ప్రార్థన

మన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యెహోవా మన తండ్రి. యేసు ప్రభువు మన అన్న. మోక్ష నగరు మన పుట్టిల్లు. ముఖ్యదూతల్ మన స్నేహితులు. అబ్రహాము దావీదు మొదలైన వరభక్తాగ్రేసరులు మన చుట్టాలు. తనువు బలి పెట్టెను మన యేసన్న. తప్పుల్విడగొట్టెను మన తండ్రి.
ఇది తండ్రి ప్రేమ. ఆయన మనలను సృష్టించడమే కాదు, మనకు తండ్రిగా ఉండి ఆయన రాజ్య వారసులుగా చేసికోవాలని ఆశ కలిగి ఉన్నాడు. నిజమైన తండ్రి గనుక ఎన్ని తప్పులు చేసినా ఎంత విసిగించినా, ఎంత బాధపరచినా విసర్జించినా మరలా మరలా మనలను వెతుకుతూ, వెంబడిస్తూ తన మార్గాన్ని చూయించి ఇంటికి చేర్చాలని, అనేకమైన ప్రయత్నాలు చేయటం మనం చూస్తున్నాము. దేవదూతల ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా మనతో మాట్లాడి ఎలాగైనా సరే నాశనకరమైన మరణకరమైన మార్గము నుండి జీవ మార్గానికి మళ్లించాలని ప్రయత్నం చేసిచేసి చివరకు ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువునే మన మధ్యకు పంపించి యున్నాడు. ఆయన ప్రేమ మారనిది ఆరనిది ఆర్పజాలనిది, తండ్రి ధ్యాస అంతా నిత్యము మన మీదనే. మన బాగు కోసమే. మన మేలు కోసమే ఆలోచిస్తూ, మన శాపాన్ని కొట్టివేసి మనలను రక్షించుకోవాలని ఉంది.
పారిపోయి పడిపోయి తండ్రికి దూరమైన మనలను వెదకి రక్షించడానికి తండ్రి తన ఏకైక కుమారుని పంపించాడు. యేసయ్యకు కూడా తండ్రికి ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఉంది. కాబట్టే మహిమను వదలి ఒక మామూలు మనిషిగా, పడిపోయిన మన కోసం కాదనుకున్న మన కోసం వద్దనుకున్న మన కోసం ప్రాణం పెట్టుటకు సిద్ధపడి వచ్చి యున్నాడు. అప్పటికే మనం ఇష్టమొచ్చిన మార్గాలలో పడిపోయి, ఊబిలో ఉన్నట్టుగా ఎవరి ఊబిలో వారు ఉన్నారు. ఏదో ఒక బానిసత్వం చేస్తున్నాము. ఈ లోకాధికారి, మనలను మభ్యపెట్టి మనకు మనలను, ఇంతగా ప్రేమిస్తున్న తండ్రికి మధ్య వైరము కలుగజేస్తాడు. ఈ లోక మత్తులో ముసుగులో ఉన్న మనము మన దేవుణ్ణి మరచిపోయే స్థితికి వచ్చాము. అసలు దేవుడెవరు అన్నట్టున్నారు. పిల్లలు గనుక మంచి చదువులు చదివించినా, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా తల్లిదండ్రులను మరచిపోయినట్లు. బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు వచ్చాయి. విదేశాలలో స్థిరపడి చక్కని పిల్లలను వివాహాలు చేసుకొని, తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించే స్థితికి వచ్చారు. వారు మాత్రము వారి ఇష్టానుసారముగా ఉన్న ఈ లోక ప్రేమలోనే మునిగి తేలుతున్నా గానీ, తండ్రి ప్రేమ మారలేదు. ఎంతైనా తన ఇష్టముగా చేసుకున్న బిడ్డలము గదా! ఆయనతో ఉండాలని సహవసించాలని కోరికగా ఉన్నాడు.
ఎవరి కిష్టమొచ్చిన మార్గము వారు ఎన్నుకొని తండ్రికి అవిధేయులై దూరముగా అంటే ఆయన మాటలు వినపడనంత దూరము వెళ్లిపోయి ఎవరి కష్టాలలో, ఎవరి బాధలలో వారు బ్రతుకుచున్న సమయములో చీకటి లోకములో ఎటు వెళ్తున్నామో ఏమి చేస్తున్నామో ఎంత పెద్ద గుంటలో పడి పోయామో అని చివరకు ఎంత నష్టము కలిగించి నరకానికి పంపిస్తుందో తెలియక ఉన్నప్పుడు. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గానీ చీకటి దాని గ్రహించటం లేదు. ఇంతగా ప్రేమించటానికి అసలు మనము ఎంతటి వారము. మనకు తెలియకుండానే మన ప్రాణం మనలను విడిచిపోతే, మిగిలేది మనె్న. అలాంటి దుమ్ము ధూళి వంటి వారమైన మనలను ఎంతగానో ప్రేమించి, మనకు మంచి మార్గము చూయించటానికి యేసు క్రీస్తును పంపాడు. మనుష్యుల ధ్యాసను మంటికి మన్నుగా మారే ఈ దీన శరీరాలవైపు త్రిప్పి, తిను త్రాగు సుఖించు అదే జీవితం అన్నట్టుగా సాతానుడు మార్చివేసి, అసలు సృష్టికర్త ఉన్నాడు ఆయన సమస్తము కలుగజేసి అందలి జీవరాసుల నన్నింటిని పోషించుచున్నాడని తెలియకుండా, ఉ్ప్యఖఆజ్యశ అని ఇంకా ఏదో అని భ్రమలోనికి తీసుకువెళ్లాడు. వాస్తవానికి దూరంగా మనిషిని నెట్టివేసి అసత్యంలో, చీకటి వలయాల్లో ఉంచాడు. మనుష్యులను బిజీగా చేసి దేవుని గురించిన ఆలోచన కూడా లేకుండా ఉంచాడు. చదువులు, ఉద్యోగాలు వివాహాలు, ఇళ్లు, వాహనాలు, పిల్లలు, మళ్లీ పిల్లల చదువులు, ఈ వలయములో బిగించి వేసి దేవుణ్ణే కాదు కని పెంచిన తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేనంత పని ఒత్తిడిలో పెట్టాడు. అట్లని ఏమీ లేక సంపాదన కొరకు వెళ్లటం కాదు, నాలుగు తరాలకు తరగని ఆస్తులున్నా ఇంకా ఇంకా సంపాదించాలని, సంపాదించినది కూడా అనుభవించలేనంతగా సంపాదన మీద ఆశ కలిగించాడు. దేవుడు ఏనాటి కీడు ఆనాటికి చాలు, గనుక రేపటి గురించి ఆలోచించకండి అని చెప్తూ వుంటే, సాతానుడు మాత్రం రేపటిని చూయిస్తూ ఈ ప్రస్తుతాన్ని మాత్రం సంతోషంగా బ్రతుకనివ్వటము లేదు. జాగ్రత్త. దేవుని మాట ప్రకారము ప్రస్తుతాన్ని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళితే జీవితము ఎంతో తేలికగా హాయిగా ఆనందంగా సంతోష సమాధానాలతో ఉంటుంది. రేపటి కోసమని దాచుకుంటే దోచుకునే వాళ్ల గురించిన ఆలోచన నిద్రపోనివ్వదు. ఎంత అసమాధానముగా ఉంటుందో గదా? పరమ తండ్రికి మనము జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచే తెలుసు. మన జననం, మరణం కూడా బాగా తెలుసు. ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అంతా తెలుసు. మన గురించి మనకంటే ఎక్కువగా తెలుసు.
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. -ఇర్మియా 29:11.
యెహోవా తండ్రి మన యెడల జరిగించిన క్రియలు ఆశ్చర్యకరమైనటు వంటివి. మన ఊహకు అందవు. అలానే ఆయన మన యెడల కలిగిన తలంపులు బహు విస్తారములు. లెక్కకు మించి ఉంటాయి.
ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటె నా మార్గములు మీ తలంపుల కంటె నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి - యెషయా 55:9.
మన యెడల చక్కని తలంపు కలిగిన తండ్రి గనుక, మనము చేయవలసినందల్లా ఒక్కటే. ఆయన మాటల ప్రకారము ఆయన అడుగు జాడలలో నడవటం. ముందు మనం ఎటు ఉన్నామో తెలుసుకోవాలి. లోకము పట్ల లోకాశలతో ఉన్నట్లయితే మోసములో ఉన్నాము. మోసపోయామని గుర్తెరగాలి. అప్పుడు చీకటి వెలుగుల తేడా తెలుస్తుంది. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుతుంది. ఆ వెలుగు చీకటిలో మగ్గుతున్న మన మధ్యకు వచ్చింది. అయితే ఎంతోమంది త్రోసివేశారు కానీ తన్ను ఎందరంగీకరించిరో వారి కందరికి, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని కుమారులయ్యే అధికారము తండ్రి కల్పించాడు. విశ్వసించటం, విశ్వసించక పోవటం నీ ఇష్టం. దీనిలో ఎటువంటి బలవంతం లేదు. కానీ యేసు ప్రభువు నందు విశ్వాసముంచి ఆయన మాటల ప్రకారము నడచినట్లయితే, పరమందున్న తండ్రికి దేవాది దేవునికి, సృష్టికర్తకు, కుమారులముగా కుమార్తెలముగా అవుతాము. దైవ కుటుంబానికి చెందినవారవౌతాము. అప్పుడు యెహోవా మనకు తండ్రి యేసు ప్రభువు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు మనకు అన్న అవుతాడని, పేతురు యోహాను యాకోబు పౌలు లాంటి అపొస్తలులు మనకు చుట్టాలవుతారని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటగా తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఉంటుందో చూడండి. తాను సొంతముగా ఏమీ లేనివాడైనా ఒక గొప్పింటి అమ్మాయిని వివాహమాడితే ఉన్నట్టు ఉండి ఒకేసారి తన అంతస్తు ఎలా మారిపోయి గొప్పవాడవుతాడో, అలానే క్రీస్తును నిజ రక్షకునిగా అంగీకరించిన వెంటనే పరలోక రాజ్య పౌరసత్వం లభిస్తుంది. నీతి సత్యం మంచితనము మనలో చోటు చేసుకుంటాయి. ఒకప్పుడు నీతిగా ఉండాలని కోరిక ఉన్నప్పటికీ నీతిగా ఉండలేని బలహీన స్థితి. ఇప్పుడు నీతిగా, నిజాయితీగా ఉండే శక్తి వస్తుంది. సత్యమేంటో తెలుసుకుంటాము గనుక బంధకాలను విడగొట్టుకొని స్వతంత్రముగా జీవించగలము.
యేసు ప్రభువును అంగీకరించిన వారు దేవుని వలన పుట్టినవారే గానీ, రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలననైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు -యోహాను 1:13.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. -రోమీయులకు 8:14.
దేవుని మూలముగా పుట్టిన ప్రతి దానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. - 1 యోహాను 3:9.
ప్రభువును అంగీకరించిన వారు దేవుని కుమారులౌదురు. వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. పాపము చేయజాలడు.
ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. సమస్తము ఆయన మూలమున కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై యుండెను. ఆయనను అంగీకరించిన వారిలో జీవపు వెలుగు ఉంటుంది గనుక పాపము చేయడు. చేయజాలడు.
ఆయనను అంగీకరించటమే కాదు గానీ ఆ పరమ దేవుని కుమారులుగా కొనసాగాలంటే మాత్రము, శత్రువులను ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి గనుక ప్రేమను మనలో చేర్చుకుంటే మనలో ఇక ద్వేషముండదు. 0% ద్వేషముంటుంది. 100% ప్రేమతో నింపబడి ఉంటాము గనుక శత్రువులను కూడా ప్రేమించ గలుగుతాము. అంతేకాదు హింసించు వారి కొరకు ప్రార్థన చేయగలము, వారిని ద్వేషించము, కోపగించుకొనము గానీ వారి కొరకు, ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు సిలువ వేసిన వారి కొరకు ప్రార్థించినట్లు మనము కూడా ప్రార్థించగలము.
ఇలా ప్రార్థన చేయుట, శత్రువులను ప్రేమించుట చేతగానితనమని, బలహీనత అని లోకము హేళన చేయవచ్చు గానీ, దేవుని పునరుత్థాన బలము నిండుగా ఉన్నవారే అలా చేయగలరు. దేవుడిచ్చే మహా బలముతోనే అవి ఓర్చుకోగలము. కష్టమైనా ఇష్టముగానే ప్రేమించగలము. ప్రార్థించగలము. సమాధానముగా ఉండి, సమాధానపరచగలము. అందుకే కొండ మీద ప్రసంగములో ప్రభువు ధన్యతలలో చెప్పిన మాట, సమాధానపరచువారు దేవుని కుమారులనబడుదురని.
.జ్దీక ఒ్ద్ఘ ఔళ్ఘషళ ఘౄఠీళూఒ ఇళ ష్ఘళజూ ఆ్దళ ష్దజజూళశ యచి ద్యిజూ?
. ఱళష్ఘఖఒళ ద్యిజూ జఒ ద్యిజూ యచి -ళ్ఘషళ.
యేసు: వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా-
మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి. (వారికి భయపడి మంచి చేసుకోవటానికి కాదు, అది బలహీనత అవుతుంది) నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. (దైవభక్తితో నింపబడినవారే అలా చేయగలరు) నీపై బట్ట ఎత్తికొని పోవు వారిని, నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపవద్దు. నిన్నడుగు ప్రతివానికిమ్ము. (క ఘశజూ ఒళళ. గళ్ఘ ఒ్యఖూషళ జఒ ద్యిజూ ఆ్దళ చ్ఘిఆ్దళూ. హళ తీజ య యశ ఛిజ క్యఖూ త్ఘీళఆ) నీ సొత్తు ఎత్తికొని పోవు వాని వద్ద దాని మీరు అడగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. (ఇతరులు మనలను గౌరవించాలని, సహాయముగా ఉండాలని, మనం చెప్పినట్లు వినాలని మనం చెప్పింది చేయాలని, మనతోనే ఉండాలని, ప్రేమగా మాట్లాడాలని, ఇంకా ఏవేవో అనుకుంటాము. అయితే ప్రభువు, వారికి ముందు ఆలాగు చేయుమని కోరుచున్నాడు.) మిమ్మును ప్రేమించే వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినదంతా మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చెందక మీ శత్రువులను ప్రేమించుడి. మేలు చేయుడి. అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును. మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. -లూకా 6:27-35. ఆయన కృతజ్ఞత లేనివారి యెడలను దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్లు మీరునూ కనికరము గల వారై యుండుడి - లూకా 6:36.
మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా! ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని యెరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనుము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. (ఆజ్ఞను అతిక్రమిస్తున్నామంటే దేవుని మాటను నిర్లక్ష్యము చేయుటమే. అంటే దేవుని నిర్లక్ష్యము చేయుటే) పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును. ఆయన యందు పాపమేమియు లేదు. (మన పిల్లలు పాపము చేయకూడదని ఎలా అనుకుంటామో.. సిగరెట్లు తాగకూడదు. సారాయి తాగకూడదు. వ్యభిచారము దొంగతనము చేయకూడదు. అబద్ధమాడకూడదు. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. చెడు చూడకూడదు. చెడు వినకూడదు. చెడు మాట్లాడకూడదు అని మనమెలా ఆశిస్తామో అలాగే ప్రభువు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక సంగతి గమనించాలి. మనము పాపము చేస్తూ ఉంటూ మన పిల్లలు మాత్రము పాపము చేయకపోతే బాగుండని ఆలోచించి ఎన్నో బుద్ధి మాటలు చెప్తాము. కానీ ప్రభువులో పాపము లేదు. చేయలేదు. ఆయన రాజ్యములో ప్రేమ మాత్రమే ఉంటుంది. పాపానికి తావు లేదు గనుక మనలను పైన వివరించినవన్నీ ఎలా చేయాలో ఎలా ఉండాలో చాలా స్పష్టముగా వివరించాడు.) ఆయన యందు నిలిచి యుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు. చిన్నపిల్లలారా యెవరు మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. -1 యోహాను 3:1-7.
అసలు సంగతి ఇక్కడ నుండి చూద్దాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. (ఆయనను అనుసరించే మనము కూడా అలాగే అపవాది క్రియలను లయపరచాలి) దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.
దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కాడు. దేవుని కుమారులము కాకపోయిన పర్వాలేదు గానీ, దేవుని రాజ్యములో స్థలముండకపోయినా పర్వాలేదు కానీ, సహోదరుని మాత్రము ప్రేమించను అనే రీతిలో ఉన్నావేమో జాగ్రత్త. దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత ఆయన కుమారులముగా ఉండుట, దానిని దయచేసి పోగొట్టుకోవద్దు. దానివల్ల ఈ లోకములో శాంతి సమాధానముండదు, నరకపాత్రులై నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. ద్వేషం ఎదుటి వారినే కాదు చివరకు మనలను కూడా చంపే పెద్ద రోగం. జాగ్రత్త. అయితే సహోదరులను ప్రేమించువారు మరణము నుండి జీవమునకు దాటినట్లే. ప్రేమ లేకపోతే ఇంకా చీకటిలో ఉన్నట్టే.
అయితే ఇంకో మోసపు తండ్రి కూడా ఉన్నాడు. వాడే అపవాది - దురాశలు పుట్టిస్తాడు. హత్యలు చేయిస్తాడు. అసలు అబద్ధాలకు జనకుడు గనుక అబద్ధాల ఆట ఆడిస్తుంటాడు. దీనిలో చిన్నవారని లేదు పెద్దవారని లేదు. ఉపయోగము లేకపోయినా అందరూ అబద్ధాల ఆటలో పాల్గొని ఆడుచున్నారు. ఈ ఆటలో పాల్గొంటే అపవాది సంబంధులై, ఆ కుటుంబములో చేరి, దైవ కుటుంబములో నుండి పడిపోతారు.
మనలను దేవాది దేవునికి బిడ్డలుగా చేసి, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికే యేసు ప్రభువు నరావతారుడై దాసుని రూపము ధరించుకొని సిలువలో తన రక్తాన్ని ధారపోసి చివరకు ప్రాణాలు కూడా అర్పించాడు. ప్రభువు చేసిన ఈ త్యాగాన్ని వృథాగా పోనియ్యవద్దు. దేవాది దేవుని కుటుంబములో చేరి కుమారులము కుమార్తెలముగా క్రీస్తులో జీవిస్తూ, పరమ తండ్రికి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తూ లోకమంతటిని దైవ కుటుంబములో చేర్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక. దేవుడు లోకమును ఇంకా ప్రేమించుచూనే ఉన్నాడు.

- మద్దు పీటర్ 9490651256