్వము ప్రేమ నమ్మకము క్రొత్తగా మొదలై అలా కుటుంబమంతా ఉండటానికి దేవుడిచ్చిన ఒక బహుమానమే పిల్లలు. పరలోకపు నమూనా మన మధ్య సంచరించినట్లు ఉంటుంది. మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. -మత్తయి 18:5.
అంటే దేవుడిచ్చే బహుమానాన్ని స్వీకరించటం దేవునిని స్వీకరించినట్లే. గౌరవించినట్లే. యవన కాలములో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. అట్టివారు ధైర్యంగా సాతానును ఎదిరించి నీతి న్యాయములు స్థాపించి దేవునికి మహిమకరముగా ఉంటారు. అట్టి ధన్యత మన కుటుంబాలన్నిటికి కలుగాలని ప్రార్థన. పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయును గాక.

- మద్దు పీటర్ 9490651256