ప్రార్థన

దేవుని మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులనబడుదురు.’
-మత్తయి 5:9
లోకములో సమాధానం లేక, శాంతి లేక సమాధాన జీవితం కోసం ప్రాణాలు తపించిపోతున్నాయి. అసమాధానముతో నలిగి కృంగిపోతున్నాయి. సమాధానము లేనివారు ఇతరులను సమాధానపరచలేరు. సమాధానకర్తతో సంబంధం లేనివారు సమాధానముగా ఉండలేరు. జీవాధిపతితో సంబంధము లేకుంటె జీవముండదు. ప్రేమమూర్తితో సంబంధం లేకపోతే అసలైన ప్రేమ ఉండదు. కృపామయునితో సంబంధం లేకపోతే అసలు కృప అంటే ఏమిటో తెలియదు. కరుణామయునితో సంబంధం లేకపోతే కరుణ అంటే ఏమిటో తెలియదు. ఈ లోకములో నీకు ఆస్తి ఉండొచ్చు. మందీ మార్బలం ఉండొచ్చు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవంతులు ఉండొచ్చు. అయినా దేవునితో సంబంధం లేకపోతే సమాధానం ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా నేత్రాశ శరీరాశ జీవపుడంబము, దానివల్ల అసంతృప్తి కోపం కొట్లాటలు అల్లర్లు గొడవలు హింసలు నరహత్యలు మోసాలు దోచుకొనుట అసహనము ఎక్కువై లోకము యుద్ధాలతో నిండియున్నది. మాటల యుద్ధాలు ఆయుధాల యుద్ధాలు చివరకు అణుబాంబుల యుద్ధాలు జరుగుచున్నవి. కుటుంబ యుద్ధాల నుంచి ప్రపంచ యుద్ధాలుగా మారి సమాధానము లేని పరిస్థితులలో యేసు ప్రభువు అమూల్యమైన మాట ‘సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదుర’ని. అసలు సమాధానము అంటే? సంపూర్ణత, ఆరోగ్యం, ఐశ్వర్యం, తృప్తి, భద్రత, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు. -ళ్ఘషళ జఒ ష్యౄఔళఆశళఒఒ, త్ద్యీళశళఒఒ, తీళ ఇళజశ య్యజూ దళ్ఘఆ్ద ఔ్యఒఔళూజఆక ఒళషఖూజఆక ద్ఘ్యూౄశజ్యఖఒ ళ్ఘఆజ్యశఒ్దజఔ.
మిలిటరీ బలగాలతో లేక రాజకీయాలతో లేక ఆర్థిక సర్దుభాట్లతో ప్రపంచంలో శాంతి సమాధానాలు నెలకొల్పటం అనేది సర్జరీ జరగాల్సిన దగ్గర ఏదో మందు పూసి పంపినట్లు ఉంటుంది. మనిషి మనస్సు మారకపోతే మంచి సమాజం, మంచి నేత లేక మంచి ప్రపంచం అవ్వదు. ఈ లోకంతో సర్దుకుపోతే వచ్చేది సమాధానము కాదు. లోకంలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. అయితే సమాధాము పొందేది ఎలా? కీడు చేయుట మాని మేలు చేయాలి. సమాధానము వెదకి వెంటాడాలి. మనిషికి మనిషికి ఉన్న ద్వేషాన్ని సమాధానకర్తయైన యేసుక్రీస్తు శిలువలో సంహరించి సమాధానపరిచాడు. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో వ్రేలాడుచున్న సమయంలో కూడా ‘వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమ’ని తండ్రిని కోరాడు. ఆయనే సమాధానకర్తయగు అధిపతి అని రుజువు చేసుకున్నాడు. క్రీస్తుకు పూర్వం 720 సం.లో యెషయా వ్రాసిన ప్రవచనము ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడను గ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును’ అను మాట రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు శిలువ యజ్ఞంలో నెరవేరింది. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిమ్మళం నిబ్బరము కలుగును. దేవుని రాజ్యము నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై యున్నది. మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందాలి.
‘మీరు నా కట్టడలను బట్టి నడచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములో వర్షమిచ్చెదను. మీ భూమి పంటనిచ్చును. మీ పొలములో చెట్లు ఫలించును. మీ ద్రాక్షపండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో మీకు క్షేమము కలుగును.’
-లేవీకాండము 26:2-6
దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆజ్ఞల ప్రకారము ప్రవర్తించిన యెడల నీకు సమాధానము నీ దేశములో వర్షాకాలములో వర్షములు తొలకరి వాన కడవరి వాన వాటి వాటి సమయములలో పడి ఫలభరితముగా ఉండును. అంటే నీవు దేవుని మాట వినుట వలన నీకు సమాధానము నీ దేశానికి ఆశీర్వాదము కలుగును. ఎవని మనస్సు ప్రభువు మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతిని ఇచ్చి కాపాడుతాడు.
‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము.’ -లూకా 2:14
క్రీస్తు ఆ సమాధానము. ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచేవారే ఆయనకు ఇష్టులు. వారికి సమాధానము ఉంటుంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి మత్తయి 5:24 ప్రకారము ‘నీ సహోదరునికి నీ మీద విరోధమేమైనను ఉన్నదని నీకు జ్ఞాపకమునకు వచ్చిన యెడల నీ అర్పణము బలిపీఠము ఎదుట విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. లేకుంటే నీ అర్పణము అంగీకరించబడదు.’ సమాధానపడిన తరువాత వెళ్లి అర్పణ అర్పించాలి. క్రీస్తు చేసిన సమాధానార్థ బలియాగమును బట్టి నీకు దేవునికి సమాధానము కలిగినప్పుడు - నీవు నీ సహోదరునితో కూడ సమాధానపడాలి. లేకుంటే ఉపయోగము రాదు. దేవునితో సమాధానపడిన వాడు సమాధానపరచేవారుగా ఉండాలి. నీ మటుకు నీవు దేవునితో సమాధానంగా ఉంటే చాలదు. తోటివారితో సమాధానంగా ఉండాలి. అది ఎంతో ఆశీర్వాదము. అప్పుడు నీవు దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడతావు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు సమాధానపరచేవిగా ఉన్నవి. నీ శత్రువుని ప్రేమించు. ఆకలిగొంటె ఆహారము పెట్టు. దాహముగా ఉంటే దప్పిక తీర్చు. హింసించు వారి కొరకు ప్రార్థించు. వ్యభిచరింపవద్దు. దొంగిలవద్దు. అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. పొరుగు వానిది దేనిని ఆశించవద్దు. నరహత్య చేయవద్దు. కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడ త్రిప్పమని, పొరుగు వాని మీద జాలి చూపమని, క్షమించమని.. ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంత నెమ్మది ఉంటుందో! ఎంత శాంతి సమాధానం ఉంటుందో గదా! మనము సమాధానముగా ఉండుటను బట్టి మన ఇల్లు సమాధానముతో ఉంటుంది. మన సమాజం కూడా సమాధానముగా ఉంటుంది. ఆయనను వెంబడించే వారికి క్రీస్తు ఇచ్చే సమాధానము మన హృదయములను ఏలేటట్లు ఉండాలి. క్రీస్తు శాంతినే మనకు అనుగ్రహించాడు. ఆయనను ప్రేమించే వారికి ఆయన ధర్మశాస్తమ్రును ప్రేమించేవారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియు లేదు.
క్రీస్తు మాటలను పాటించి, సమాధానము పొందుకున్న వారు వారి మట్టుకు వారు సమాధానముగా ఉంటే సరిపోదు. దేవుని ఆశీర్వాదము కావాలనుకొంటే, దేవుని కుమార్తెలుగా కుమారులుగా అవ్వాలంటే, సమాధానపరచేవారుగా ఉండాలి. దేవుడు నీకిచ్చిన సమాధానము నీ యింటి వారికి సమాజానికి పంచాలి. సమస్త జ్ఞానమునకు మించిన ఈ సమాధానాన్ని కలిగి, సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఎక్కడకు వెళ్లినా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను జోడు తొడుగుకొని నిలువబడాలి. నీవు ఏ దేశం వెళ్లినా ఎక్కడ ఉన్నా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను జోడు విడువకూడదు. ‘ఇది నా కారు. దీనిని నీవు వాడుకో’ అని మనకు ఇచ్చి వేరే దేశాలకు వెళ్లిన అన్నలాగా, ‘నా శాంతినే మీకిచ్చాను’ అని ప్రభువు శాంతిని మనకనుగ్రహించి వెళ్లాడు.
సమాధానంగా ఉండి సమాధానపరుస్తూ సుఖంగా ఉండటానికి లోకకల్యాణం కొరకు పాటుపడటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256