ప్రార్థన

క్రీస్తు శ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాలలో, మహానగరాలలో ఉండేవారు సొంత గ్రామాలకు వెళ్లి రెండు రోజులు ఉండటం బహు కష్టంగా ఉంటుంది. నీటి సమస్య, శుభ్రత ఇంకా అనేకమైన అసౌకర్యాలకు గురౌతారు. విదేశాల నుండి వచ్చిన వారి సంగతి మరీ ఘోరం. వాతావరణ కాలుష్యం లాంటి ఇబ్బందులు, ఇతరత్రా ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాంటిది..
‘మహిమాన్వితుడు - పరిశుద్ధుడు - నిత్య నివాసి - సమీపింపరాని తేజస్సు కలిగిన ప్రభువు - దహించు అగ్నియైన దేవుడు - మానవుని పోలికతో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొన్నాడు మానవుల కోసం. మానవుని పాపాల నిమిత్తం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను.’
వాస్తవానికి మనిషి దేవుని స్వరూపములోనే చేయబడినా, పాపము ద్వారా శాపానికి గురై దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొన్నాడు. పాపానికి ముందు -అవ్వ ఆదాములతో దేవుడు ప్రతిదినము సాయంకాలమున కలిసేవాడు. కాని పాపము దేవునికి మనిషికి అడ్డుగా నిలిచింది. ఒక్క పాపము - చిన్నచిన్న చినుకులు కాలువలుగా, కాలువలు నదులుగా, నదులు సముద్రముగా మారినట్లు - లోకమంతా పాపం వ్యాపించింది. అంతేకాదు - ఈ శరీరము పాపానికి నారుమడిగా మారింది. పాపాన్ని ఎంత కడిగినా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంది. యెహోవా దేవుడు దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎంత హెచ్చరించినా ఎన్ని రకాలుగా శిక్షించినా, అప్పటికి మారినట్లు ఉంటూనే మళ్లీ పాపంలోకి పడిపోతున్నారు. గుండు చేసిన మరుసటి దినం నుండే వెంట్రుకలు ఎలా మొలకెత్తుతున్నాయో అలానే పాపం పుట్టుకొస్తూనే ఉంది.
అటువంటి మూర్ఖమైన వక్రజనము అక్రమాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నా వారి మధ్యకు యేసు ప్రభువు రావటం.. ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండటం అసలు శ్రమ. అయినా సంతోషంతో వచ్చాడు. మనం కోల్పోయిన మహిమను దేవుని రూపును మరల మనకు ఇవ్వటానికి శ్రమ పడాలని తెలిసి కూడా సిద్ధపడి వచ్చాడు.
1 పేతురు 2:21 - క్రీస్తు మనకొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. దూషించబడియు బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. కొట్టువారికి ఆయన తన వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరికివేయు వారికి చెంపలను అప్పగించాడు. ఉమ్మి వేయు వారికిని అవమానపరచు వారికిని ఆయన ముఖము దాచుకొనలేదు. ఆయన వస్తమ్రును పంచుకొన్నారు. ఆయన అంగీ కొరకు చీట్లు వేశారు. ఆయన వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయెను.
యెషయా 53:5 - మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. తాను కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనెను. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. మన కోసము శాపమై మనలను ధర్మశాస్తమ్రు యొక్క శాపము నుండి విమోచించెను. పాపమెరుగని ఆయన మన కొరకు పాపమాయెను. యేసు ప్రభువు బహు శ్రమలు పొందెను.
ఎన్ని శ్రమలు ఎదురైనా ఎటువంటి శ్రమలు ఎదురైనా చివరకు ప్రాణము పెట్టవలసి వచ్చినా వెనుకాడని తల్లిదండ్రులు లేకపోలేదు. ప్రసవం ఎంత శ్రమతో కూడినదైనప్పటికీ తల్లి అన్నింటినీ ఓర్చుకొని జన్మనిస్తుంది. అలానే మనకు నూతన జీవితాన్ని ప్రసాదించి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి మానవ రూపములో వచ్చిన దేవుని కుమారుడు యేసు ప్రభువు బహు శ్రమలు పొందెను.
1 థెస్సలొ 4:3 - మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
మన అతి క్రమములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. కొరడాలతో కొట్టబడెను. సీలలతో గుచ్చబడెను. ముళ్లకిరీటము పెట్టబడెను. మనకు మారుగా ఆయన చీల్చబడెను. ఆయన ఘోర శ్రమ మరణ పునరుత్థానము వల్ల మనకు నిత్య జీవము కలుగుతుంది.
శ్రమతో కూడిన పనులుంటే -అనేకమైన సాకులు, ఎండ అంటారు.. వాన అంటారు... చలి అంటారు. ఏదో ఒక సాకుతో ఆ పనులు తప్పించుకోటానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషుల కోసం, ఎటువంటి లాభం ఆశించకుండా కేవలం మనలను పాప కూపం నుండి రక్షించటానికి వచ్చిన ఆయన ప్రేమకు విలువనిచ్చి, ఆయన ఘోర శ్రమను జ్ఞాపకముంచుకొని ఆయన చీల్చబడిన శరీరము యొక్క మార్గములో నడచి తండ్రియైన దేవుని ఎదుట పరిశుద్ధముగా నీతిమంతులముగా నిలువబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.
*

- మద్దు పీటర్ 9490651256