ప్రార్థన

పెద్దలుపెద్దలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడై యుండి, మద్యపానీయం కొట్టువాడును కాక, సాత్వీకుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
తల్లిదండ్రులు మంచి పేరుగలవారై యుండాలని పిల్లల ఆశ. పిల్లల జీవితంలో తండ్రి పెద్ద హీరో. తల్లి హీరోయిన్. పావురం పిల్ల పావురానికి ముద్దు అన్నట్టు, పిల్ల పావురానికి తల్లి కూడా ముద్దే. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులకు ఉన్న ప్రేమకు బద్దులై యుంటారు. అలానే తల్లిదండ్రులు గొప్పవారనవసరం లేదు. వారి ప్రేమే చాలా గొప్ప. పెద్దపెద్ద ఉద్యోగస్తులై ఉండనవసరం లేదు. వాళ్ల చిన్నచిన్న పనులే చాలా గొప్పగా కనపడతాయి. వారి పట్ల నమ్మకం, ప్రేమ, గౌరవం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శం. తల్లిగానీ తండ్రిగానీ దగ్గర ఉండి చేయి పట్టుకుంటే కొండంత బలం ఉన్నట్టు అనుకొని ఏనుగును కూడా లెక్కచేయరు. ఏనుగే కాదు ఏనుగు లాంటిది ఏది వచ్చినా భయముండదు. అధ్యక్షులే కాదు, తల్లిదండ్రులు కూడా కొన్ని విలువలు కలిగి ఉండాలని పిల్లలు కోరుకుంటారు. అందుకే బయటి ప్రపంచంలో ఎలా ఉన్నా పిల్లల ముందు పెద్దవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లలు ఎంతో ప్రియమైన విలువైన బహుమానాలు కనుక, పెద్దలకున్న మలినాలు పిల్లలకు అంటకుండా చూసుకుంటారు. చాలామటుకు పిల్లలను పవిత్రంగానే పెంచాలని ఆశలో ఉంటారు. పిల్లలను ఎలా చూసుకుంటారో ప్రభువు ఒక ఉపమానములో తెలియజేశాడు.
మీతో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మంచి రుూవుల నియ్య నెరిగి యుండగా - అని మత్తయి 7వ అధ్యాయం 9,10,11 వచనాలలో తెలియజేశాడు. అంటే పెద్దవారికి మంచి చెడులు తెలుసు. మంచిగా ఉండాలని, మంచే చేయాలని, చెడు చేయకూడదని కూడా తెలుసు. అసలు సంగతి - మంచిచెడ్డల తెలివినిచ్చే ఫలము యొక్క ఫలమే ఆదాము హవ్వలు తినవద్దన్న ఆ పండును తిన్నారు. ఫలితంగా ఆ తెలివి లోకానికి సంక్రమించింది. అదే కాదు భయము కూడా మొదలైంది కూడా అప్పుడే. అప్పటివరకు వారికి భయము లేదు. సిగ్గు ఎరుగరు. పాపములో మొదటి ఫలము భయము సిగ్గు మొదలయ్యాయి. అంతేకాదు వాటితోపాటు ఎదుటి వారి మీద నెపములు కూడా మొదలై ఒకరి మీద ఒకరు చెప్పటం మొదలైంది. ఇక ఇక్కడ నుండి లోకములో ఎన్ని రకాలైన పాపములు పుట్టుకొచ్చాయో మనకు తెలుసు. కొన్ని రకాల పాపాలకు పేర్లు కూడా పెట్టలేము. అంతగా పెరిగి లోకమంతా పాకిపోయాయి.
దేవుని ముఖము చూడలేనంత సిగ్గు భయము కలిగాయి. ‘నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి యున్నది’ - ఎజ్రా 9:6.
ఇప్పుడు ఇంకొక తరములో ఉన్నాము. సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడకుండా, తప్పు తప్పే కాదు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నానన్నట్టు అయింది. భ్రష్టమైన మనస్సు కలిగి ఉంటున్న సమాజములో ఉంటున్నాము.
నా యందు, అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ, దానిని చేయుటకు నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అని పౌలు భక్తుడు రోమీయులకు వ్రాసిన ఉత్తరములో తెలియజేస్తాడు. - రోమీ.7:18-19.
చేయకూడనిది చేసి, పిల్లల ముందు ముఖం చెల్లక పెద్దలు కొంతమంది కుమిలిపోయే వారున్నారు. పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు ఎంత మంచివారో అంత మంచిగా జీవించాలి. ఆశ ఉంది కానీ చేయలేక పోతున్నాము. ఆదాము నుండి పాపము లోకమంతటికి అలుముకుంది. పాపములో ఉన్నారంటే ఆదాము సంతతి వారే. ఈ పాపానికి విరుగుడు, క్రీస్తు సిలువలో బలియై చెల్లించిన వెల. ఈ శరీరములో పాపమున్నది. దానిని సిలువకు గొట్టి క్రీస్తు లోకాన్ని విమోచించాడు. మొదటి ఆదాము ద్వారా పాపము ఈ లోకాన్ని ఏలుతుంది గనుక, ఆదాము వరుసలో అందరూ పాపులే. అయితే లేఖనముల ప్రకారము క్రీస్తు మనకొరకు సిలువలో బలియై మరణించి తిరిగి లేచాడు గనుక క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడతారు. దీనిని బట్టి క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తులో ఉన్నవారిని పాపాన్ని ద్వేషించి విడిచిపెట్టే శక్తిని కలుగజేస్తుంది గనుక క్రీస్తును వెంబడించేవారు పాపము చేయరు. కనుక క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అట్లని క్రైస్తవులందరికి ఏ శిక్ష ఉండదని కాదు. కేవలము పాపాన్ని ద్వేషించి విడిచిపెట్టిన వారికి మాత్రమే ఎటువంటి శిక్ష ఉండదు. సిలువ శక్తి లేకపోతే పాపాన్ని ద్వేషించలేము. ద్వేషించినా విడిచిపెట్టలేము. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త దేవుని వెంబడించే వారికి శక్తిగా ఉంటుంది. ఎటువంటి శోధననైనా ఎదుర్కొనటానికి శక్తిని ఇస్తుంది. మంచి విటమిన్ వ్యాధి నిరోధక శక్తినిచ్చినట్లు, సిలువను గూర్చిన వార్త శోధనను ఎదిరించే శక్తిని ఇస్తుంది. కనుక క్రీస్తును కలిగిన మనస్సును కలిగి, పరిశుద్ధ జీవితం జీవించటానికి వీలు కలుగుతుంది.
పెద్దలకు పేతురు భక్తుడు ఇస్తున్న హెచ్చరిక. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక పెద్ద మనస్సుతోను, మీ మధ్యనున్న మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు - 1 పేతురు 5:1-4
అయితే ఇక్కడ ఇంకొక సంగతి - నీవెంత పెద్దవైనా ఎంత జ్ఞానమున్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెద్ద పదవి ఉన్నా చిన్నవారి ముందు నీవు చేసే చిన్న తప్పు, అది ఏదైనా సరే, నిన్ను చిన్నవానిగా చేస్తుంది. నీవు ఉందనుకున్న పదవి, హోదా, అంతా నీ ముందున్న చిన్నవాని దగ్గర ఉండదు. ఒక సాధారణమైన వ్యక్తి నిన్ను వాని కంటె తక్కువవానిగా చూస్తాడు. ఒక్కొక్కసారి లెక్కచేయకపోవచ్చు. జాగ్రత్త! అదే చిన్నవాడు సామాన్యుడు చేసే మంచి పనులను బట్టి వాని విలువ పెరిగిపోతుంది. మీలో ఎవడును నరహంతుడుగా గానీ, దొంగగా గానీ దుర్మార్గుడుగా గానీ పరుల జోలికి పోవువాడిగా గానీ బాధ అనుభవింప తగదు. - 1 పేతురు 4:15.
పెద్దరికమును నిలువబెట్టుకొనుట చాలా కష్టము. దేవుని పక్షమున నిలువబడిన వారికి ఎదురొచ్చే శత్రువు బలవంతుడు, మోసకారి కాబట్టి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గానీ ప్రధానులతోను, అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. - ఎఫె.6:12.
చిన్నచిన్న తప్పులు తప్పులే కాదన్నట్టు భ్రమపెట్టి మోసములో పడవేస్తాడు. వాడు ఆశ చూపించేది చిన్న పండులాగానే ఉంటుంది. అదేమీ తప్పు కాదన్నట్టు ఉంటుంది. కానీ మనము కోల్పోయేది ఏదేను తోటను, దేవుని సహవాసము, నిత్య రాజ్యము, నిత్య జీవము. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షల రూపాయలు జీతము తీసుకుంటున్న పెద్దమనుషులు చిన్నచిన్న లంచాలకు అలవాటుపడి చివరకు ఉద్యోగము, పరువు ప్రతిష్ఠలు పోగొట్టుకుంటున్నారు. సాతాను మాయలో పడి మోసపోయి బంగారం లాంటి జీవితాలు, కుటుంబాలు, ఉద్యోగాలు, పదవులు పోగొట్టుకుంటున్నారు.
ఎంత పెద్ద మనుష్యులైనా శరీరాలు బలహీనమే కాబట్టి ఒక్కొక్కసారి క్రమము మరచిపోయి అక్రమాలు చేయవచ్చు. పవిత్రత కోల్పోయి అపవిత్రులవ్వవచ్చు. అందుకే పౌలు రోమీయులకు వ్రాస్తూ మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుమని రోమా పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో వ్రాశాడు. పెద్ద మనుష్యులు నీతికి దాసులుగా ఉంటేనే వారి పెద్దరికానికి విలువ వుంటుంది. లేదు కాదు అని శరీరానుసారముగా జీవిస్తే పెద్దరిక విలువ పోయి చిన్నవారి ముందు, ఇంట్లో పిల్లల ముందు కూడా తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్త!
శరీర క్రియలన్నియు నాలో నశింపచేయుమని ప్రతి దినము ప్రభువును ప్రార్థించాల్సిందే. లేకుంటే ఉదయానికి తెల్లగడ్డం తొంగి చూసినట్టు శరీరాశలు క్రొత్తవి మొలుస్తాయి. ఎందుకంటే ఈ శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నే నెరుగుదునని పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గానీ దానిని చేయుటకు నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అందుకే శరీరానుసారమైన మనస్సు మరణము అని వ్రాశాడు. అయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. సమాధానము లేదంటే, గలిబిలిగా ఉందంటే శరీరానుసారంగా ఉన్నట్టే. శరీరానుసారంగా ఉంటే పెద్దరికపు విలువలు తగ్గుతూ ఉంటాయి. శరీరానుసారమైన మనస్సు ఏదో ఒక విషయములో జారిపోతుంది. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయములో 8వ వచనంలో చెప్పిన మాట - మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము, మనలో సత్యముండదు.
పెద్దలు చూపే మార్గము చాలా కట్టుదిట్టముగా ఉండాలి. అది ఇరుకుగా ఉండాలి. నియమ నిష్ఠలతో ఉండాలి. సొంత ఆలోచనలు కాక ప్రభువు యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ మార్గములో పోవాలి. మనము చేసే ప్రతి పని మన దృష్టికి బాగుగానే కనపడుతుంది. కానీ చివరలో ప్రభువు మనము చేసిన పనులను గుర్తుపట్టకపోతే అంతా వృధా అవుతుంది.
ఆ దినమందు అనేకులు వచ్చి ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. - మత్తయి 7:22,23
పెద్దలు నిందారహితులుగా ఉండాలి. పరిశుద్ధముగా నిజాయితీగా నైతిక విలువలు కలిగి ఉండాలి. ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఎందుకంటే ఆదిలోనే దేవుడు ఒక పురుషునికి ఒకే పత్నిగానే మొదటి వివాహము జరిగించాడు. అయితే మనిషిలో తృప్తి సంతోషము సమాధానము లేక అనేక మంది భార్యలను చేసుకొని చివరకు అంతా వ్యర్థమని, వెయ్యి మంది భార్యలను చేసుకొన్న సొలొమోను రాజు వ్రాశాడు. (వారిలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు). ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చాలామంది వారి పెద్దరికాన్ని పరువును ఇంట్లో బైట సమాజములో కూడా పోగొట్టుకుంటున్నారు. ఎంత జ్ఞానముండి ఏమి లాభము ఎంత తెలిసి ఏమి లాభము, కోరికలను అదుపు చేసుకోలేకపోతే ఉపయోగము లేదు. రాజును నియమించుటలో బాధ్యతలు ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 17వ వచనములో - తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్ర్తిలను వివాహము చేసికొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసికొనకూడదు అని వ్రాశారు. అది దేవుని చిత్తము. నీ ఇంటికి రాజువు నీవే. పెద్దవు నీవే కనుక, హృదయము తొలగిపోకుండా ఉండటానికి, భార్యాబిడ్డలు తల్లిదండ్రులతో సంతోషంగా సమాధానంగా ఉండటానికి, నీకున్న పెద్దరికము పోకుండా ఉండటానికి ఏకపత్నీ పురుషుడవై ఉండాలి. నీ పెద్దరికాన్ని బట్టి, విలువను బట్టి అనేక రకాలైన శోధనలు, ఆకర్షణలు రావచ్చు. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు భక్తుడు 1 కొరింథీ 9:27 లో ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి, దానిని లోబరచుకొనుచున్నానని వ్రాశాడు. అలా లోబరచుకోకపోతే అనేక రకాలైన శోధనలు ఎదుర్కొనవలసి వస్తుంది.
పెద్దలు మితానుభావులై ఉండాలి. ళౄఔ్ఘ్ఘఆళ శ్యఆ ఒళచి జశజూఖళశఆ. స్వస్థ బుధ్ధిగలవాడు (ఒ్యఖశజూ జశ ఆ్దజశరీజశ) గా, మర్యాధస్తులు (్యచి య్యజూ ఇళ్ద్ఘ్పజ్యఖూ)గా ఉంఢాలి. నీతులు చెప్పటము బోధించటము మాత్రమే కాదు వాటిని పాటించాలి. అతిథి ప్రియుడు (్ద్యఒఔజఆ్ఘఇళ) గా ఉండాలి. ఆతిథ్యము చేయ మరువకూడదు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. బోధింప తగినవాడునై యుండాలి. దేవుని మాటలు బోధింపగలవాడై ఉండాలి. మద్యపానీయము కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై యుండాలి.
పెద్దలు ఆత్మపూర్ణులై ఉండాలి కానీ మద్యముతో మత్తులై ఉండకూడదు. అది వెక్కిరింత పాలు చేస్తుంది. కొట్టువాడుగా ఉండకూడదు. అంతేకాదు కిరాయి వాళ్లను వాడి కొట్టించకూడదు. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయింది. జాగ్రత్త! గొయ్యి తీసేవాడే గోతిలో పడతాడు. మొదటికే మోసము రావచ్చు. ఉజూళూఒ ఒ్ద్యఖజూ శ్యఆ ఇళ పజ్యళశఆ. ధనాపేక్ష అసలు ఉండకూడదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి యుండవలెననియు, మనుష్యులందరి యెడల సంపూర్ణమైన సాత్వీకమును కనపరచుచు ఎవనిని దూషింపక, జగడమాడని వారును శాంతులునై యుండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై యుండి దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను - తీతు 3:1-5
లోకానుసారముగా ఇష్టమొచ్చినట్లు జీవించక, క్రీస్తు మాటల ప్రకారము ఆయన అడుగు జాడలలో నడిచి దేవుడిచ్చిన ఈ నూతన జీవితములో సమాధానముగా సంతోషముగా ప్రేమతో జీవించుచు కుటుంబానికి రాజుగా పెద్దగా సమాజానికి సంఘానికి పెద్దగా, దినదినము ఎదుగుచు దేవుడు ఆశించినట్లు ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256