ప్రార్థన

యేసు నామము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను.
ముత్తయి 2:21
అని ప్రభువు దూత స్వప్నమందు యోసెపునకు తెలియజేసెను. ఆ ప్రకారమే మరియు తన తొలి చూలు కుమారుని గని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
పొలములో గొఱ్ఱల కాపరులు మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారికి ఈ శుభవార్త తెలిపెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తని. వెంటనే వారు వెళ్లి మరియను యోసేపును తొట్టెలో పండుకొనియున్న శిశువుగా చూచిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. తరువాత వారు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి.
ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినపుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాత నిబంధన కాలమంతటిలో ప్రభువు నామము భయాలు పరచబడలేదు గాని మనలను కరుణించి ప్రేమతో ఆయన నామాన్ని తెలియజేశాడు.
యోషేను పిలిచి ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని ఫరో చేతినుండి విడిపించు, నేను నా ప్రజల బాధను చూచాను. పనులలో తమను కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను. వారి దుఃఖ దినములన్నియు నాకు తెలుసు. వారివే కాదు ఇపుడు మన బాధలు కష్టనష్టములు దుఃఖ దినములు కూడా ప్రభువుకు తెలియనివి కాదు. ఆయన అన్నింటిని చూస్తూ వున్న దేవుడు. దేవుడు కనుక పరమ తండ్రే కనుక మనకున్న కష్టనష్టములన్ని తీసివేసి మనకు సమాధానము ఇవ్వాలని ఆయన ఆశ. కనుక ఫిగుప్తీయుల చేతినుండి ఇజ్రాయేలీయులను విడిపించుటకు అదే రోజునుండి విశాలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఆనాడు దిగివచ్చిన దేవుడా, ఈనాడు మనకొరకు మన మధ్యనే ఉండటానికి శరీర ధారిగా ఈలోకములోనికి వచ్చాడు. అప్పుడే వారి హింసలను చూసిన దేవుడు ఇప్పుడు మనం పడుచున్న హింసలు కూడా చూస్తూనే ఉన్నాడు. అప్పుడా యోషేను ఫరో యొద్దకు వెళ్లి ఇజ్రాయేలీయులను వెలుపలికి తోడుకొని రమ్మని చెప్పినపుడు, సరె కాని నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి- మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు- ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునినడిగెను. అందుకు దేవుడా- నేను వున్నవాడను అనువాడనైయున్నానని యోషేతో చెప్పెను. అంతేకాదు ఉండినవాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇజ్రాయేలీయులతో చెప్పమనెను.
దీనికి ముందు పెనుయేలునందు యాకోబు కూడ- అయ్య నీ పేరు దయచేసి తెలుపుమని అడినప్పుడు, ఆయనను ఆశీర్వదించాడు గానీ తన పేరును చెప్పలేదు. ఆ దినాలలో వారు దేవుని పేరు ఉచ్ఛరించడానికి కూడా భయపడేవారు. ఆయన మాట వినటానికి భయపడెటి వంటివారు. అంత గొప్ప దేవుడు దహించు అగ్నియైన దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు. తన్ను తాను రిక్తునిగా చేసికో. మామూలు మనిషిగా వచ్చి మన మధ్య నివశించుటమే నిజమైన క్రిస్మస్ అని నా నమ్మకము. అంతేకాదు ఆయన పవిత్రమైన శక్తిగల బలమైన రక్షించె నామాన్ని కూడా మనకు తెలియజేసిన ప్రభువుకు వందనాలు.
ఈ నామమును వ్యర్థముగా ఉచ్ఛరింపకూడదు. యెహానా నామమును వ్యర్థముగా నుచ్చరించేవానిని నిర్దోషిగా ఎంచడు. తన నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్ర పరచకూడదు.
ఇదే సైన్యములకధిపతియగు యెహావా వాక్కు. నేనే దాని బయలుదేరచేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను నాశనము చేయును- జకార్య 5:4
అంతేకాదు ఆకాశముతోడన వద్దు; అది దేవుని సింహాసనము; భూమి తోడన వద్దు అని ఆయన పాదపీఠము; యెరుషలేము తోడన వద్దు ; అది మహారాజు పట్టణము.
నేతల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు. నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగాగాని చేయలేవు. మీ మాట అవునంటె అవును కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది- మత్తయి 5:35-37
ఎంతో విలువైన నామము యేసు నామము. కనుక ఆయన నామమును వ్యర్థముగా వాడకూడదు, అంతేకాదు ఆయన సింహాసనమైన ఆకాశము తోడనిగాని, పాదపీఠమైన భూమి తోడనిగాని ఒట్టుపెట్టుకూడదు అని బైబిల్ సెలవిస్తుంది.
క్రీ.శ.360లో డెనిస్ ది లిటిల్ అనే పురావస్తు శాస్తవ్రేత్త రోమన్ లైబ్రరీ నుండి యెరూషలేము యొక్క రికార్డ్స్ తీసి, ఆ రికార్డ్స్‌లో వున్న యేసుక్రీస్తు యొక్క సున్నతి దినమును గుర్తించారు. సున్నతి జరిగిన ఎనిమిది రోజులు ముందు లెక్కించి వారి కేలండర్ నుండి మనం వాడే కేలండర్ లోకి మార్చి, ఆ లెక్క ప్రకారమే డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టిన రోజు అని నిర్థారణ చేశారు. ఆ కాలంలో యూదులు పుట్టిన పిల్లవాడికి ఎనిమిదవ రోజున సున్నతి చేసి పేరు పెట్టేప్పుడు ఆ పిల్లవాడి వివరాలను దేవాలయం రికార్డ్స్‌లో నోట్ చేసేవాళ్ళు. అలాగే యేసు క్రీస్తుకు కూడా సున్నతి చేసినట్టుగా బైబిల్‌లో ఉంది. ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా రోమన్ లైబ్రరీలో మనం చూడవచ్చు. దీని ఆధారముగానే క్రీస్తుశకము క్రీస్తు పూర్వము అని కాలాన్ని విభజించటం జరిగింది. ఎంతో ఉన్నతమైన నామము మన ప్రభువు నామము. ఆయన నామాన్ని ఘనపరచాలి. మహిమ పరచాలి. ఆయన మహోన్నతమైన నామము మహిమపరచబడుచు ఉండునుగాక.
ఆ దినములో యెరూషలేము నందు సుయెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతని మీద నుండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలు పరచబడియుండెను. సువార్త మొదటి అద్యాయములో జకార్య అను ఒక యాజకుడుండెను. తన భార్య ఎలీసబెతు; వీరిరువు కూడ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈయన ప్రార్థన కూడా ప్రభువు తిలకించాడని ప్రభువు దూత తెలియపరచుటకు మనం చూసాము. దీనినిబట్టి అన్ని కాలాలలో ప్రభువు దృష్టిలో నీతిపరులైనవారు ఉంటూనే ఉన్నారు. జలప్రళయంలో లోకాన్ని ముంచివేసినప్పుడు నోవాహు నీతిమంతుని వలన మరల లోకములో మనుష్యజాతి మిగిలి ఉంది. ఇటువంటి నీతిమంతుల ప్రార్థనలవల్ల లోకములో దేవుని యొక్క కృప విస్తరిస్తూనే ఉంది. ఎందుకంటె నీతిమంతులు చేయు విజ్ఞాపనములు మనఃపూర్వకమై బహుబలముగలవై యుండును. వారి ప్రార్థనలు ఆలకించి ప్రభువు గొప్ప కార్యాలు చేసి అనేకమందిని రక్షిస్తాడు.
అయితె సుయెయోనా ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చి యేసును ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను.
నాధా! యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యాజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల యెదట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆ సమయములో యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుయెయోనా వారిని దీవించి- ఇదిగో అనేక హృదయాలోచనలు బయటపడునట్లు, ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి యున్నాడు. మరియు నీ హృదయములోనికి దూసుకొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.
ఇదే సమయములో అన్నఅనా ఒక ప్రవక్త యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
ఈ లెక్కన విమోచన కోసం కనిపెట్టెవారు సుయెయోకు అన్నఅనేవారు మాత్రమే కాదు ఇంకా అనేకులు కూడ కనిపెట్టుచున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ పెద్దలు ఇరువురు కూడ ప్రభువును చూసారు. ఆయన నామకరణములో పాల్గొన్నారు. రక్ష కలిగించె పరిశుద్దయైన యేసు నామకరణ దినము మనకు జనవరి మొదటి తారీఖు గనుక ఆ దినము లోకానికి ఒక పండుగ అయింది. ఇది తెలయని వారెందరో హ్యాపీ న్యూ ఇయర్ అంటారు గాని దాని అర్థము తెలియక ఆ నూతన గడియలలో ఏదో ఆర్భాటం చేస్తారు. సంతోషాన్ని కల్పించుకుంటారు. పాటలు డాన్సులు తినుట త్రాగుటతో ఉంటే సంవత్సరమంతా అలాగే ఉంటుందని అదొక ఆశ. అసలు సంగతేమో 1 జనవరి యేసు అను నామము ఈ లోకానికి పరిచయమైన దినమని.
ఈ మధురమైన యేసు నామములో తండ్రిని ఏది అడిగిన అది చేయటానికి సిద్ధమే. యేసు మనకు దేవునికి, ఆకాశానికి భూమికి మధ్య ఒక నిచ్చెనగా వచ్చాడు. ఈ సంగతి యాకోబు కనిన కలలో తేటగా చూసాడు. అందులో ఒక నిచ్చెన నిలుపబడి ఉండెను; దాని కొన ఆకాశమునుండెను. దానిమీద దేవదూతలు ఎక్కుతు దిగుచుండిరి.
వాస్తవానికి ఈ పరిశుద్ధ ప్రశస్థమైన ఘనమైన నామములో రక్షణ స్వస్థత ధైర్యం బలం విమోచన జయం విడుదల ప్రేమ క్షమాగుణం కనికరము సంతోషము శాంతి సమాధానము తృప్తి నిత్యజీవము దీర్ఘాయువు కలుగుతాయి. ఈ నామముతో దయ్యాలు పారిపోతాయి. ఈ నామము మనలను నీతి మార్గములో నడిపిస్తుంది. నిత్యము నిలిచే నామము. యొహానా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును.
సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము స్తుతించబడును గాక.
సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహావా నామము స్తుతినొందదగినది.
యెహావా నామము ఉన్నతమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుందురు.
యేసు అను నామములో ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. మనకు సరియైన ఆలోచన, బలమైన కార్యాలు జరుగుతాయి. నిత్యము సమాధానము కలిగి ఉంటాము.
యేసు చెప్పిన మాట- మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కాని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహిచునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.
యేసు ప్రభువు శిష్యులైన పేతురు యెహానులు దేవాలయములో ప్రవేశించకముందు పుట్టినప్పటినుండి కుంటివాడైన వాడా భిక్షమడుగగా- వారు తేరి చూచి నజరేయుడైన యేసు నామములో నడవమని చెప్పగా, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవెత్తిన వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతలు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్ళెను. చూచిన వారంతా విస్మయమొంది పరవశులయ్యారు. *

- మద్దు పీటర్ 9490651256