ప్రార్థన

మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు మనస్సు ఎందుకు మార్చుకోవాలి?
మంచి లేదు నీతి లేదు దయా దాక్షిణ్యాలు లేవు. ప్రేమలు లేవు. లంచగొండితనం, ఆశబోతుతనం, వ్యభిచారం, త్రాగుడు, జూదం, విచ్చలవిడిగా నడుస్తున్న ఈ రోజుల్లో - ద్వేషం కల్మషం పెరిగి లోకాన్ని పాలిస్తున్న ఈ రోజుల్లో, మనం కూడా కలిసిపోయి పై విషయాలు తప్పు అని తెలిసినా లోకంతోనే నడుస్తున్నాము. చెడ్డ మాటలు చక్కగా మాట్లాడుతున్నారు. అది సర్వసామాన్యమై పోయింది. బెదిరింపులు దూషణలు శాపనార్థాలు ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు. సరదాగా మాట్లాడుకునేవారు కూడా నీయమ్మ అంటే నీయమ్మ అని మాట్లాడుతున్నారు. అది తప్పు అనిపించటం లేదు. చిన్నవారు కాదు పెద్దవారు కాదు, సాతాను రాజ్యంలో ఇది అందరికీ మామూలే. బూతులు కక్షలు కొట్లాటలు ద్వేషం కలహం మత్సరం దోచుకోవటం చంపుకోవటం ఎవరికి చేతనైనంత మట్టుకు వారు చేస్తున్నారు. చిన్నవారు చిన్నగా పెద్దవారు పెద్దగా. సాతాను రాజ్యంలో బలమే నీతి అయింది. బలము పలుకుబడి అధకారం ఉన్నవాడు ఏదైనా చేయవచ్చు అన్నట్టు ఉంది. తనదాకా వస్తే గాని తెలియదన్నట్టు, తనకు నష్టము కలిగినప్పుడు కష్టము వచ్చినప్పుడు మాత్రము ఇతరులు చేసిన తప్పులు అక్రమాలు దుష్ట కార్యాలు వెకిలిచేష్టలు దూషణ మాటలు తప్పు అని తెలుస్తుంది గాని నేను కూడా దూషిస్తున్నాను, ఇతరులను కష్టపెట్టుచున్నాను నష్టపెట్టాను బాధిస్తున్నాను ఇబ్బంది పెడుతున్నాను అని ఎవరికి వారు తెలుసుకోలేక పోతున్నారు.
ఈ తప్పుడు అలవాట్లు మానుకోవాలని ప్రయత్నాలు చేయని వారుండరేమో. ఎలాగైనా రేపటి నుండి నేను మారాలి సీరియస్‌గా చదవాలి సిగరెట్లు కాల్చడం ఆపెయ్యాలి మద్యం తాగటం మానేయాలి జూదమాడి అంతా పోగొట్టుకున్నాను ఆస్తి ఆరోగ్యం అంతా పోయింది.. మిగిలినవన్నీ కాపాడుకుందాం తిరుగుడు మానేద్దాం సమయాన్ని వృథాగా పోనీయను అని రాత్రి నిర్ణయాలు తీసుకొంటాము. ఉదయానికల్లా అదంతా ఒక కలలాగే అయిపోయి యథాతథంగానే సాగిపోతాము. అలాగే క్రొత్త సంవత్సరంలో కూడా ఏవేవో నిర్ణయాలతో మొదలుపెట్టి ఒక వారం లేక ఒక నెల పాటించి మరలా పాత జీవితంలోనికి మారిపోతారు.
మారటమంటే - కీడు చేయుట మానటం, పాపము చేయుట మానుట, దురలవాట్లను విడుచుట ఒక ఎత్తు అయితే, చేసిన పాపాలకు నష్టాలకు పరిహారము చెల్లించుట ఇంకొకటి. మరి మనం చేసిన పాపాలకు క్షమాపణ ఎలా వస్తుంది? క్షమాపణ పొందకపోతే, ఆ పాపం మన ఖాతాలోనే ఉంటుందిగా. అప్పుడు మారటం వల్ల ఉపయోగమేమిటి? అందుకే యేసు ప్రభువు తానే మనకొరకు మనకు బదులు సిలువలో తన ప్రాణానే్న క్రయధనముగా చెల్లించాడు. పాపాలకు జీతం మరణమని మన అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే మంచి చెడుల తెలివినిచ్చే ఫలం తిన్న హవ్వ ఆదాము సంతానము గనుక. వారి తెలివి మనకు సంక్రమించింది. వారి పాపము మనకు సంక్రమించింది. అందుకే మనం జన్మ పాపులమని దావీదు భక్తుడు వ్రాసుకొన్నాడు.
నేను పాపములోనే పుట్టినవాడను. పాపములోనే తల్లి నన్ను గర్భమున ధరించెను - కీర్తన 51:5.
అంతేకాదు మనం చేసిన పాపమంతా దేవునికి వ్యతిరేకమే. ఆ పాపాలు కడుగబడాలి అంటే పరిశుద్ధమైన రక్తమే చిందించాలి. కారణం పాపి రక్తం చెల్లదు. ఒక చినిగిన రూపాయి నోటు ఎక్కడా చెల్లదు. అది రెండువేల నోటు అయినా లక్ష రూపాయల నోటు అయినా అంతే. కనుకనే దేవుడు నీతిగలవాడు గనుక, మనలను బ్రతికించాలని ఆశ కలిగి ఉన్నాడు గనుక ఆయనే నరావతారిగా వచ్చి తన ప్రాణాన్ని ధారపోసి మనకు విమోచన అనుగ్రహించాడు. దేవుని అపారమైన ప్రేమకు స్తోత్రము కలుగును గాక. మనము ఎంత గొప్పగా ప్రేమించిన వారైనా మరణిస్తే స్మశానంలో పాతి పెట్టి వస్తాం. తల్లైనా తండ్రైనా కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే. ఇంకా వారి తప్పు కోసం మరణిస్తే, శిక్ష అనుభవించారనుకొంటాము. కానీ ప్రభువు ప్రేమ గొప్పది. ఎవరూ నశించుట దేవుని చిత్తము కాదు.
దేవుడు, మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై యుండవలెనని ఇచ్ఛయించుచున్నాడు - 1 తిమోతి 2:4.
అయితే దేవుని శిక్ష పాపుల మీదకు ఎందుకు రావటం లేదు? అని మనుష్యులు భావించి దేవుడు లేడనుకునేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే మానవులే - చేసిన తప్పుకు తగిన శిక్ష వేస్తున్నారు. జైలులో వేయటం దగ్గర నుండి ఉరి తీసేవరకు. కానీ దేవుడెందుకు తీర్పు తీర్చటం లేదు అని అనుకోవచ్చు. కారణం ఎవడును నశించుట, అంటే తీర్పు పొంది ఆరని అగ్నిగుండములో పడుట దేవునికి ఇష్టము లేదు. అందరు మారు మనస్సు పొందవలెనని కోరి దీర్ఘశాంతముతో వేచి యున్నాడు. అంతే కాని దేవుడు శిక్షించాలనుకుంటే, నోవాహు కాలములో జల ప్రళయముతో నాసికా రంధ్రాలలో జీవమున్న ప్రతి జీవి చంపబడినట్లు, సొదొమ గొమొఱ్ఱ పట్టణములను అగ్నితో కాల్చి వేసినట్టు దేవునికి శిక్షించుట చాలా తేలికే. కాకపోతే మనము అంతా రక్షింపబడాలని ఆశతో ఇంకా మారతారేమో, ఇంకా మారతారేమో అని ఎదురుచూస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతముకై వందనాలు. అందుకే ఇది కృపాకాలము.
ఎన్నో సంఘటనలలో ఇంకా మారని కొడుకును చంపిన తండ్రి, తండ్రిని చంపిన తల్లి కొడుకు, భర్తను చంపిన భార్య లాంటి ఎన్నో కేసులు, వారు తప్పత్రాగి మత్తులో ఉన్నప్పుడే చంపివేయటం చూశాము. అయితే ప్రేమ కలిగిన దేవుడేమో ఇంకా మారతారేమో అని ఎదురుచూస్తున్నాడు.
తప్పు తెలిసికొన్న - తప్పిపోయిన కుమారుడు మనసు మార్చుకొని తిరిగి తండ్రి యొద్దకు వచ్చి క్షమాపణ కోరినట్లు, మారు మనస్సు కలిగి ప్రభువు దగ్గరకు వచ్చే ఎంత పాపినైన చేర్చుకొనుటకు ఆయన దివారాత్రులు సిద్ధంగానే ఉన్నాడు. కారణం మనుష్యులు చేసిన పాపాలన్నిటికి ప్రభువు వెల చెల్లించాడు. లోక పాపభారమంతా మోసిన బలవంతుడు దేవుడు. కాబట్టి ఎటువంటి పాపియైన మారు మనస్సు పొంది దేవుని సన్నిధిని చేరవచ్చు.
పౌలు భక్తుడు రోమీయులకు ఇచ్చిన సలహా
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడని.. - రోమా 12:2.
మారు మనస్సు పొంది ఉత్తమము అనుకూలము సంపూర్ణముయైన దేవుని చిత్తాన్ని కనుగొన్నవారు -
1.తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనకూడదు.
2.నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి.
3.చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకోవాలి
4.సహోదర ప్రేమలో ఒకని యందొకడు అనురాగము గలవాడిగా ఉండాలి.
5.ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకోవాలి.
6.ఆత్మీయ తీవ్రత గలవారై యుండాలి.
7.ఆసక్తి యందు మాంద్యులుగా ఉండకూడదు.
8.నమ్మకము గలవారై సంతోషముగా ఉండాలి.
9.శ్రమల యందు ఓర్పుగలవారై ఉండాలి.
10.ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి.
11.పరిశుద్ధుల అవసరములలో పాలుపొందువలెను.
12.ఆతిథ్యమిచ్చుచుండవలెను.
13.హింసించు వారిని దీవించాలి. శపించకూడదు.
14.సంతోషించువారితో సంతోషంగా ఏడ్చువారితో ఏడ్చుచు ఉండాలి.
15.ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి.
16.హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండాలి.
17.మీకు మీరే బుద్ధిమంతులమనుకొనవద్దు.
18.కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు.
19.మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి.
20.శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
21.మీకు మీరే పగ తీర్చుకోవద్దు.
22.శత్రువు ఆకలిగొని యుంటే అతనికి భోజనము పెట్టుము. దప్పిగొని యుంటే దాహమిమ్ము.
23.కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
24.ఎల్లప్పుడు సంతోషముగా ఉండాలి.
మీకు మీరే పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుట దేవుని పని అని చెప్పబడిన మాటను పాటించటం వల్ల నేను ఈ దినం బ్రతికియున్నాను. కారణం - సుమారు 35 సంవత్సరాల క్రిందట నేను యవ్వనంలో ఉన్నప్పుడు, మా యింటిలో దొంగలు పడి నా కుమారునికి చేయించిన బంగారు సిలువను తీసుకెళ్లారు. కొన్ని రోజులకు వారెవరో తెలిసి వారి మీద పగ తీర్చుకోవాలని ఒక రాత్రి వారి కొరకు ఎదురుచూస్తూ అవిశ్రాంతంగా ఉన్నాను. ఎప్పుడు వారు దొరుకుతారా? అనీ, వారిని శిక్షించాలని. ఆ సమయములో ఈ మాట కనబడింది. మీకు మీరే పగ తీర్చుకోవద్దు - ఈ మాట తండ్రి కుమారుని సముదాయించి చెప్తున్నట్టు వినబడింది. వెంటనే నా కోపాన్ని పగను తగ్గించుకొని ఇంటికి వచ్చాను. కాబట్టే ఈ దినాన ఇలా ఉన్నాను. లేకుంటే ఆ దొంగలతో పోటీ పడితే, అప్పుడు నాకున్న కోపానికి వారిని ఏమైనా చేసినట్లయితే నేను జైలులో ఉండేవాడిని. లేదా వారు నన్ను ఎటాక్ చేస్తే మరి నేను ఉండేవాడినో కాదో కానీ, మనస్సు మారుటవల్ల బ్రతికి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక.
తెలియకుండానే చాలా విషయాలకు అలవాటయ్యాము. కోపం, పగ, కక్ష అలవాటుగా చేస్తూ అది తప్పు కాదు అన్నట్టు ఉన్నాము. మనం ఉదయానే్న తాగే తేనీరు చూడండి. దేశమంతా ఉదయానే్న చేసే పని అదే. వాస్తవానికి టీ ఆకుకు పాలు కలిపితే దానిలో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయట. పైపెచ్చు అది మనకు అనారోగ్యం కలుగజేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దానికి చక్కెర కలిపితే మనకు జరిగే మేలుకన్నా కీడే ఎక్కువట.
Even though green tea is good for fighting cancer, adding sugar to the drink could potentially cause more harm than good.
Adding milk to tea destroys its Anti Oxidants.
Many health experts have suggested that one shouldn't start their day with a cup of milk tea, as it will lead to acidity. It is unhealthy.
అని తెలిసిన వారు టీ పార్టీలు ఇస్తున్నారు. తెలియని వారు టీ పార్టీలు చేసుకుంటున్నారు. ఇంకా పెద్దపెద్ద పార్టీలలో హై టీ పార్టీలు చేసుకుంటున్నారు. అది మనకు మంచిది కాపోవటమే కాదు, మన ఆరోగ్యానికి నష్టమని తెలిసినా మానలేక పోతున్నారు. కొన్ని పాపపు అలవాట్లు కూడా అలానే ఉన్నాయి. లంచాలు ఇవ్వటం, తీసికోవటం మామూలుగా జరుగుతున్నవి.
లంచము పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. - సామెతలు 29:4.
సాతాను రాజ్యములో ఇవన్నీ తప్పు కాదు. పాపము కాదు. అయితే దేవుని రాజ్యం, నీతి రాజ్యములో ఇవి తప్పు, పాపము. ప్రభువును నమ్మి పూర్తిగా ఆయన వైపు తిరిగి ఆయన మాటల ననుసరించటమే మనస్సు మార్చుకోవటం.
కీడు చేయుట మాని మేలు చేయుటయే మారు మనస్సు.
యేసు ప్రభువును కూడా తన వైపు త్రిప్పుకోవాలని సాతానుడు అనేక రీతులుగా ప్రయత్నించినట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయములో స్పష్టముగా ఉన్నది. కాని ప్రభువు పరిశుద్ధుడు గనుక పాపము వైపు తిరుగలేదు.
సాతాను ఈ లోక అధికారి. అందరినీ మోసపుచ్చి చీకటిలో నడిపిస్తున్నాడు. పరలోకము నుండి వచ్చిన పరిశుద్ధుడు నీతిని స్థాపింప వచ్చాడు. ఈ లోకాధికారిని వెంబడించి అనేక చెడు అలవాట్లకు బానిస లయ్యాము. వాడు మనలను చీకటిలో నడిపించి నిత్య నరకానికి అప్పగిస్తాడు. అయితే ప్రభువు వైపు తిరిగితే ఆయన పునరుత్థాన శక్తి మనకు విమోచన ఇచ్చి ప్రతి విధమైన బానిసత్వము నుండి మనలను విడిపించును. అక్రమానికి అపవిత్రతకు బానిసలుగా ఉన్న మన అవయవాలకు విడుదల దొరుకుతుంది. పాపము నుండి విడిపించబడిన వారు ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి.
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులై నందున పరిశుద్ధత కలుగుటయే - మీకు ఫలము - దాని అంతము నిత్య జీవము. - రోమా 6:22.
దేవుని వైపు తిరుగుటయే కాదు, ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడే బహుగా ఫలించగలము.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. - యోహాను 15:8.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. - మత్తయి 5:16.
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి. ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. - ఎఫెసీ 5:8-9.
ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్ని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. - యెహెజ్కేలు 18:30-32.
మారు మనసుకు తగినట్లు మేమేమి చేయవలెనని యోహానును అడిగినప్పుడు - అతడు రెండు అంగీలు గలవాడు ఏమి లేనివాని కియ్యవలెననియు, ఆహారము గలవాడు ఆలాగుననే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులు బాప్తిస్మము పొందవచ్చి మేమేమి చేయవలెనని అడుగగా - మీకు నిర్ణయించిన దాని కంటె ఎక్కువ తీసికొనవద్దని చెప్పెను. సైనికులు మేమేమి చేయవలెనని అడుగగా, అందుకు యోహాను ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనిందలు వేయకయు, మీ జీతములతో తృప్తిపొంది యుండుడని వారితో చెప్పెను.
చీకటి నుండి వెలుగు వైపు తిరిగి నూతన సంవత్సరములో నూతన జీవితం, ప్రేమతో సంతోషంగా సమాధానంగా శాంతముగా దయ మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము కలిగి జీవించుటకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.
క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి - ఫిలిప్పీ 2:5.
కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై యొకనికొకడు తనకంటె యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములనేకాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

- మద్దు పీటర్ 9490651256