ప్రార్థన

మరణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభము’ - ఫిలిప్పీ 1:21
లోకానికి మరణమంటే బహు భయం. అయితే మరణానికి, మరణాన్ని గెల్చిన, మరణపు ముల్లు విరిచిన క్రీస్తు అన్నా, క్రీస్తును వెంబడించే వారన్నా బహు భయము.
‘మరణము క్రీస్తును బంధించి యుంచుట అసాధ్యము. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను’ - అపొ.2:24. క్రీస్తు జీవాధిపతి గనుక ఆయనను మరణము బంధించలేదు. ప్రాణము పెట్టుటకు తిరిగి దానిని తీసికొనుటకు అధికారముగల దేవుడు, మనలను ప్రేమించి ఇష్టపూర్వకముగా ప్రాణమిచ్చినటువంటి దేవుడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది, తన ప్రాణమును క్రయ ధనముగా మన అందరి కొరకు అర్పించటానికే, దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. యేసు ప్రభువు తాను మన కోసం ఎలా మరణించబోతున్నాడో ముందుగానే తెలియజేశాడు.
అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసెను. అయితే ఆ సంగతి విన్న శిష్యులకు కూడా భయమేసింది. ఎన్నో అద్భుతాలు గొప్పగొప్ప కార్యాలు స్వస్థతలు చూసినప్పటికి, మరణించిన లాజరును, నారుూనను ఒక ఊరిలో విధవరాలి కుమారుని, యారుూరను సమాజ మందిరపు అధికారియైన వాని కుమార్తెను మరణము నుండి లేపిన సంగతి చూసినా భయముతోనే ఉన్నారు. అయితే క్రీస్తు మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత ఆ పునరుత్థాన శక్తిని పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత మాత్రము మరణమంటే భయము పోయింది.
ఈ ప్రాణాన్ని కాపాడుకోవటానికి జనులు అనేక రకాలైన పద్ధతులు కనుగొన్నాడు. వాటి కోసం ఏదైనా చేయటానికి ఎంతైనా ఖర్చు పెట్టటానికి తిప్పలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అనేక రంగాల వారు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ప్రభువు చెప్పిన మాట ‘తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. - మత్తయి 16:25.
ఇక్కడ ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. బైబిల్‌ను తగులబెట్టిన సాధు సుందర్‌సింగ్, ఆత్మహత్య చేసికొని చనిపోవాలనుకుని, ఒక రాత్రి నిజమైన దేవుడు కనపడకపోతే చనిపోవాలనుకొని సిద్ధమైనప్పుడు యేసు ప్రభువు కనబడిన, తరువాత - ప్రభువును వెంబడించి, ప్రభువులాగ జీవిస్తూ అనేక మందికి మృత్యుంజయుడైన యేసు ప్రభువును గూర్చిన సత్య సువార్తను తెలియజేస్తూ ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, నేను కూడా వస్తానని తనతో కూడా వెళ్లిన సువార్తీకుడు ఎదుర్కొన్న సంగతి. వారిరువురు మంచు కొండల్లో పడి టిబెట్ ప్రాంతానికి వెళుతుండగా దారిప్రక్కన పడిపోయిన ఒక మనుషుడు కనపడ్డాడు. అయితే సాధు సుందర్‌సింగ్ గారు తోడుగా సేవకు బయలుదేరి వస్తున్న సువార్తీకునితో, పడిపోయిన ఆ మనుష్యునికి సహాయము చేద్దామని పిలిస్తే, ఆ సువార్తీకుడు ఈ మంచులో మనలను కాపాడుకోవటమే చాలా కష్టమైతే పడిపోయిన ఆయనకు ఏమి సహాయము చేయగలమని చెప్పి వెళ్లిపోయాడు. అయితే సాధు సుందర్‌సింగ్ గారు మాత్రం పడిపోయిన ఆ వ్యక్తిని ఎత్తికొని దగ్గరే ఉన్న గ్రామానికి తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తిని ఎత్తుకొని మోయుట ద్వారా సింగ్‌గారి ఒంట్లో వేడి పుట్టినందువల్ల, సింగ్‌గారు ఆ వ్యక్తి సురక్షితంగా ప్రక్క గ్రామానికి చేరారు గానీ ముందుగా తనను కాపాడుకోవటానికి వెళ్లిన వాడు మాత్రం చనిపోయాడట. ఇలా తన ప్రాణమును రక్షించుకొనగోరిన వాడు దానిని పోగొట్టుకొనును. కానీ జీవాధిపతియైన క్రీస్తు కొరకు దానిని పెట్టువారు దానిని దక్కించుకొనును అను సంగతి ఇక్కడ బాగా అర్థవౌతుంది.
అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో ‘తన ప్రాణం దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును’ అని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. అయితే చాలామంది మాత్రం ప్రాణాన్ని కాపాడుకోవాలని, చలిలో బయటకు వెళ్లరు. ఎండ ఎక్కువ వుందని బయటకు వెళ్లరు. వర్షాలు ఎక్కువగా ఉన్నాయని బయటకు వెళ్లరు. ప్రభువు మాత్రము అన్ని కాలాలలో సేవ చేశాడు. చలికాలములో మన కోసం నరావతారియై పుట్టాడు. వర్షాకాలంలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎండా కాలంలో సిలువ వేయబడ్డాడు. ఆయన దృష్టి అంతా మన రక్షణయే. మన దృష్టి అంతా ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలనే సొంత ఆలోచనలే.
ఎంతో అద్భుతమైన జీవితమిది, ఎంతో విలువైనది, మన ప్రాణము. జీవాధిపతియైన యేసు క్రీస్తులో మనకు నిత్య రక్షణ ఉంటుంది. తన మట్టుకు తాను బ్రతుకగోరిన వారు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. కానీ ప్రభువును నమ్మి అప్పగించుకొని తగ్గింపు కలిగి జీవించే వారిని దేవుడు హెచ్చిస్తాడు. నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పాత నిబంధనలో పితరులు అనేకులు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఎరిగి ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. - హెబ్రీ 11:13 లో అబ్రహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగి తన ఏక కుమారుని అర్పించి, ఉపమాన రీతిగా మరలా పొందెను.
జీవాధిపతి, మృత్యుంజయుడుయైన యేసును కనుగొన్న పౌలు వ్రాసిన మాటలు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే అని. మనలను సృష్టించినది యేసే అని, మన పాపములను కడుగుటకు తన ప్రాణమే ఇచ్చాడని, మన కొరకు ప్రాణమే ఇచ్చిన ప్రభువు, మనకు కావలసినవన్నీ ఎందుకు అనుగ్రహించడు, తప్పక ఆలకించే దేవుడు ఆలోచించే దేవుడు మేలైనదే చేసే దేవుడు. ఆయన మాటలో చూపులో కార్యాలలో మనకు మేలు కలుగుతోంది. మేలైనదానిని చేసే దేవుడు మన విషయములో సమాధానకరమైన ఉద్దేశము కలిగిన ప్రభువు. మనకు తోడు ఉంటానన్న ప్రభువు అని మనకు కూడా తెలుపుతున్నాడు. అందుకే దావీదు వ్రాసుకున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని, గాఢాంధకారము అంటే చీకటి. అంటే మరణమే. అయినను నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును గనుక అని. అందుకే ఆయన కొరకే నేను బ్రతుకుతాను అని పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు వ్రాశాడు. క్రీస్తు వలన క్రీస్తు కొరకు బ్రతికే వారికి అంతా లాభమే. అన్నింటికి మించి నిత్య జీవానికి వారసులవౌతాము.
అయితే ఈ రంగుల, అశాశ్వతమైన లోకానికి ఆకర్షితులై తినుటకే బ్రతికేవారు కొందరు, త్రాగుటకు బ్రతికేవారు మరి కొందరైతే సంపాదన కొరకు కొంతమంది, అధికారము కొరకు కొంతమంది, పదవుల కొరకు కొంతమంది, సంతోషించుటకే కొంతమంది, సెక్స్ కొరకేనన్నట్టు కొంతమంది, బాధల కొరకు కష్టాల కొరకు కొంతమంది జీవిస్తున్నారు. సృష్టికర్తయైన క్రీస్తు కొరకు జీవించేవారికి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకుతూ జీవించేవారికి, సమస్తము అనుగ్రహించే దేవుడు, అంతేకాదు కునుకక నిద్రపోక కాపాడే దేవుడు, ఆయన మనకు కొండ, కోట, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన బలమైన హస్తాలలో ఉన్న మనలను ఏ శక్తీ అపహరించలేదు. మనలను కాపాడటమే కాదు మన కష్టాలన్నీ తీర్చి కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడు కనుకనే, బ్రతుకుట క్రీస్తే అని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేశాడు.
క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చెను. యేసు ప్రభువును ఘోరమైన సిలువకు కొట్టి మరణించిన తరువాత సమాధిలో పెట్టి, సమాధిని పెద్దరాయితో మూయించి కావలి వారిని ఉంచినా, తాను చెప్పినట్లే ఆదివారము తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వెళ్లిన వారు ఖాళీ సమాధిని చూశారు. కాబట్టి మరణము జయించి లేచాడని కనుగొన్నారు. వారికి ప్రభువు ప్రత్యక్షమై ముందుగా వెళ్లిన స్ర్తిలను తన శిష్యులతో తాను లేచిన సంగతి తెలియజేయమని సెలవిచ్చాడు. కాబట్టి మృత్యుంజయుడైన యేసు ప్రభువును చూసే ఆధిక్యత స్ర్తిలకే దక్కింది. అంతేకాదు ఆ సువార్తను శిష్యులకు తెలియజేసే భాగ్యము కూడా వారికే దక్కింది. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. - హెబ్రీ 2:14 (యెషయా 25:8)
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి యున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. -యోహాను 5:24.
వాస్తవానికి భూమి మీద మన గుడారమైన రుూ నివాసము శిథిలమై పోయినను, చేతిపనికాక దేవుని చేత కట్టబడినవియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని దేవుని మాటలను బట్టి మనకు స్పష్టమే. మర్త్యమైన ఈ శరీరము జీవముచేత మ్రింగివేయబడి అమర్త్యతను ధరించుకొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును, ఓ మరణమా! నీ విజయమెక్కడ? ఓ మరణమా; నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్తమ్రే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. శిథిలమై పోయే ఈ శరీరమును విడిచి రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తుతో నిత్య రాజ్యములో ఉండుటకు, క్రీస్తును ఎరిగిన వారందరు ఇష్టపడుతున్నారు. అయినను శరీరములో నిలిచియుండుట అనేకుల రక్షణార్థమైన అవసరము, అందుకే దేహమందున్నను, దేహమును విడిచిపెట్టినను ప్రభువుకు ఇష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
జన్మ పాపము మరణములో వదలిపోయి, క్రీస్తు వరుసలో పునరుత్థానము ద్వారా మహిమ శరీరము పొందుకుంటాము గనుక, ప్రభువును నమ్మినటు వంటి వారు ప్రభువును చేరుకోటానికి తపన కలిగి ఉంటారు. అదే సమయములో తోటివారు సంఘస్థులు, రక్త సంబంధీకుల గురించిన భారమును బట్టి జీవించాలని కూడా ఆశ కలిగి ఉంటారు. క్రీస్తును వెంబడించే వారముగా ఎంతకాలము జీవిస్తే అన్ని ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించవచ్చు. ఒక్కసారి ఈ దేహమును విడిచిన తరువాత ఇక మనకు ఎటువంటి అవకాశము ఉండదు. మరణించిన తరువాత ఎవరికీ ఎటువంటి సువార్తను అందించలేము. జాగ్రత్త! ఈ దేహములో ఉన్నప్పుడే ప్రభువును తెలిసికొంటే ఉపయోగము. మరణించిన తరువాత ఎంత బాధపడినా ప్రభువును అంగీకరించటానికి వీలు ఉండదు. ఆయన రాజ్యములోనికి ప్రవేశించటానికి అసలు కుదరదు. అందుకే ప్రభువు సిలువ మీద కూడా రక్షణ కార్యాన్ని జరిగించి, నీ రాజ్యములో నన్ను చేర్చుకోమని దొంగ చేసిన ప్రార్థన ఆలకించి అప్పుడే చేర్చుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కసారి ఈ దేహాన్ని ప్రాణం విడిచిన తరువాత ఉపయోగము లేదు.
దేవుడు మనకు ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. క్రీస్తును అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చాడు. మనము దేవుని పిల్లలమనబడే ఆధిక్యత తండ్రి ప్రేమ ద్వారా కలిగింది. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము.
ఎందుకు క్రీస్తును నమ్మిన వారికి ఇంత ధైర్యముంటుందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైన బాధయైన హింసయైన కరవైన వస్తహ్రీనతయైన ఉపద్రవమైన ఖడ్గమైన మనలను ఎడబాపునా? మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరమని రూఢిగా నమ్ముచున్నాను.
మరణాన్ని గెలిచి లేచిన యేసు తన రెండవ రాకడలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయును. గనుక మరణము ఇక ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దుఃఖమైనను ఏడ్పైనను శోధనయైనను ఇక ఉండదు. శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ల యందు ఉండును. రాత్రి యక ఎన్నడు ఉండదు. దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. క్రీస్తును నమ్మి ఆయన మాటల ప్రకారము జీవించిన వారికి ఇంత గొప్ప ధన్యత ఉంటుంది గనుక మరణము లాభము అని పౌలు భక్తుడు చాలా వివరముగా వ్రాశాడు. ఆయనకే కాదు నమ్మిన ప్రతి ఒక్కరికి లాభమే. ఈ లోక బాధలు బెదిరింపు కష్టాలు కన్నీళ్ళు శోధనలు ఇరుకు ఇబ్బందులు ఏమీ ఉండవు. సంతోషము సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఎల్లప్పుడు దేవుని రాజ్యములో ఉంటాయి గనుక ఈ దేహమును విడిచిపోవటానికి సిద్ధంగా ఉంటారు. క్రీస్తు కొరకు ఏదైనా చేయటానికి సంసిద్ధులుగా ఉంటారు. క్రీస్తును నమ్మిన మా అమ్మమ్మ తాను చనిపోవటానికి వారము ముందు నేను చూడటానికి వెళ్లినప్పుడు నాతో చెప్పిన చివరి మాటలు హాస్పిటల్‌కు తీసుకెళ్లమనలేదు. డాక్టర్‌ను పిలువమనలేదు. కానీ, ఇప్పటికి వెళ్లిపోయి చనిపోయిన కబురు రాగానే వచ్చి ఖనన కార్యక్రమమంతా నీవే జరిగించు, భయపడవద్దు. బాధపడవద్దు. నేను యేసయ్య దగ్గరకు వెళ్తాను. అక్కడ ముందుగా వెళ్లిన మనవారందరు ఉంటారు అని చాలా ధైర్యంగా అంత బలహీనమైన శరీరముతో బలమైన మాటలతో నన్ను బలపరచింది.
ఈ మధ్య నా స్నేహితుని కుమారుడు కారు ప్రయాణం చేస్తూ, వీళ్లను ఓవర్‌టేక్ చేసిన లారీ ముందుకు వెళ్లి డివైడర్‌ను గుద్దుకొని బాలెన్స్ లేక వెనక్కు వాలి వీళ్ల కారు మీద పడేటప్పుడు ప్రక్కనే ఉన్న తన స్నేహితుని బయటకు నెట్టి తాను మాత్రం అక్కడికి అక్కడే మృతి చెందాడు. కొడుకు చనిపోయిన బాధ ఒక ప్రక్క ఉన్నా, చనిపోతూ ఒకని ప్రాణాన్ని కాపాడిన కుమారునిలో ఉన్న దేవుని ప్రేమ నిస్వార్థతనుబట్టి గర్వంగా ఉన్న ఱ్యూ.్జఇళజూ జఒఒ్ఘ ను బట్టి దేవునికి వందనాలు. క్రీస్తును వెంబడించేవారు చివరి సెకనులో కూడా ఏదో ఒక విధముగా ఇతరులను రక్షించటానికే చూస్తూ ఉంటారు.
తండ్రి కొడుకు కొడుకు స్నేహితుడు కలిసి కాలువ గట్టున వెళ్తూ ఉన్నారు. పిల్లలిద్దరు జారి వడిగా ప్రవహిస్తున్న నీటి కాలువలో పడి కొట్టుకు పోతున్నారు. కుమారుని చూపులు తండ్రి వంక ఆశగా చూస్తున్నాయి. నన్ను కాపాడమన్నట్టు, అయితే తండ్రి మాత్రము కుమారుని స్నేహితుని రక్షించాడు. కారణం కుమారుడు క్రీస్తును అంగీకరించాడు కనుక మరలా కలుసుకోవచ్చు. కుమారుని స్నేహితునికి క్రీస్తును గురించి తెలియదు గనుక ఆయనను రక్షించితే మంచిదని తలంచాడు. అందుకే అలా చేశాడు అని కాపరి చర్చ్‌లో ప్రసంగిస్తుంటే ముందున్న యువకులు అది ఒక కథలా భావించారు. అయితే కాపరి యువకుల సందేహాన్ని తీర్చాడు. ఆ రక్షించబడిన స్నేహితుడను నేనే. రక్షించిన తండ్రి ఇదిగో మీ ప్రక్కన ఉన్న పెద్దమనిషి అని చెప్పినప్పుడు వారికి అర్థమైంది. దేవుని శక్తిని ఎరుగని వారికి ఇవి కథలుగా ఉంటాయి గానీ దేవుని ఎరిగిన వారికి మాత్రం గొప్ప ధైర్యముంటుంది. గనుక, ప్రభువు అడిగితే ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడతారు. అబ్రహాము దేవుని నమ్మి 100 సం.లకు పుట్టిన కుమారుని అర్పించటానికి వెనుకాడలేదు. 2వేల సం.ల క్రితం క్రీస్తు మరణ పునరుత్థానము చూసిన శిష్యులు వారి ఆస్తులు అన్నీ ప్రభువు సేవకిచ్చారు. ప్రాణమిచ్చిన యేసయ్యకు ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడాలి. ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన క్రీస్తును ఎరిగిన వారికి మరణ భయముండదు. అంతేకాదు మరణము లాభమే. క్రీస్తు కొరకు బ్రతికే వారికి మరణము నిత్య జీవాన్నిస్తుంది గనుక లాభము. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలవి. లోకం దృష్టిలో మరణం నష్టంగా ఉంటుంది గానీ దేవుని బిడ్డలకు మరణం లాభం. అలాగని ఆత్మహత్య చేసికోకూడదు. అది మహా పాపము నిత్య నరకము. ఎంతో నష్టం.
పునరుత్థానమును జీవమును నేనే; నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు అని యేసు ప్రభువు చెప్పిన మాటను విశ్వసించి ధైర్యముగా క్రీస్తు కొరకు జీవించి నిత్యరాజ్య వారసులమవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కందరికీ సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256