ప్రార్థన

మంచి - చెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే దేవుడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను - ఆది 2:17.
ఆ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. తోటను సేద్యపరచుట కాయుట ఆదామునకు అప్పగించిన పని. ఆ తోటలో ఏ చెట్టు పండైనా ఆదాము హవ్వలు నిరభ్యంతరంగా తినవచ్చును. అంతేకాదు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోమని, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాడు. అంటే ఏదేను తోట అంతా వారిదే. వారి కోసమే ఆ వనాన్ని నిర్మించాడు. సేద్యమంటే ఇప్పుడు పడుతున్న కష్టము కాదు. చెమటోడ్చి పనిచేసే అంత కష్టము కాదు. కాయుట కూడా అంత పెద్ద పని కాదు. ఇప్పటిలా నిద్రాహారాలు లేకుండా రాత్రనక పగలనక పని చేయనవసరము లేదు. నిజముగా ఈ రోజులలో సేద్యము ఎంత కష్టమో. రైతులు రాత్రి పగలు శ్రమపడినా ఒక్కొక్కసారి ఫలితాలు లేక జీవితాలను చాలిస్తున్నారు.
వాస్తవానికి మొదటి ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించక ముందు ఇంత కష్టపడవలసిన అవసరము లేదు. శ్రమతో చెమటోడ్చవలసిన అవసరము లేదు. కానీ వారి పాపము వలన నేల శపించబడింది. అందుకే సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది - రోమా 8:22. ముళ్లతుప్పలు గచ్చపొదలు శపించబడిన భూమిలో మొలవటం మొదలయ్యాయి. ఆదాము పాపము చేయక ముందు, ఈ ముళ్లు తుప్పలు గచ్చపొదలు లేవు. మంచి పొలాలలో మనము వేయకుండానే కలుపు వస్తుంటుంది. దానిని వదిలివేస్తే అది పెరిగి అసలు పంటనే కనపడకుండా చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. కొన్ని చేలల్లో కలుపుమొక్క, మంచి మొక్క ఒకలాగనే ఉండటంవల్ల ఏది కలుపో, ఏది మంచి మొక్కనో తెలియదు గనుక వాటి వేరు చేయలేము. అందుకే కోతకాలము వరకు ఆగి ముందుగా కలుపు మొక్కలను వేరు చేసి కాల్చివేయుటకు కట్టలు కట్టి ఉంచుతారు.
నేలలోనే కాదు మనిషిలో కూడా మంచి చెడులు కలిసి ఉన్నాయి. ఫర్వాలేదులే మంచివారు, లక్షణాలు మంచివి అని స్నేహం చేస్తే చివరకు మోసమే కనపడుతుంది. మంచి చెడులు కలిసిన మిశ్రమ లోకమిది. మంచి ఉంటుంది. చెడు ఉంటుంది. అందుకే తెలుగులో వాడుకగా మాట్లాడుతారు - నేను మంచి వాళ్లకు మంచివాడిని, చెడ్డవాళ్లకు చెడ్డవాడినని చెప్తూ ఉంటారు. మంచి చేయాలనుకుంటారు. కానీ చేయలేరు. అట్లని పూర్తిగా చెడ్డవాళ్లు కాదు. వారిలో కూడా మంచి అనేది ఉంటుంది. మంచి చెడుల తెలివినిచ్చే పండు తినిన మానవుడు మంచి చెడుల మిశ్రమమై ఉన్నాడు. అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యి ఉండవచ్చు. లేక 25-75 శాతం లేదా 75-25 శాతం ఎంతో కొంత మంచి ఉంటుంది. ఎంతో కొంత చెడు ఉంటుంది. జాలిగల మనస్సు ప్రేమించే మనస్సు ఉంటున్నాయి. పడిపోయిన ఆదాము హవ్వల వలన మనము పడిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే దేనిలో నిలకడగా ఉండలేము.
రోమీయులకు పౌలు వ్రాసిన ఉత్తరములో ఈ ‘మిక్స్‌డ్ ఫీలింగ్’ను చాలా తేటగా వ్రాశాడు.
ధర్మశాస్తమ్రు ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై యున్నాను. ఎందుకంటే నేను చేయునది నేనెరుగను. నేను చేయదలచినది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇష్టము లేనిది నేను చేసిన యెడల ధర్మశాస్తమ్రు శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దాని చేయుటకు నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది - రోమా 7:14-21.
నాకు తెలిసి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అందరికీ సహాయపడుతూ ఉంటాడు. చేయగలిగిన సాయము చేస్తూ ఉంటాడు గనుక చాలామంది తన దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుంటారు. అయితే ఒక డైవర్సీ తన దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుంటూ ఉండేది. ఆయన కూడా చాలా సీరియస్‌గా మేలు చేయాలని, వారిని కలపాలని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు. మొదలు పెట్టిందేమో మంచి చేద్దామనే ఉద్దశమే గానీ, రాన్రాను చెడు ఉద్దేశము మొలిచి మొదలుకే మోసము జరిగింది. తద్వారా అనేక గొడవలు, బాధలు వ్యాధులు కలిగి, మంచి చెడుల మధ్య నలిగి మరణించాడు.
మంచి చేయాలని ఉంటుంది. అనాధలను, విధవరాండ్రను చేరదీస్తున్నారు. కానీ ఏదో ఒక చెడు ఉద్దేశము కలుగుట వలన పొరపాట్లు అక్కడక్కడ జరుగుచున్నవి. మంచి చేయాలని ఉంటుంది. దానితో అక్కడక్కడ చెడు కలుస్తుంది. అట్లాగని అంతా చెడు అనటానికి లేదు. చెడులో ఎంతో కొంత మంచి ఉంటుంది. మంచి చెడులు కలిసిన వారికి ఒక నీతి ఉంటుంది. చెడు జీవితం జీవించే వారికి ఒక నీతి ఉంటుంది. అందుకే మనుష్యుల నీతి మురికి గుడ్డలతో సమానమని బైబిల్ సెలవిస్తోంది. సుంకరులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారట. అలాగే దొంగలకు కూడా వారి నీతి వారికుంటుంది. దొంగిలించిన సొమ్ముతో పేదవారికి సహాయము చేసేవారు కొందరైతే పేదవారికిచ్చే డబ్బులు దొంగిలించేవారు కొందరు. మంచి చెడుల ఫలము తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. అంటే అది మరణమునిచ్చే చెట్టు. మంచి ఉంటుంది. కానీ ఆ మంచిలో ఎంతో కొంత చెడు కలిసి ఉంటుంది. కనుక అది చెడే. చెడులో ఎంతో కొంత మంచి ఉన్నా గానీ అదీ చెడే గనుక అది చెడే. ఈ రెండు రకాల మనుష్యులు మరణించవలసిందే. ఇది దైవ శాసనము.
ఏదేను వనములో మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు అన్నీ మంచి చెట్లలో ఇది ఒకటి. మిగిలిన చెట్లు ఎన్నో ఉన్నాయి. ఆ తోట యజమాని ప్రస్తుతము ఆదాము. దేవుడే తనకు ఆ అధికారమిచ్చినట్లు తెలుస్తుంది. హవ్వ ఆదాము తినవద్దన్న పండు తిన్నందువల్ల ఏదేను తోట నుండి బయటకు తోలివేయబడ్డారు. వీరు మంచి చెడుల తెలివితో చేసిన పనులతో లోకమంతా మంచి చెడుల చెట్ల తోటలే ఉన్నాయి. ఏ తోటకెళ్లినా ఏ ఆఫీసుకు వెళ్లినా ఏ కళాశాలకు వెళ్లినా ఏ పాఠశాలకు వెళ్లినా ఏ ఊరెళ్లినా ఏ దేశమెళ్లినా మంచి చెడుల తోటలతో నిండిపోయి ఉన్నాయి.
లోకములో నిండి ఉన్న ఈ మంచి చెడుల ఫలాలు ఆహారమునకు మంచివిగా కన్నులకు అందమైనవిగా వివేకమిచ్చు రమ్యమైనవిగా కనపడుచున్నవి.
లోతు తన కన్నులెత్తి చూడగా యొర్దాను ప్రాంతమంతయు యెహోవా తోటవలె ఉందట. ఎంతో సుందరముగా చక్కని చెట్లతో పూలతో ఫలాలతో నీటి కాలువలతో సస్యశ్యామలంగా ఉందనీ, తాను యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగాప్రయాణము చేశాడు. అలా అబ్రహాము లోతు విడిపోయారు. అబ్రహాము కనానులో, లోతు సొదొమ దగ్గర గుడారాలు వేసికొని జీవిస్తూ ఉన్నారు. చూపులకు అందంగా ఉన్నా, సొదొమ గొమొఱ్ఱా మనుషులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. ఆ తరువాత సొదొమ గొమొఱ్ఱాల గతి ఏమైందో మనకందరికీ తెలిసిందే. దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకమును కురిపించి ఎలా నాశనము చేశాడో చూశాం. ఇక్కడ ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఆకాశము నుండి ఇశ్రాయేలీయుల కొరకు మన్నాను కురిపించిన దేవుడు, దుష్టత్వముతో పాపముతో నిండియున్న సొదొమ గొమొఱ్ఱాల మీద ఆకాశము నుండి అగ్ని గంధకమును కురిపించి నాశనము చేసియున్నాడు.
ఈ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా బహుగా పాపము విస్తరించింది. దుష్టత్వము పెరిగిపోయింది. మంచి చెడులు కలిసిపోయాయి. ఈ మంచి చెడులు కలిసినప్పుడు వచ్చే ఫలము, మరణము. లోకమంతా మరణ ఛాయలోనే ఉంది. వారి దేశానికి మంచి చేసుకోటానికి మన దేశాన్ని చెడు చేస్తున్నారు. నష్టాన్ని కలుగ జేస్తున్నారు. ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇలా దేశాల మధ్య మంచి చెడుల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంచిగానే కనబడుచున్నారు గానీ చెడు చేస్తున్నారు. దీనిని ఏమనాలో మంచి చెడు అనాలా, మంచి మోసమనాలో, మంచి కీడు అనాలో అర్థము కావటము లేదు.
ఏదైనా మంచిది ఉందా, ఎవరైనా మంచి చేస్తారా, ఎవరైనా సహాయము చేస్తారా, బాగు చేస్తారా అని చూసేవారు ఎక్కువయ్యారు. అన్నింటిలో మోసమే. తిండిలో మోసమే. అన్నింటిలో కల్తీలే. కూరగాయలు, పండ్లు, ఫలాలు అన్నీ మంచిగా కనపడేటట్లు చెడు పనులు చేస్తున్నారు. చూడటానికి రమ్యముగా ఉన్నా దానివల్ల ఏదో ఒక జబ్బు వస్తుంది. ఆజచిజషజ్ఘ గజఔళశజశ వల్ల వ్యాధులు, రంగు రావటానికి వాడే కెమికల్స్ వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువయ్యాయి. వాటి ఫలితం అకాల మరణం. ఈ వ్యాధులతో ఆసుపత్రులకు వెళితే అక్కడ ఉన్న దానికి లేని దానికి వైద్యం చేసి, ఉన్న డబ్బును ఖాళీ చేస్తున్నారు. ఒకప్పుడు నోబెల్ ప్రొఫెషన్స్ అనుకొన్న టీచింగ్, మెడిసిన్ ఇప్పుడు వాటి పేరెత్తితేనే భయమేస్తుంది. టీచింగ్ కమర్షియల్ అయిపోయింది. వైద్యం కూడా వ్యాపారమైంది. వారు సీట్ల కొరకు లక్షల డబ్బులు కట్టారు గనుక వాటిని తిరిగి సంపాదించుకోటానికి అనవసరమైన పనులు ఎన్నో చేస్తున్నారు. ఎవరికి చేతనైనట్టు వారు చేస్తున్నారు. ఒకరినొకరు మోసం చేసుకొంటున్నారు. చెడును కూడా చాలా తెలివిగా చేస్తున్నారు. చెడును తెలివిగా చేసి గొప్పవారైనంత మాత్రాన వారు చేసే మంచి పనులు మంచివవ్వవు. కారణం వారు చేసే మంచికి ముందు వారు చేసిన చెడు అంటుకునే ఉంటుంది. లంచం తీసికొని దానధర్మాలు చేస్తే, ఆ దాన ధర్మాలకు లంచమనే చెడు అంటుకునే ఉంటుంది. ఇలా ప్రతి మంచికి చెడు, ప్రతి చెడులో ఒక మంచి ఉంటూనే ఉంటాయి. ఈ తెలివి అంతా ఆ పండుదే. మన పూర్వీకులైన హవ్వ ఆదాము తిన్న మంచి చెడ్డల తెలివినిచ్చే పండు వలననే. అయితే ఈ మరణానికి లోనయ్యే కాలము నుండి మనలను ఎవరు విడిపిస్తారు?
అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. అయితే ఇది గ్రహించిన వారు కొందరే. గ్రహించి ఒప్పుకొనిన వారు ధన్యులు. మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు.
హవ్వ ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమము వలన సంక్రమించిన అనాది కాల పాపము పరిహరించటానికి యేసు మానవాకారములో ఈ లోకములో జన్మించి తన పరిశుద్ధ రక్తము కార్చి, మన పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించాడు. ఆయన మన కొరకు మన స్థానములో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇదంతా లేఖనాల ప్రకారము జరిగింది. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే పునరుత్థానము కలిగెను. ఆదాము నందు అందరు ఏలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు.
మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. మంచి చెడుల తెలివిని మ్రానుకు కొట్టి (సిలువకు) మరణపు ముల్లును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసే ప్రథమ ఫలము.
ఆదిలో తినగూడని ఫలముల చెట్టు ఒక్కటే, మిగిలిన ఏ చెట్టు ఫలములనైన తినవచ్చు. ఇప్పుడు ఆ చెట్లు లోకమంతా వ్యాపించి ఉన్నాయి గనుక తినగలిగిన నీతి ఫలములనిచ్చే యేసు మార్గములోనే నడువాలి. ఇది ఇరుకు మార్గముగా ఉన్నా చివరకు విశాలత లోనికి నడిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమతోనే మనలను ఒకరినొకరు ప్రేమించుచు జీవించమంటున్నాడు. మంచి చెడుల గొడవే వద్దు. దాని వైపే చూడగూడదు. మంచి చెడుల లెక్కలు ప్రభువే చూసుకుంటా నంటున్నాడు. కనుక శత్రువు ఆకలి గొంటే అన్నము పెట్టు. దాహము గొంటే నీళ్లు ఇవ్వు. అంతే. క్రీస్తు మనలను ప్రేమించినట్లు మనము కూడ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, దేవుని ప్రేమిస్తూ ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమే గనుక మంచి చెడుల వైపు చూడనే వద్దు. లోతు భార్య ఒక్కసారి వెనుదిరిగి ఉప్పు స్తంభమైనది. మనము కూడా ఈ లోక పోకడల వైపు చూడక సుళువుగా చిక్కులబెట్టే పాపము వైపు చూడక, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. మంచి చెడుల తెలివిని ప్రక్కనబెట్టి ప్రేమతో జీవిద్దాం. దేవుని ప్రేమతో జీవిద్దాం. కారణం మానవ ప్రేమ మారుతూ ఉంటుంది. గనుక నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని యేసు ప్రేమను కలిగి జీవిద్దాం. ఇట్టి శ్రేష్ఠమైన ప్రేమతో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256