జాతీయ వార్తలు

ప్రత్యూషకు రాహుల్ చిత్రహింసలు:ఎఫ్‌ఐఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష (బాలికా వధు ఫేమ్)ను ఆమె బోయ్‌ఫ్రెండ్ రాహుల్ శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేశారు. ప్రత్యూష తల్లి ఇచ్చిన తాజా ఫిర్యాదుపై కేసు నమోదు చేశాక రాహుల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. అనారోగ్యానికి లోనైన రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి నుంచి విడుదలైన వెంటనే అతడ్ని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. రాహుల్‌కు గతంలోనే ఓ మహిళ వల్ల కుమారుడు పుట్టాడని అయినప్పటికీ ప్రత్యూషకు చేరువై ప్రేమిస్తున్నట్లు నటించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం ప్రత్యూషను తరచూ కొడుతూ దుర్భాషలాడేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.