రాష్ట్రీయం

నకిలీ సర్ట్ఫికెట్ల రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరి అరెస్టు.. కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం
హైదరాబాద్, డిసెంబర్ 4: ఐటి రంగంలో ఉద్యోగాలు పొందేందుకు వీలుగా నకిలీ అనుభవ, ఆఫర్, అప్రైజల్ సర్ట్ఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.22లో జరుగుతున్న ఈ నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ ముఠాకు చెందిన ఒకరిని అరెస్టు చేసి ఆ కార్యాలయం నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఆరు నకిలీ స్టాంప్‌లు, నకిలీ డాక్యుమెంట్లు, రూ.26 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కె.నరసింహరాజు (27) 2009లో ఉద్యోగానే్వషణకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలా నకిలీ అనుభవ పత్రాలు వంటివి ఇవ్వడం ద్వారా ఐటి ఉద్యోగాలు చాలా మంది పొందుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇలా సర్ట్ఫికెట్లు ఇవ్వడం ద్వారా చాలా డబ్బును ఆయా సంస్థలు సంపాదిస్తున్నట్లు సమాచారం సేకరించాడు. అలా ఒక పథకం ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.22లో కార్యాలయాన్ని ప్రారంభించి వివిధ ఐటి కంపెనీల తాలూకు అనుభవ పత్రాలు, పే స్లిప్పులు, రిలీవింగ్ లెటర్లు, ఐడి కార్డులు తయారు చేసి ఇవ్వడం ప్రారంభించాడు. ఇందుకు గాను ఒక్కో దానికి అభ్యర్థుల అవసరాన్ని బట్టి రూ.15 వేల నుంచి 25 వేల వరకు తీసుకుంటున్నాడు. జాబ్ పోర్టల్స్ ద్వారా ఉద్యోగానే్వషణలో ఉన్న వారి వివరాలు సేకరించి వారిని ఫోన్‌లో సంప్రదించి తన వద్దకు రప్పించుకుంటున్నాడు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో చాలా వరకు ఇలా నకిలీ సర్ట్ఫికెట్లు ఇవ్వడం ద్వారా చాలా మంది ఇతని ద్వారా ఉద్యోగాలు పొందారు. ఎంటరెప్ట్స్ ఐటి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌డ్రీమ్స్ ఫిక్సెల్‌ఫ్లో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పేర్లతో నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి ఇచ్చాడు. దీంతో దాదాపు 100 మందికిపైగా ఉద్యోగాలు వివిధ పేరొందిన కంపెనీల్లో పొందారని టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఐటి కంపెనీలు తాము ఎంపిక చేసిన అభ్యర్థుల పూర్వ చరిత్రను విచారించేందుకు ధర్డ్ పార్టీకి అప్పగిస్తూ ఉంటాయని, వాటిని కూడా మేనేజ్ చేసి ఉద్యోగాలు వచ్చేవిధంగా కృషి చేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు డిసిపి బి.లింబారెడ్డి తెలిపారు.