ప్రసాదం

బొమ్మలు- ఆధ్యాత్మికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్ధనాలన్నిటిలోను విశిష్ఠమైన ప్రశస్త్యమైన ధనం సాధనం’’అన్నారు పెద్దలు.
సాధనమే ఆధ్యాత్మికానికి పెద్ద ఇంధనం. సాధనమునే సాధన అంటారు. సాధన అనేది అనేక విధాలుగా ఉంటుంది. అనేక మార్గాలలో సాగుతుంది. భక్తియోగం, కర్మయోగం, జ్ఞానయోగం అని సాధనకు మూడు పద్ధతులు.. శ్రవణం, స్మరణం, అనుసరణం, ఆచరణం ‘సాధనా’ మార్గంలో కొన్ని మైలురాళ్ళు. గమనాన్ని గమ్యంచేర్చే కొన్ని ప్రయత్నాలు.
ఒక పర్యాయం ఓ గురువు తమ శిష్యులను పరీక్షించాలని బొమ్మలను తీసుకువచ్చేడు. ఆ బొమ్మలలో ఏది శ్రేష్ఠమైనదో శిష్యుల్ని నిర్ణయించమన్నాడు. శిష్యులతోను పండితులతోను సభంతా నిండుగా ఉంది. ఆ సభలోఉన్న వారందరూ బొమ్మలను పరిశీలించడానికి సందేహించేరు. బొమ్మలలో ఏముందో, ఈ పరీక్ష ఏమిటో అని భయపడ్డారు.
అంతలో ఓ శిష్యుడు లేచి వచ్చాడు. అందరూ చూస్తూండగా ఆ బొమ్మల్ని అటుఇటు త్రిప్పి పరిశీలించేడు. పరీక్ష చేసేడు. ఒక ఇనుప కడ్డీని తెప్పించేడు. దానిని ఒక బొమ్మ చెవిలో దూర్చేడు. ఆ ఇనుపకడ్డీ ఆ బొమ్మకున్న రెండవ చెవిలోనుండి బయటికి వచ్చింది. ఆ బొమ్మని పక్కన పెట్టేడు. ఇంకో బొమ్మని తీసుకుని ఇనపకడ్డీని దాని చెవిలో దూర్చేడు. ఇనుప కడ్డీ ఆ బొమ్మ నోటినుండి బయటికి వచ్చింది. ఆ రెండో బొమ్మని కూడా పక్కనపెట్టేడు. తర్వాత మూడో బొమ్మను తీసుకుని ఆ బొమ్మ చేతిలో ఇనుపకడ్డీని దూర్చేడా శిష్యుడు. ఇనుపకడ్డీ బయటికి ఎటువైపు నుంచి రాలేదు. శిష్యుడు ధైర్యంచేసి ఈ మూడవ బొమ్మ సాధనా ప్రక్రియకి ఉత్తమమైనది. ఉత్తమ శ్రవణానికి ప్రతీక. ఇక రెండవ బొమ్మ మధ్యస్త శ్రవణానికి ప్రతినిధి. ఇక మొదటి బొమ్మ అధమమైన శ్రవణమును సూచిస్తుంది’’అని చెప్పేడు.
శిష్యుడు చెప్తున్నది అందరికీ పూర్తిగా అర్ధమవ్వాలి అనే ఉద్దేశ్యంలో విపలంగా చెప్పమని ఆజ్ఞాపించేడు గురువు. శిష్యుడు వివరించటం మొదలుపెట్టేడు. ‘‘గురువర్యా! మనం అందరం, మేం అందరం బోధలను ప్రబోధాలను వింటుంటాం. వింటూనే ఉంటాం. అందులో కొందరు బోధనల్ని ప్రబోధల్ని ఈ చెవితో వింటారు. విన్న వెంటనే విన్నది విన్నట్టు రెండో చెవిగుండా వదిలేస్తారు. వారు మొదటి బొమ్మలా. వారు అధమమైన శ్రవణానికి ప్రతినిధులు. వీళ్ళు విని ప్రయోజనం లేదు. అందరికీ వివరిస్తున్నాడు. సభలో ఉన్నవారంతా వింటున్నారు. గురువుగారు, శిష్యుడు ఉదాహరణ పూర్వకంగా చెపుతున్న తీరుకి శిష్యుణ్ణి ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు శిష్యుని వంక. శిష్యుడు వివరణ కొనసాగిస్తున్నాడు. మరికొందరు శ్రద్ధగా వింటారు. కంఠస్థం చేస్తారు. కంఠస్థంచేసి ఇతరులకి చిలకపలుకులవలే ఇతరులకి అందచేస్తారు. అందిస్తారు. రెండో బొమ్మలా వీళ్ళు రెండో రకం. వీరు కొంతవరకు సమాజానికి మంచిని చేస్తారు. మంచి చేకూరుస్తారు. ఇక మూడోరకం- మూడో బొమ్మలా విన్నదంతా హృదయస్థం చేసుకుంటారు. తనలోనే దాచుకుంటారు. దాచుకున్న దానిని అనుసరిస్తారు. అవలంబించడానికి ప్రయత్నం చేస్తారు. అది తన వివరణను ముగించేడు శిష్యుడు. వింటున్న వారంతా శభాష్’’ అనుకున్నారు. ఆధ్యాత్మికాన్ని అరటి పండులా వొలిచి ఉదాహరణ పూర్వకంగా అరచేతిలో చూపెడుతున్న ఆ శిష్యుని వివేకానికి సభికులంతా అభినందించేరు. గురువుగారు కూడా శిష్యుడి ప్రజ్ఞకి ఆనందపడి శిష్యుడ్ని ఆశీర్వదించేరు. శిష్యుడితోసహా సభికులందరూ ఆరోజుకి అంతా అయిపోయిందుకున్నారు.
అప్పుడు గురువుగారు మనదగ్గరున్న సంచీలోంచి మరో బొమ్మని నాలుగోదాన్ని తీసి తనముందున్న టేబుల్‌పై పెట్టారు. ఓసారి వివరణ ఇచ్చిన శిష్యుడివంకా కూచున్న సభికుల వంకా ప్రశ్నార్థకంగా చూసేరు. అక్కడే పడి ఉన్న ఇనుప కడ్డీని ఈ నాలుగో బొమ్మ చెవిలో దూర్చేరు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధంకాలేదు. చెవిలో దూరిన ఆ ఇనుపకడ్డీ ఆ బొమ్మలో దూరిపోయి, కొంతసేపు ఎటురాకుండా ఉండిపోయింది సభికులంతా బొమ్మ వంక గురువుగారి తదేక దృష్టితో చూస్తున్నారు. కొంతసేపు గడిచింది. లోపలికి దూరుకుపోయిన ఇనుపకడ్డీ అలాగే లోపలి ఉండిపోయింది. మరికొంతసేపు గడిచిన తర్వాత లోపల ఉన్న ఇనుపకడ్డీ మెల్లగా బొమ్మకున్న చేతులలోంచి రాసాగింది. క్రమంగా బొమ్మకున్న చేతులలోంచి కడ్డీ బైటకొచ్చింది. గురువుగారు శిష్యుని వంక ప్రశ్నపూర్వకంగా చూసేరు. సభికులవైపు చూసేరు. అయోమయంగా చూస్తున్న అందర్నీ ‘‘ఈ నాలుగో బొమ్మను చూసేరుకదా. ఈ బొమ్మ మనకి ఏంచెప్తోంది. ఏ సందేశం ఇస్తోంది?’’అనడిగేరు. ముఖ్యంగా అంతవరకు మూడు బొమ్మల గురించి వివరణ ఇచ్చిన శిష్యుడ్ని అందరూ తెలీదన్నట్టు తెల్లమొహం వేసారు.
అప్పుడు గురువుగారు చెప్పేరు. చూసేరా? ఆ మూడో బొమ్మ విన్నదంతా హృదయస్థం చేసుకుంది. ఈ నాలుగో బొమ్మ విన్నదంతా హృదయస్థం చేసుకుని, కొంచెంసేపు అనుభవంలోకి విన్నదంతా తెచ్చుకుంది. తమ చేతుల్లోకి వచ్చిన బోధనలన్నిటినీ చేతల ద్వారా అంటే ఆచరణలోకి తెచ్చుకుంది. అంటే చేతల ద్వారా ఆచరణ అంటే ‘‘సేవ’’ ద్వారా అందరికీ అందించాలనుకుంది. బోధల్ని ప్రబోధల్ని ఆచరణలో పెట్టింది. అందుకనే.
ఈ నాలుగో బొమ్మ అన్ని బొమ్మలలోను ‘ఉత్తమోత్తమమైనది. అలాగే అనుభవానికొచ్చిన దాన్ని సేవరూపంలో ఆచరణలోపెట్టే సాధకులు ఉత్తమోత్తమ సాధకులు.’’ నాల్గో బొమ్మ పరోక్షంగా చెప్పే ఆధ్యాత్మిక రహస్యాన్ని విప్పి చూపించేరు. అనుభవ పూర్వకంగా సాధన అంటే ఏమిటో విశదీకరించేరు.
అందరికీ జ్ఞానోదయమయ్యింది. ఆధ్యాత్మికం అనుభవ సారానికొచ్చి ఆచరణలోనికి తెచ్చుకోవడమే సాధకుల కర్తవ్యం అని అర్థమయ్యింది.
***