అంతర్జాతీయం

మోదీ ఇంటర్నెట్ స్టార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైమ్స్ ప్రభావశీల జాబితాలో ప్రధాని

న్యూయార్క్, మార్చి 17: ప్రపంచంలో అత్యంత ప్రభావశీలత వ్యక్తుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చోటుసంపాదించుకున్నట్టు టైమ్స్ మ్యాగిజైన్ వెల్లడించింది. ఇంటర్నెట్‌లో రెండోసారి ఆయన ఈ ఘనత సొంతం చేసుకున్నారు. సమాజిక ప్రసార మాధ్యమాల్లో మోదీ ఇంటర్నెట్ స్టార్‌గా నిలిచారని పత్రిక పేర్కొంది. గత ఏడాది పాకిస్తాన్ పర్యటన అంశాన్ని మోదీ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రభుత్వ పనితీరుకు సంబంధించి అనేక అంశాలను అసాధరణ రీతిలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడంతోప్రశంసలు వెల్లువెత్తాయి. అందుకే రెండో ఏడాది కూడా ప్రభావశీలత వ్యక్తుల జాబితలో తాన స్థానం పదిలం చేసుకున్నారని టైమ్స్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన 30 మంది ప్రముఖుల జాబితాలో భారత ప్రధాని చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, రియాల్టీ టివి స్టార్ కిమ్ కర్దషియన్, ఆమె భర్త కేనే వెస్ట్, రచయిత జెకె రౌలింగ్, మాజీ ఒలింపిక్ అథ్లెట్ కైట్లెన్ జెనె్నర్, సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డ్‌లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా ఉన్న మోదీకి సుమారు 1.80 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే 32 మిలియన్ల ఫేస్‌బుక్ లైక్‌లు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా మోదీ స్వయంగా లాహోర్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. మోదీ సందర్భానుసారంగా దౌత్య సంబంధాలు మెరుగుకు కృషి చేస్తున్నట్టు టైమ్స్ ప్రశంసించింది.