ప్రార్థన

మీరు లోకమునకు వెలుగై యున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు లోకమనకు వెలుగై యున్నారు. కొండ మీద పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది ఇంటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు
- మత్తయి 5:14-15
మీరొకని నొకరు ప్రేమించవలెను. ఇదే యేసు ప్రభువు ఆజ్ఞ. ‘అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప దాని యావేశము తొలగింప వందితుండు క్రీస్తేసు నాతుడు వచ్చె ప్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు. కాన నంధకారంబు తొలగ ప్రకాశించెను లెండు. మీరు ప్రకాశింపను రండి. మానవుల సంతోషపర్చనై - మహిని అవతరించె భక్తుల మనము సంతసించె. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను - లోకమున చూపింపగవలెను. చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము. వేగము చూపుదమా పథము’.
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి. ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములై మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది.
దేవుడు వెలుగై యున్నాడు. పాపములో పడిన మనిషి వెలుగును కోల్పోయి చీకటిలో నడుచుచున్నాడు.
డజశశళూఒ ఘూళ శ్యఆ యశక జశ ఒఔజూజఆఖ్ఘ జ్ఘూరీశళఒఒ, ఆ్దళక ఘూళ జ్ఘూరీశళఒఒ ఒజౄజ్ఘూక ఇళజళ్పళూఒ ఘూళ శ్యఆ యశక జశ జదఆ. నిశ ళ్దూజఒఆ ఆ్దళక ఘూళ జదఆ.
ఫాపపు చీకటిలో జీవిస్తూ అదే జీవితం అనుకొంటూ నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యున్నారు. ఎటు చూసినా చీకటి క్రియలు, ఏ వార్త విన్నా సంతోషము లేదు. ఎక్కువగా మరణ వార్తలే ఉంటున్నాయి. మోసమే కనబడుతోంది. ద్వేషం స్వార్థమే కనపడుతోంది. కరువు కాటకాలు, హత్యలు, గొడవలు, కొట్లాటలు, అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుడు, జూదము, వ్యభిచారము, క్రీస్తుకు పూర్వమే ఈ చీకటి కార్యాలు లోకమంత వ్యాపించి ఉన్నాయి. యెషయా ప్రవక్త ద్వారా చీకటిలో నడుచుచున్న వారు గొప్ప వెలుగు చూస్తారని మరణచ్ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని దేవుడు ప్రవచనమిచ్చాడు. - యెషయా 9:2
ఈ ప్రవచనం తరువాత 700 సంవత్సరములకు యూదా దేశపు బెత్లెహేములో నీతి సూర్యుడు ఉదయించాడు. ఉదయించిన ఆ వెలుగు లోకములో ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అందరిని వెలిగించి చీకటి బంధకాల నుండి విడిపించి మరణము నుండి తప్పించాలని ప్రభువు కోరిక. దేవునికి పక్షపాతము లేదు. ప్రతి ఒక్కరు నిత్య జీవము పొందుకోవాలని ఆయన ఆశ. లోకములో ఏ ఒక్కరు, నశించకూడదని దేవుని ఉద్దేశం. కారణం అందరు ఆయన బిడ్డలే.
వెలుగు లోకములోనికి వచ్చెను కాని చీకటి దాని గ్రహించలేక పోతున్నది. రెండువేల సంవత్సరాల నుండి వెలుగుచున్నప్పటికీ ఇప్పటికీ గ్రహించలేక అంధకారమే వెలుగు అన్నట్టు జీవించుచున్నారు.
అయితే వెలిగించబడిన నీ సంగతేమిటి? కుంచము క్రింద ఉంచావా? లేక కొండ మీద పట్టణము వలె వెలుగొందుచున్నావా? మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
సత్క్రియలు అంటే మంచి మాటలు మంచి ఉద్దేశాలే కాదు మంచి పనులు కూడా. క్రియలు లేని మంచి మాటలు ఉద్దేశాలు ఉపయోగము లేదు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి. చలి కాచుకొనుడి. తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము?
బీదల కిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసికొను వారికి బహు శాపములు కలుగును. - సామెతలు 28:27.
బీదల కిచ్చుట తరువాత సంగతి కాని వారిని గిచ్చుట ఎక్కువైంది. బీదల పేరిట అనేక కార్యక్రమాలుంటున్నాయి కాని వారి కందేది చాలా తక్కువే. వారి పేరు మీద అనేక మంది లబ్ధి పొందుతున్నారు. జాగ్రత్త!!
సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైన దొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును.- ప్రసంగి 5:13.
ధనికుడైన యవనస్తుడు ఎంతో మంచివాడు. పది ఆజ్ఞలు పాటిస్తున్నాడు. వెలిగించబడ్డాడు గాని బుట్ట క్రింద దాచిపెట్టిన వెలుతురు వలె తనకు తానే ఆనందిస్తున్నాడు. ప్రభువు అతనికి చెప్పిన మాట బీదలకు నీ ఆస్తి అంతా ఇచ్చి నన్ను వెంబడించమని చెప్తే, అది నచ్చలేదు. సత్క్రియ చేయుటకు ఇష్టపడలేదు. కొండ మీద కెక్కటానికి ఇష్టపడలేదు. కుంచము క్రింద ఉండటానికే ఇష్టపడి దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇదీ ఒక విధమైన అంధత్వమే. దేవుని ఐశ్వర్యాన్ని తెలుసుకోలేక పోవడం, చూడలేక పోవటం కూడా గ్రుడ్డితనమే. బీదల పేరుతో బ్రతుకుట గాదు. వారికి చేయగలిగినది చేయాలి. అప్పుడు లేమి కలుగదు. అది ఆరోగ్యమైన ఆనందమైన సంతోష సమాధానమైనది. ఎంత ఉన్నా ఏమి ఉన్నా దేవుడిచ్చే సమాధానము సంతోషము లేదు, దానిని ఈ లోకములో ఏదీ ఇవ్వలేదు.
బీదలను కటాక్షించువాడు ధన్యుడు.
1.ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
2.యెహోవా వానిని కాపాడి బ్రతికించును.
3.్భమి మీద వాడు ధన్యుడగును.
4.వాని శత్రువుల ఇచ్ఛకు వానిని అప్పగించడు.
5.రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. (నర్స్)
6.రోగము కలిగినప్పుడు స్వస్థపరచును (డాక్టర్)
ప్రభువు వెలుగులోనికి వచ్చిన జక్కయ్య చేసిన పని ముందు అన్యాయముగా ఎవరెవరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేశాడో వారికి నాలుగింతలు ఇచ్చాడు. మిగిలిన ఆస్తిలో సగభాగము పేదలకిచ్చాడు. దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమను తెచ్చాడు. దేవుని తెలిసిన వారు అలా ప్రతి విషయాన్ని సెటిల్ చేసుకోవాలి. లేకుంటే మన ద్వారా అన్యాయము కలిగిన వారందరు దేవుని నామాన్ని దూషించే అవకాశముంది. దేవుని చేత వెలిగించబడిన వారు, అంటే దేవుని మేలు పొందిన వారు ఇతరులకు మేలుకరముగా ఉండాలి. దేవుని ప్రేమను పొందుకున్న మనం తోటివారిని ప్రేమించాలి.
నిజమైన వెలుగు లోకమంతటిని ప్రేమించి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మొదట ప్రభువే వెలిగించాడు, ఇప్పుడు వెలిగించబడిన వారు ఇతరులను వెలిగించమని ఆజ్ఞ ఇచ్చి యున్నాడు. మీరు ఒకనినొకడు (వెలిగించుడి) ప్రేమించుడి. దేవుడు మన యెడల చూపిన ప్రేమను మనము తోటివారి యెడల చూపాలి. దేవుడు వెలిగించిన మనము దివిటీల వలె ఇతరులను వెలిగించుచూ ఉండాలి.
నిన్ను వెలిగించింది నీ మట్టుకు నీవు దాచుకోవటానికి కాదు. నీవు లోకానికి వెలుగుగా ఉండాలని. రెండువేల సంవత్సరాల క్రితం మొదటిగా శిష్యులు వెలిగించబడ్డారు. వారు దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమను లోకమంతా నింపటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లారు. మన దేశానికి ఈ ప్రేమ వెలుగును తెచ్చినవాడు సెయింట్ థామస్. ఆయనకు ‘డౌటింగ్ థామస్’ అని కూడా పేరు. ఎందుకంటే క్రీస్తు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డ తరువాత, ఆయన ముందుగానే చెప్పినట్లు మూడవ దినమున తిరిగి లేచాడు. ముందుగా శిష్యులకు కనపడ్డాడు. అయితే ఆ సమయములో తోమా వారితో లేడు. వారు యేసు తిరిగి లేచాడు వారిని దర్శించాడు అని చెప్పిన మాటను నమ్మక, ఆయన చేతి గాయములలో వ్రేలుపెట్టి చూచితేనే గాని నమ్మను అనినటువంటి వాడు. తరువాత మరల ప్రభువు వారికి ప్రత్యక్షమైనప్పుడు అది నిజమేనని నమ్మి, మన దేశానికి ఆ వార్తను, ఆ ప్రేమ వార్తను తీసుకొని వచ్చాడు. ఒక సంగతి - ఆ రోజుల్లో విమానాలు లేవు. ఫోన్లు లేవు. సరైన కమ్యూనికేషన్స్ లేవు. పవర్ లేదు. అయినా దేవుని ప్రేమ వెలుగును వెలిగించాడు. ఈ సంగతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో అమెరికా దేశ పర్యటనలో వెల్లడించింది. మా దేశానికి ప్రేమ వెలుగు మొదటి శతాబ్దంలోనే వచ్చిందని, అయితే ఆ వెలుగును కుంచము క్రిందనే పెట్టి బయటకు రానివ్వలేదు. ఆ తరువాత అనేక మిషనరీలు వచ్చి ఆయా ప్రాంతాలలో ప్రేమ వెలుగును వెలిగించారు.
వారిలో ఒకరు ఫాదర్ హయ్యర్ క్రిస్టియన్ ఫెడ్రిన్‌గారు. జర్మనీ దేశం నుండి మన దేశానికి 1842లో వచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ దినాలలో మలేరియా జ్వరాలతో మనుష్యులు చనిపోతున్నారు గనుక వేరే దేశానికి వెళ్లమని ఆయనకు సలహా ఇచ్చారు. అసలు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అయినా ఫర్వాలేదు అని ఆయన ప్రాణాలకు తెగించి దేశంకాని దేశానికి వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఆసుపత్రులు కట్టించారు, అజ్ఞాన అంధకారములో ఉన్నవారి కోసం స్కూళ్లు, కాలేజీలు కట్టించి విద్యను ఇచ్చారు. చీకటిలో ఎటు వెళ్తున్నారో ఏమి చేస్తున్నారో తెలియని అజ్ఞానాంధకారములో ఉన్న జనులకు వెలుగునిచ్చారు. భయముతో బ్రతుకుచున్న వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి జీవితాలే వారికి బరువై బ్రతుకుచున్న వారిని, ఇతరులకు కూడా ఉపయోగపడే వారిలా చేశాడు. ఆయన ఒక్కని త్యాగము వలన లక్షల మంది వెలిగించబడ్డారు. వెలిగించబడిన వారందరు లోకానికి వెలుగుగా ఉండమని ప్రభువు ఆజ్ఞ. కానీ ఒక స్థితికి వచ్చిన వారు పూర్వపు స్థితిని మరచి, వారి దీపాన్ని కుంచము క్రిందనే ఉంచుచున్నారు. జాగ్రత్త! మీరు లోకానికి ఉప్పై ఉండాలి. ఉప్పు నిస్సారమైతే దానిని బైట పారవేస్తారట. అలాగే వెలుగు కాంతి నివ్వకుండా సత్క్రియలు లేకుండా ఉంటే ఉపయోగము లేదు. వెలుగు దాని కాంతినివ్వకపోతే చీకటితో సమానమే. ఉపయోగముండదు.
పనికిమాలిన వారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును గదా అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన యెడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు సిద్ధపడి యుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటె అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. - యోబు 11:11-17.
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. - దానియేలు 12:3.
అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులు అగుదురు. వారు లోకమంత ప్రకాశించిన నిర్మలులుగానే ఉందురు. దేవుని ప్రేమను పొంది, వెలిగింపబడి అనేక కష్టాలను నష్టాలను ఓర్చి దేవుని ప్రేమను వెదజల్లిన వారు అనేకులున్నారు. వారే మనకు మార్గదర్శులు. మదర్ థెరిసా, ఫాదర్ హయ్యర్, సెయింట్ థామస్, సెయింట్ బర్తొలొమియా. దేవుని అపారమైన ప్రేమ వెలుగుతో నింపబడిన వారు ఆ వెలుగును దాచుకోలేరు. దానిని ఏలాగైనా అందరికీ అందించాలని ప్రయాసపడుతూనే ఉంటారు. విలియమ్ కేరీ (1793 - 1834) మనము ఒక సంగతి గమనించాలి. వారు దేశము కాని దేశము వచ్చి మన మధ్య నివసించి విద్య వైద్య బుద్ధులు నేర్పి, ఎన్నో సంస్కరణలకు సహాయపడి, వారి ధనాన్ని, సమయాన్ని, జీవితాన్ని, ప్రాణాలను వెచ్చించారు. వెలుగును పంచిన వారంతా ప్రాణాలు పెట్టారు. ఎందుకో తెలియదు. వారిని హింసించి చంపారు. వారి జీవితాలను కరిగించారు.
ఎంతో త్యాగంతో వెలిగింపబడిన నీవు వెలుగై యున్న నీవు ఏదో ఒక తప్పు చేసి నీ వెలుగును కోల్పోవద్దు. వెలిగించబడిన నీవు అనేకులకు వెలుగుగా ఉండాలి. ఆత్మను ఆర్పకూడదు. వెలుగు సంబంధులు చీకటి సంబంధమైన వారి వలె మత్తులమై ఉండక, పగటి వారివలె విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ యను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు.
నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును.
అది తెలివిలేని వారికి తెలివి కలిగించును. - కీర్తనలు 119:130.
(శిష్యులు) మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా - దేవుడు వెలుగై యున్నాడు. ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన యెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. అంటే వెలుగుతూ ఉండటమంటే ప్రేమ కలిగి ఉండటమే. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేమియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును గనుక తానెక్కడికి పోవుచున్నాడో తనకు తెలియదు. ఎంతో ఘోర పాపములో కొట్టుకొని పోతున్న మనలను యేసు ప్రేమించాడు, ఇప్పుడు మనలను అదే ప్రేమతో తోటివారిని ప్రేమించమంటున్నాడు. దేవుడిచ్చిన ప్రేమను దాచిపెట్టకూడదు. దానిని దీపస్తంభము మీదనే పెట్టాలి. అది ఇంటి వారందరికి వెలుగునివ్వాలి. కొండ మీద నుండు పట్టణము వలె ఎలా మీ వెలుగు లోకమంతా ప్రసరించాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి పిలిచిన ప్రేమ వెలుగు ప్రచురము చేయుచు ఉండాలి. ప్రభువు ఎటువంటి చీకటి నుండి ఆశ్చర్యకరంగా మనలను తన అద్భుతమైన వెలుగులోనికి పిలిచాడో, ఆయన నామ మహిమార్థం ప్రేమతో సత్కార్యములను జరిగించుచు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను అభిషేకించాలని ప్రార్థన.
నీకు వెలుగు వచ్చి యున్నది లెమ్ము తేజరిల్లుము.